వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా: జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ ఇదే

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థలకు నగారా మోగింది. పంచాయితీ, జెడ్పీటీసీ సహా మున్సిపల్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. రెండు దశల్లో ఈ ఎన్నికలు జరగనున్నాయి. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు రెండు విడతల్లో నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది .ఈ నెల 21న తొలిదశ, 24న రెండో దశ ఎన్నికలు జరగనున్నాయి. ఇక మున్సిపల్ ఎన్నికల పోలింగ్ మార్చి 27న జరగనుంది. ఏకకాలంలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల కౌంటింగ్ ఈ నెల 29న నిర్వహించనున్నారు.

మార్చిలోనే స్థానిక సంస్థల ఎన్నికలు.. షెడ్యూల్ విడుదల

మార్చిలోనే స్థానిక సంస్థల ఎన్నికలు.. షెడ్యూల్ విడుదల

రాష్ట్రంలో ఈ నెలలో ఏకకాలంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని భావించిన ప్రభుత్వం అందుకు సంబంధించిన ప్రతిపాదనలను ఏపీ ఎలక్షన్ కమిషనర్ ముందు ఉంచింది. ఇక సాధ్యాసాధ్యాలను పరిశీలించిన కమిషనర్ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారు. ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ సర్కార్ భావించిన విధంగానే ఎన్నికల షెడ్యూల్ వెలువడటం ఏపీ ప్రభుత్వానికి ఊరటనిచ్చింది.

జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల తొలివిడత పోలింగ్ షెడ్యూల్

జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల తొలివిడత పోలింగ్ షెడ్యూల్

జెడ్పిటిసి ,ఎంపిటిసి ఎన్నికల షెడ్యూల్ గమనిస్తే మొదటి విడత జెడ్పిటిసి, ఎంపీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ మార్చి 7వ తేదీన విడుదల చేయనున్నారు.

ఇక నామినేషన్ల స్వీకరణ 9వ తేదీ నుండి 11వ తేదీ వరకు చేయనున్నారు. 12వ తేదీన స్క్రూటినీ నిర్వహించి, అభ్యంతరాలు ఉంటే 13వ తేదీన తెలియజేయాలని 14వ తేదీన అభ్యంతరాలను పరిశీలిస్తారని , అలాగే నామినేషన్లు ఉపసంహరించుకోవటానికి 14వ తేదీ చివరి తేదీ అని ప్రకటించారు.ఇక తొలి విడత ఎన్నికలు 21వ తేదీన నిర్వహించనున్నారు.

జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల రెండోవిడత ఎన్నికల షెడ్యూల్

జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల రెండోవిడత ఎన్నికల షెడ్యూల్

ఇక రెండో విడత జెడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికల షెడ్యూల్ చూస్తే మార్చి పదో తేదీన నోటిఫికేషన్ రానుంది. ఇక 12వ తేదీ నుండి 14వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. 15వ తేదీన స్క్రూటినీ నిర్వహించి , 16వ తేదీన అభ్యంతరాలను తెలియజేయాలని, 17వ తేదీన అభ్యంతరాలను పరిశీలిస్తాం అని, ఉపసంహరణకు కూడా ఆఖరి తేదీ 15వ తేదీనేనని షెడ్యూల్ ప్రకటించారు. రెండవ విడత జెడ్పిటిసి,ఎంపిటిసి ఎన్నికలను 24వ తేదీన నిర్వహించనున్నారు. ఇక ఈ రెండు విడతల్లో జరిగిన ఎన్నికలకుగాను కౌంటింగ్ మార్చి 29న చేయనున్నట్లు ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ ప్రకటించింది.

Recommended Video

AP Local Body Polls : Watch TDP Leaders Met State Election Commissioner | Oneindia Telugu
మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ .. అన్ని ఎన్నికల కౌంటింగ్ మార్చి 29నే

మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ .. అన్ని ఎన్నికల కౌంటింగ్ మార్చి 29నే

ఇక మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ చూస్తే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి 13వ తేదీన నోటిఫికేషన్ వెలువడనుంది. 15వ తేదీ నుండి 17వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. 18వ తేదీన స్క్రూటినీ నిర్వహిస్తారు. 20వ తేదీ నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీగా నిర్ణయించారు. ఇక మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి 27వ తేదీన పోలింగ్ నిర్వహించనున్నారు. మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కూడా మార్చి 29 నే చేయాలని నిర్ణయం తీసుకుంది ఎలక్షన్ కమిషన్. దీనికి సంబంధించి షెడ్యూల్ ను ప్రకటించడంతో ఏపీలో ఎన్నికల వేడి మొదలైంది.

English summary
local body elections schedule released by election commission in Andhra Pradesh. The schedule for the municipal elections, including the ZPTC and the MPTC has been released. The election will be held in two phases. The ZPTC and the MPTC have decided to hold the elections in two phases on march 21st and march 24th . Municipal polls will be held on March 27. Counting of simultaneous local bodies will be held on the 29th of this month.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X