వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లొకంటో.కామ్‌:తస్మాత్ జాగ్రత్త!...ఇక్కడ అమ్మాయిల పేరుతో అన్ని విధాలా దోచేస్తారు

By Suvarnaraju
|
Google Oneindia TeluguNews

Recommended Video

Beware of Adultery in Locanto Site లొకంటో.కామ్‌ తో తస్మాత్ జాగ్రత్త!

హైదరాబాద్:స్థానిక వాణిజ్య ప్రకటనలు ఉచితంగా ప్రచురించుకొని వ్యాపారాభివృద్ది సాధించుకునేందుకు ఉద్దేశించిన "లొకంటో.కామ్‌" కొందరు ఛీటర్ల కారణంగా అక్రమాలకు అడ్డాగా మారుతోంది.

ఈ సైట్‌ను వేదికగా చేసుకుని వ్యక్తులను ముఖ్యంగా మగాళ్లను నిలువునా ముంచే మోసగాళ్ల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఈ సైట్ ను అడ్డాగా చేసుకొని కొందరు సైబర్‌ నేరస్తులు యధేచ్చగా వ్యభిచార దందా కొనసాగిస్తున్నారు. ఇలా గడిచిన నెలరోజుల వ్యవధిలోనే మూడు ఉదంతాలు బయటపడడం కలకలం రేపుతోంది. ఇంకా ఇలాంటివి వెలుగులోకి రాని వ్యవహారాలు చాలానే ఉండి ఉండొచ్చని సైబర్‌ క్రైమ్‌ పోలీసులు భావిస్తున్నారు. వివరాల్లోకి వెళితే...

"లొకంటో.కామ్‌"...అక్రమార్కులకు అవకాశం

స్థానిక వాణిజ్య ప్రకటనలు ఉచితంగా పొందుపరుచుకునేందుకు ఉద్దేశించిన ‘లొకంటో.కామ్‌' అక్రమాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారుతోందన్న విషయం ఆలప్యంగా వెలుగుచూసింది. ఈ సైట్‌ను వేదికగా మోసాలకు పాల్పడే వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ఇలా దందాకు పాల్పడేవారిలో ఎక్కువమంది ఉత్తరాదికి చెందిన వారే సూత్రధారులుగా పోలీసులు భావిస్తున్నారు. దీనిద్వారా మోసపోయినవారు బయటకు చెప్పుకోలేక గుట్టుగా ఉండిపోతున్నట్లుగా అంచనా వేస్తున్నారు.

కాల్ గాళ్స్ లాగా...ముగ్గులోకి లాగడం

కాల్ గాళ్స్ లాగా...ముగ్గులోకి లాగడం

ఈ సైట్‌ ద్వారా జనాలను ముఖ్యంగా మగాళ్లను మోసగించేందుకు సైబర్‌ నేరగాళ్లు ప్రధానంగా మసాజ్,వ్యభిచారం వంటి వాటిని ఆయుధంగా వాడుకుంటున్నారు. ముందుగా ఇంటర్‌నెట్‌ ద్వారా సోషల్ మీడియా నుంచి సేకరించిన, లేదా పరిచయస్తుల ఫోటోలు, జూనియర్‌ ఆర్టిస్టుల ఫొటోలను ఆ సేవలు అందించేవారిగా ఈ సైట్ లో పోస్ట్ చేస్తారు. వారు ప్రకటనతో పాటు సెల్‌ నెంబర్లు ఇస్తూ ‘ఆసక్తి' ఉంటే కాల్‌ చేయాల్సిందిగా సూచిస్తున్నారు. ఆ నంబర్ కు ఎవరైనా ఫోన్‌ చేస్తే అందమైన గొంతుతో ఉండే యువతులు, స్త్రీలు మాట్లాడుతున్నారు. పోస్ట్‌ చేసిన ఫొటోలో ఉన్నది తామేనని, అన్ని రకాల పేవలకు తాము సిద్ధమే నంటూ వాళ్లు తమకు ఫోన్ చేసిన వారిని ముగ్గులోకి దింపుతున్నారు.

