వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ సర్కార్‌ను కేంద్రం అదను చూసి దెబ్బకొట్టిందా? టీడీపీ డిమాండ్..బీజేపీ ఫిర్యాదు: 48 గంటల్లో..!

|
Google Oneindia TeluguNews

అమరావతి: రాష్ట్రంలో అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్‌ను కేంద్ర ప్రభుత్వం అదును చూసి దెబ్బకొట్టిందా? స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయించడంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్రశాఖ నాయకుల వ్యూహాలు ఫలించాయా?- ప్రస్తుతం రాష్ట్రంలో వినిపిస్తోన్న ప్రశ్నలు ఇవి. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా వైసీపీ నాయకులు తమ పార్టీ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారంటూ బీజేపీ రాజ్యసభ సభ్యులు కేంద్రానికి నివేదించిన రెండు రోజుల్లోనే వాయిదా పడటం చర్చనీయాంశంగా మారింది.. ఈ అనుమానాలకు తావిచ్చినట్టయింది.

 తెగించిన టీడీపీ..విశాఖలో దూకుడు: వైసీపీ కంటే రెండడుగులు ముందే: ఏరికోరి మేయర్ అభ్యర్థి ఖరారు.. తెగించిన టీడీపీ..విశాఖలో దూకుడు: వైసీపీ కంటే రెండడుగులు ముందే: ఏరికోరి మేయర్ అభ్యర్థి ఖరారు..

టీడీపీ డిమాండ్..

టీడీపీ డిమాండ్..


ప్రాణాంతక కరోనా వైరస్ రాష్ట్రవ్యాప్తంగా భయంకరంగా విస్తరిస్తోందని, దీన్ని దృష్టిలో ఉంచుకుని స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయాలంటూ కొద్ది రోజుల కిందటే తెలుగుదేశం పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. భారతీయ జనతాపార్టీ, జనసేన కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించాయి. ఇటలీ నుంచి స్వగ్రామానికి వచ్చిన నెల్లూరు జిల్లా విద్యార్థిలో కరోనా లక్షణాలు పాజిటివ్‌గా తేలడం, ఆ జిల్లాలోని అన్ని సినిమా థియేటర్లు, షాపింగ్ మాల్స్‌ను మూసివేయించడం వంటి ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంది ప్రభుత్వం. సరిగ్గా ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ టీడీపీ స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయాలని డిామండ్ చేసింది.

బీజేపీ ఫిర్యాదులు..

బీజేపీ ఫిర్యాదులు..


అదే సమయంలో- బీజేపీ రాష్ట్రశాఖ నాయకులు మరో వైపు నుంచి కేంద్రానికి ఫిర్యాదు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హింసను ప్రేరేపిస్తోందని, రాజకీయ ప్రత్యర్థులపై ప్రాణాంతక దాడులకు పాల్పడుతోందంటూ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను కలిశారు. చిత్తూరు జిల్లా పులిచెర్ల సమీపంలో చోటు చేసుకున్న ఉదంతాన్ని వారు ప్రధానంగా అమిత్ షా వద్ద ప్రస్తావించారు. వీడియో క్లిప్పింగులను చూపించారు. జగన్ సర్కార్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ రెండు అంశాలను పరిగణనలోకి తీసుకుని కేంద్రం.. స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయించిందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.

ఆరు వారాల పాటు..

ఆరు వారాల పాటు..

కరోనా వైరస్ ప్రభావం దేశవ్యాప్తంగా విస్తరించిన ఉదంతాన్ని పరిగణనలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం దీన్ని జాతీయ విపత్తుగా ప్రకటించిన కొన్ని గంటల వ్యవధిలో ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఆరు వారాల పాటు ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ తెలిపారు. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల ప్రక్రియను పరిగణనలోకి తీసుకుంటామని, ఆరు వారాల తరువాత ఎన్నికల ప్రక్రియ మళ్లీ ఆరంభమౌతుందని ఆయన వెల్లడించారు. ఇప్పటి వరకు దాఖలైన నామినేషన్లు, ఏకగ్రీవ ఎన్నికలు యథాతథంగా కొనసాగుతాయని అన్నారు.

ఆరు వారాల తరువాత కొత్త నోటిఫికేషన్..

ఆరు వారాల తరువాత కొత్త నోటిఫికేషన్..

ఆరు వారాల తరువాత పంచాయితీ ఎన్నికలకు కొత్త నోటిఫికేషన్ వెల్లడయ్యే అవకాశం ఉంది. ఎన్నికల కోడ్ యథాతథంగా కొనసాగిస్తామనీ రమేష్ కుమార్ వెల్లడించడం ప్రభుత్వానికి ఇబ్బంది పెట్టే అంశమేనని అంటున్నారు. ఫలితంగా- కనీసం మరో 50 రోజుల పాటు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎలాంటి కీలక నిర్ణయాలను గానీ తీసుకోకూడని, సంక్షేమ పథకాలను ప్రకటించకూడని పరిస్థితులు ఏర్పడినట్టయిందని చెబుతున్నారు.

English summary
A Major set back for Government of Andhra Pradesh. Local Body Elections in Andhra Pradesh was post poned for six weeks. Ruling YSR Congress Party leaders alleged that Union Government led by Bharatiya Janata Party behind the postponed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X