విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

స్థానిక పోరులో సరికొత్త సంప్రదాయం: బీజేపీ-జనసేన ఉమ్మడి మేనిఫెస్టో: ఆసక్తికరంగా.. !

|
Google Oneindia TeluguNews

విజయవాడ: స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీ-జనసేన పార్టీ సరికొత్త సంప్రదాయానికి తెర తీసినట్టు కనిపిస్తోంది. తొలిసారిగా ఉమ్మడి మేనిఫెస్టోను రూపొందించాయి ఈ రెండు పార్టీలు. తాము దక్కించుకునే మున్సిపాలిటీల్లో చేపట్టాల్సిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై రూపొందించుకున్న మేనిఫెస్టో ఇది. పలు ఆసక్తికరమైన అంశాలను ఇందులో చేర్చాయి. ఈ ఉమ్మడి మేనిఫెస్టో గురువారం విజయవాడలో ఆవిష్కరించనున్నారు ఆ పార్టీల నాయకులు.

Recommended Video

AP Local Body Elections: Janasena Bjp Manifesto బీజేపీ-జనసేన సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చినట్టేనా ?

నాడు కృష్ణయ్య..నేడు రామయ్య: ఓడిపోతామని తెలిసీ.. చంద్రబాబు కులం కార్డు: టీడీపీలోనే..!నాడు కృష్ణయ్య..నేడు రామయ్య: ఓడిపోతామని తెలిసీ.. చంద్రబాబు కులం కార్డు: టీడీపీలోనే..!

 అన్ని స్థానాల్లో పోటీ..

అన్ని స్థానాల్లో పోటీ..

రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు, జడ్పీటీసీ, ఎంపీటీసీ, పంచాయతీల్లో పోటీ చేయడానికి కసరత్తు పూర్తి చేశాయి బీజేపీ-జనసేన. దీనికి అవసరమైన సీట్ల సర్దుబాటు ఓ కొలిక్కి వచ్చింది. ఈ రెండు పార్టీల మధ్య కుదిరిన సీట్ల పంపకాలు, ఏఏ స్థానాల్లో పోటీ చేయాలనే విషయాన్న గురువారం అధికారికంగా ప్రకటించనున్నాయి. ఉమ్మడి మేనిఫెస్టోను కూడా అదే సమయంలో ఆవిష్కరిస్తారు.

ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపైనే పోరు..

ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపైనే పోరు..

రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తోన్న ప్రజా వ్యతిరేక విధానాలను కేంద్రబిందువుగా చేసుకుని స్థానిక ఎన్నికల్లో ప్రచార కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయించాయి. ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తోందని, వాటిని ప్రజాక్షేత్రంలోనే ఎండగడతామని బీజేపీ, జనసేన నాయకులు ప్రకటిచారు. ప్రజల్లో అయోమయం, గందరగోళం సృష్టించేలా జగన్ సర్కార్ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోందని మండిపడుతున్నారు.

మండల స్థాయి వరకు సమన్వయ కమిటీలు..

మండల స్థాయి వరకు సమన్వయ కమిటీలు..


రెండు పార్టీల మధ్య సీట్ల పంపకాల విషయంలో ఎలాంటి భేదాభిప్రాయాలు తలెత్తకుండా ఉండటానికి మండల స్థాయిలో సమన్వయ కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. మెజారిటీ స్థానాలను దక్కించుకోవడమే లక్ష్యంగా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు. పోలీసుల సహకారంతో ప్రభుత్వం బీజేపీ, జనసేన కార్యకర్తల మీద దాడులు చేస్తున్నారని, కేసులు బనాయిస్తున్నారని ఆరోపిస్తున్నారు.

English summary
Head of Local Body Elections in Andhra Pradesh, Bharatiya Janata Party and Jana Sena Party is all set release their combined manifesto on Thursday. BJP and Jana Sena Coordination Committee decides the issues in manifesto.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X