విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విశాఖలో మరో ప్రమాదం: ఫార్మా కంపెనీలో భారీగా ఎగిసిన మంటలు, పలువురికి గాయాలు

|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: నగరంలో మరో ప్రమాదం చోటు చేసుకుంది. పరవాడలోని జవహరలాల్ నెహ్రూ ఫార్మా సిటీలో సోమవారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. రాంకీ ఎస్ఈటీపీ సాల్వెంట్స్ బిల్డింగ్‌లో పేలుళ్ల కారణంగా భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో స్థానికులు, సంస్థ సిబ్బంది భయంతో దూరంగా పరుగులు తీశారు.

Recommended Video

Vizag Pharma City Mishap: 50 అడుగుల వరకు మంటలు - భారీగా రసాయనాల నిల్వే కారణం... రియాక్టర్లు పేలి !

ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటన మరువకముందే తాజా ప్రమాదం చోటు చేసుకోవడంతో స్థానికంగా అలజడి నెలకొంది. ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 12 ఫైరింజిన్లతో మంటలను అర్పేందుకు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నాయి.

 Locals injured as massive fire engulfs chemical plant in Vizag

పలుమార్లు పేలుళ్లు సంభవిస్తుండటంతో అగ్ని మాపక సిబ్బంది సమీపంలోకి వెళ్లలేకపోతున్నారు. దీంతో అగ్నిమాపక సిబ్బంది కొంత దూరం నుంచే మంటలను ఆర్పివేసే ప్రయత్నం చేశాయి. తీవ్రంగా శ్రమించి మంటలను అర్పివేశాయి. కాగా, ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.

భారీగా మంటలు వెలువడటంతో సమీపంలోని ఇతర కంపెనీలకు వ్యాపించే ప్రమాదం ఉందని స్థానికులు, ఇతర సంస్థల సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. ఈ ప్రమాదం కారణంగా ఆ ప్రాంతమంత దట్టమైన పొగలు అలుముకున్నాయి. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని సమాచారం. అయితే, పేలుళ్ల కారణంగా పలువురు గాయాలపాలైనట్లు తెలిసింది. భారీ ఆస్తి నష్టం కూడా జరిగినట్లు తెలుస్తోంది.

English summary
Several people were injured in an explosion at a chemical factory in Andhra Pradesh's Visakhapatnam on Monday night. Ramky CETP Solvents's building in Pharma City blew up due to unknown reasons. Locals said they heard around a dozen explosions in the building.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X