వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కుల పంచాయితీగా మారిన స్థానిక ఎన్నికల వివాదం .. తీవ్ర అసహనంలో ప్రజలు

|
Google Oneindia TeluguNews

స్థానిక సంస్థల ఎన్నికలు ఏపీలో కుల విద్వేషాలను రెచ్చగొడుతున్నాయి. సాక్షాత్తు సీఎం జగన్ మోహన్ రెడ్డి కులాల ప్రస్థావన తీసుకురావటం ,ఎన్నికల వాయిదాకు కారణం చంద్రబాబు, ఏపీ ఎన్నికల ప్రధానాధికారి రమేష్ కుమార్ లు ఒకే కులం కావటంతో బాబు మాట మేరకు నిర్ణయం తీసుకున్నారని చెప్పటం పెద్ద దుమారం రేపింది .దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు . ప్రశాంతంగా ఉండే ప్రజల మధ్య కుల పంచాయితీలు పెట్టేలా రాజకీయ నాయకులు వ్యాఖ్యలు చెయ్యటం అవసరమా అని మండిపడుతున్నారు.

ఆ కులాన్ని అణచివెయ్యాలనే ఆలోచనే సీఎం జగన్ పతనానికి నాంది : గోరంట్ల ఫైర్ఆ కులాన్ని అణచివెయ్యాలనే ఆలోచనే సీఎం జగన్ పతనానికి నాంది : గోరంట్ల ఫైర్

ఏపీలో కుల పంచాయితీ... విసిగిపోతున్న ప్రజలు

ఏపీలో కుల పంచాయితీ... విసిగిపోతున్న ప్రజలు

ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ ఒక సామాజిక వర్గానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటుందని , వారిని అణచివేసే ప్రయత్నాలు చేస్తుందని చాలా కాలంగా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇక తాజాగా స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసిన నేపధ్యంలో సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలతో మరోమారు ఏపీలో సామాజిక సమీకరణాలు మొదలయ్యాయి. ప్రభుత్వమే చీటికి మాటికి ఓ సామాజిక వర్గం అంటూ పదే పదే విరుచుకు పడడం ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఇబ్బంది పెడుతుంది . ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పని చేయాల్సిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కులాల ప్రస్తావన తీసుకురావడం ప్రజలకు ఏ మాత్రం రుచించటం లేదు .

 ఎన్నికల వాయిదాకు కారణం కరోనా అంటున్న ఎన్నికల కమీషన్

ఎన్నికల వాయిదాకు కారణం కరోనా అంటున్న ఎన్నికల కమీషన్

ప్రపంచవ్యాప్తంగా కరోనా వణికిస్తుంది. ఇక ఇండియాలోనూ కరోనా కేసులు 110కి చేరాయి. దీంతో అప్రమత్తమైన కేంద్ర సర్కార్ తగు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వాలకు సూచించింది. ఇక పొరుగు రాష్ట్రమైన తెలంగాణాలో కూడా నిర్బంధ సెలవులు ప్రకటించారు. కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం కరోనాతో భయం లేదని ఎన్నికలు జరిగి తీరాల్సిందే అన్నట్టు వ్యవహరించటం తెలిసిందే . అయితే ప్రజల ఆరోగ్యం ప్రధానాంశంగా భావించిన ఎన్నికల కమీషన్ ఎన్నికలను వాయిదా వేసింది .

 కులం పేరుతో అధికార, ప్రతిపక్షాల మాటల యుద్ధం

కులం పేరుతో అధికార, ప్రతిపక్షాల మాటల యుద్ధం

సామూహికంగా జరిగే ఎన్నికలను ఆరు వారాలు వాయిదా వెయ్యటంతో వైసీపీ రాష్ట్ర ఎన్నికల అధికారికి కులాన్ని ఆపాదిస్తూ విమర్శిస్తున్న తీరు చాలా మందికి నచ్చటం లేదు . ఇక అధికార పార్టీ నేతలు ఏపీలో ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసి మండిపడితే, ప్రతిపక్ష పార్టీలు ఆ సామాజిక వర్గానికి వత్తాసు తీసుకుని అధికార పక్షంపై విమర్శలు చేస్తున్నాయి. ఇక ప్రజలు కుల రాజకీయాలు దేనికి అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అనవసరంగా కులాల పేరుతో దూషణలు మంచిది కాదంటున్న ప్రజలు

అనవసరంగా కులాల పేరుతో దూషణలు మంచిది కాదంటున్న ప్రజలు

ఇక ఎన్నికలు వాయిదా పడితే వచ్చే ముప్పు ఏమిటని ప్రశ్నిస్తున్నారు. మీ ఎన్నికలు, మీ రాజకీయాల కోసం అనవసరంగా కులాల పేరుతో దూషణలు మంచిది కాదని అంటున్నారు.
ఎన్నికల కమిషన్ నిర్ణయాలకు, ఓ సామాజిక వర్గానికి సంబంధం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. 14వ ఆర్థిక సంఘం నుంచి రావాల్సిన నిధులు ఎన్నికలు జరగకపోతే వెనక్కి వెళ్లిపోతాయంటూ చేస్తున్న వాదనలో వాస్తవం ఎంత అన్న చర్చ సైతం చేస్తున్నారు .

రాజకీయ మనుగడ కోసమే కుల పంచాయితీ

రాజకీయ మనుగడ కోసమే కుల పంచాయితీ

రాజకీయ మనుగడ కోసం ప్రతిపక్షాలు, ప్రతిపక్షాలు లేకుండా చేసి ఏక చత్రాధిపత్యంగా పాలించాలని అధికార పక్షం చేస్తున్న ప్రయత్నాల్లో అనవసరంగా కులాలను తీసుకువస్తున్నారని, లేనిపోని పంచాయితీ పెడుతున్నారని భావిస్తున్నారు ప్రజలు . ఇక కుల పంచాయితీలు చాలని , అసలే పుట్టెడు కష్టాల్లో ఉన్న ఏపీని ఎలా అభివృద్ధి వైపు నడిపించాలి అనే ఆలోచన చేసి ముందుకు తీసుకువెళ్ళాలి కానీ ఈ తరహా ఘర్షణలతో అభివృద్ధి సాధ్యం కాదని వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

English summary
Local body elections provoke casteist hatred in AP. CM Jagan Mohan Reddy is the reason for the caste controvercy now in AP . CM Jagan alleged that The postponement of the local body elections due to Chandrababu and AP election chief Ramesh Kumar fron the same caste . Politicians are creating nuesance with caste politics for their political dominance. AP people discussing about the caste politics .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X