అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎమ్మెల్యే ఆర్కే కనిపించటం లేదు:పోలీసుస్టేషన్ లో ఫిర్యాదు: ఆందోళనగా ఉందంటూ..!

|
Google Oneindia TeluguNews

మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే కనిపించటం లేదని పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు అందింది. ఏపీకి మూడు రాజధానుల పైన శాసనసభలో సీఎం వ్యాఖ్యలు..జీఎన్ రావు కమిటీ సిఫార్సుల తరువాత రాజధాని తరలింపు ప్రతిపాదనలకు వ్యతిరేకంగా స్థానిక రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే, అసెంబ్లీలో సీఎం రాజధాని పైన వ్యాఖ్యలు చేసిన సమయం నుండి స్థానిక ఎమ్మెల్యే ఆర్కే కనిపించటం లేదని రైతులు వాదిస్తు న్నారు. దీంతో...తమ ఎమ్మెల్యే కనిపించటం లేదని...ఆయన్ను వెతికిపెట్టాలని..ఆ ప్రాంత రైతులు..కూలీలు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసారు.

రాజధాని ఆందోళనలపై అధికార వర్గాల నిఘా : ఇంటిలిజెన్స్ హెచ్చరికలతో పోలీసులు అప్రమత్తంరాజధాని ఆందోళనలపై అధికార వర్గాల నిఘా : ఇంటిలిజెన్స్ హెచ్చరికలతో పోలీసులు అప్రమత్తం

ఫిర్యాదులో కాపీలో ఆవేదన..
ఎమ్మెల్యే ఆర్కే కనిపించటం లేదంటూ రైతులు చేసిన ఫిర్యాదు కాపీలో తమ ఆవేదన వెలిబుచ్చారు. రాజధానిపై నెలకొన్న సందిగ్దతపై తమ గోడు వెళ్లబుచ్చుకుందామంటే తమ ఎమ్మెల్యే ఎక్కుడున్నారో తెలియట్లేదని పేర్కొన్నారు. ఎమ్మెల్యే కోసం తీవ్ర ఆందోళన చెందుతున్నామని... వెంటనే తగు చర్యలు తీసుకుని మా శాసభన సభ్యులను మాకు అప్పగిస్తారని భావిస్తున్నామంటూ ఫిర్యాదులో వివరించారు. గత వారం రోజుల నుంచి మంగళగిరి నియోజకవర్గంలో గానీ.. ఆయన కార్యాలయంలోగానీ.. నివాసంలో గానీ ఎక్కడా ఆయన కనిపించట్లేదని పేర్కొన్నారు.

Local people of Mangalagiri complaint in police station on MLA RK missing

'తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావట్లేదని..క వెంటనే ఆయన్ను వెతికి మాకు అప్పగించాల్సిందిగా కోరుతున్నామంటూ ఫిర్యాదులో రాజధాని రైతులు, రైతు కూలీలు పేర్కొన్నారు. ఈ మేరకు ఫిర్యాదు పత్రంలో రాజధాని రైతులు, కూలీలు సంతకాలు కూడా చేశారు. ప్రదర్శనగా వచ్చి పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు అందించారు.

మంగళగిరి నియోజకవర్గ పరిధిలోనూ..
రాజధాని మార్పు ప్రతిపాదనల పైన మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని గ్రామాల్లోనూ ఆందోళన వ్యక్తం అవుతోంది. మంగళగిరిలో రైతులు కుటుంబ సభ్యులతో కలిసి ఆందోళన నిర్వహిస్తున్నారు. రోడ్డు మీద ధర్నా చేస్తున్నారు. అదే విధంగా తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి సైతం ఇప్పటి వరకు స్పందించకపోవటాన్ని ఆ ప్రాంత రైతులు వ్యతిరేకిస్తున్నారు.

'వెలగపూడిలో ఆరో రోజు ఆందోళనలు కొనసాగుతున్నాయి. రోడ్డు మీద పశువులు..ట్రాక్టర్లను అడ్డంగా పెట్టి రాకపోకలను అడ్డుకుంటున్నారు. నల్ల జెండాలతో రాజధాని పరిధిలో ప్రదర్శనలు నిర్వహించారు. అర గుండులతో ఆందోళనల్లో పాల్గొంటున్నారు.

English summary
Local people of Mangalagiri complaint in police station on MLA RK missing. They given complaint that MLA seem to be diasspear since CM hinted capital shifting in Assembly.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X