వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైసీపీఎమ్మెల్యేకు వ్యతిరేకంగా స్థానికుల ధర్నా.!అసెంబ్లీ సాక్షిగా జగన్‌ క్షమాపణ చెప్పాలన్న మందకృష్ణ

|
Google Oneindia TeluguNews

Recommended Video

తోళ్ల పరిశ్రమకు వ్యతిరేకంగా ధర్నా చేసిన గూడూరు ప్రజలు | Gudur People Dharna Over The Leather Factory

నెల్లూరు/హైదరాబాద్ : నియోజక వర్గాల్లో వైసీపి ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత బహిర్గతవుతోంది. నెల్లూరు జిల్లాలోని గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్‌కు వ్యతిరేకంగా స్థానికులు ఆందోళనకు దిగారు. కోట మండలం కొత్తపట్నంలో అంతర్జాతీయ తోళ్ల పరిశ్రమ ఏర్పాటుపై గూడూరులో శనివారం ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించేందుకు అధికారులు విచ్చేశారు. అయితే..

ఈ తోళ్ల పరిశ్రమ ఏర్పాటును స్థానికులు వ్యతిరేస్తున్నారు. అలాగే స్థానిక ఎమ్మెల్యే వరప్రసాద్ తమ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా అధికారులకు సహకరిస్తున్నారంటూ కొత్తపట్నం వాసులు ఆందోళనకు దిగారు. దీంతో ప్రజాభిప్రాయ వేదిక వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కాగా, ప్రస్తుతం భారీ బందోబస్తు మధ్య ప్రజాభిప్రాయ సేకరణ కొనసాగుతున్నట్టు సమాచారం.

Locals dharna against YCP MLA.!Mandakrishna demands Jagans apologizy.!!

ఇదిలా ఉండగా జగన్‌మోహన్‌రెడ్డి పరిపాలన ఎలా ఉండబోతోందో రెండు నెలల్లో తెలిసిపోయిందని ఎమ్మర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. శనివారం ఆయన గుంటూరులో మాట్లాడుతూ, ఎస్సీ వర్గీకరణపై అసెంబ్లీ సాక్షిగా చేసిన వ్యాఖ్యలను సీఎం జగన్‌ ఉపసంహరించుకోవాలన్నారు.

అలాగే తన పాదయాత్రకు అనుమతించకపోవడం దారుణమన్నారు. జగన్‌ పాలన ఎలా ఉండబోతోందో రెండు నెలల్లో తెలిసిపోయిందని, పోలీసులతో అణచాలని చూస్తే గతంలో ముఖ్యమంత్రులకు పట్టిన గతే జగన్‌కు పడుతుందన్నారు. వాగ్దానాలను నిలబెట్టుకోవడంపై జగన్‌ తన సంకల్పాన్ని ప్రదర్శించాలని, ఈనెల 22 నుంచి 27వరకు కలెక్టరేట్ల వద్ద దీక్షలు జరుపుతామని కృష్ణమాదిగ అన్నారు.

English summary
Public opposition to YCP legislators is being exposed in the constituencies. The locals have raised their voice against Varaprasad, a Gudur MLA in Nellore district.CM Jagan should withdraw the comments made by the Assembly as a witness on the SC classification. He also refused to allow his Pada yathra.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X