ఇలా...డబ్బు లాగేస్తారు

ఇలా...డబ్బు లాగేస్తారు

ఈ సేవల కోసం తమను కలవాలన్నా...తాము రావాలన్నా కొంత మొత్తం అడ్వాన్స్‌గా చెల్లించాలంటూ వారు తమ బ్యాంకు ఖాతా వివరాలు ఇస్తారు. వీటిలో డబ్బు పడేంతవరకు మాటలతో మురిపించిన వాళ్లు ఒక్కసారి డబ్బులు పడ్డాక సెల్‌ఫోన్లు స్విచ్ఛాఫ్‌ చేయడంతో వీళ్లు నిండా మునిగిపోతున్నారు. ఈ మోసగాళ్ల తరఫున మాట్లాడే మరికొందరు మహిళలు మరో అడుగు ముందుకేసి ప్రకటనల్లో ఇస్తున్న ఫోన్‌ నెంబర్లకు ‘ఓన్లీ వాట్సాప్‌' అంటూ ట్యాగ్ లైన్ పొందుపరుస్తున్నారు. దీని వెనుక ఉద్దేశ్యం ఏమిటంటే...వాళ్లు ఎవరితోనైనా మాట్లాడాలన్నా అన్నీ వాట్సాప్‌ కాల్స్‌ మాత్రమే చేయడం...అందుకోవడం చేస్తారు. కారణం...వాట్సాప్ కాల్ కు ఫోన్‌లో సిమ్‌ ఉండాల్సిన అవసరం లేకపోవడం, కేవలం నెట్‌ ఉంటే సరిపోవడమే ఇందుకు కారణం. ఫలితంగా వీరు ఎక్కడ నుంచి కాల్స్‌ చేస్తున్నారన్నది గుర్తించడం సాధ్యం కాదు. మరి కొందరు ఆనవాళ్లు దొరక్కుండా మరో అడుగు ముందుకేసి పేటియం ఆప్షన్ వాడుకుంటుండటం విశేషం.

ఇలాగే...గణేష్: ఆమె ఫిర్యాదు

ఇలాగే...గణేష్: ఆమె ఫిర్యాదు

కీసర ప్రాంతానికి చెందిన గణేష్‌ అనే మోసగాడు ఇలాగే లొకంటో.కామ్‌ను వాడుకున్నాడు. సినీ తారలతో పాటు అనేక ఫొటోలను ఇందులో పోస్ట్‌ చేసిన గణేష్‌ వీరంతా కాల్‌గరల్స్‌ అంటూ పేర్కొని, ఆసక్తి ఉన్న వారు సంప్రదించాలంటూ డబ్బు డిమాండ్‌ చేశాడు. అందులో ఓ క్యారెక్టర్‌ నటి ఫోటో పెట్టడంతో ఆమె సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా ఆ క్రమంలో గణేష్‌ కటకటాల్లోకి చేరాడు. అలాగే బెంగళూరుకు చెందిన ఓ యువతి తాను అన్ని రకాల మసాజ్‌లు చేస్తానంటూ, ఆసక్తి ఉన్న వారు వాట్సాప్‌లో సంప్రదించాలంటూ బేగంపేట చిరునామాతో లొకంటోలో పోస్ట్‌ చేసింది. వారి నుంచి బ్యాంకు ఖాతాలో డబ్బు డిపాజిట్‌ చేయించుకుని
ఫోన్ ఆఫ్ చేసేసింది. ఇలా ఆమె పెద్ద సంఖ్యలో ఖాతాదారులను మోసం చేసినట్లు తెలిసింది.

 స్టింగ్ ఆపరేషన్...నో యూజ్

స్టింగ్ ఆపరేషన్...నో యూజ్

ఇలా లొకంటో మోసాల గురించి తెలిసి వీటికి చెక్‌ చెప్పాలనే ఉద్దేశంతో నగర పోలీసు విభాగానికి చెందిన ఓ కానిస్టేబుల్‌ స్టింగ్‌ ఆపరేషన్‌కు సిద్ధమయ్యాడు. ఇలాగే ఓ ప్రకటన జారీ చేసిన వారితో సంప్రదింపులు జరపడంతో పాటు బేరసారాలు పూర్తి చేశాడు. చివరకు రూ.10 వేలు పేటీఎం ద్వారా బదిలీ చేసి ట్రాక్‌ చేయాలని ప్రయత్నించాడు. ఆ ఫోన్‌ నెంబర్, పేటీఎం ఉన్న నెంబర్‌ సైతం బోగస్‌విగా తేలడంతో దర్యాప్తు ముందుకు వెళ్లలేదు. ఈ మోసాల గురించి సిటీ సైబర్‌ క్రైమ్స్‌ పోలీసు అధికారి ఒకరు మీడియాతో మాట్లాడుతూ లోకంటో సైట్‌ కేంద్రంగా జరుగుతున్న నేరాలు ఇటీవల పెరుగుతున్నాయని..ఇప్పటికే కొన్ని కేసులు నమోదు చేయడంతో పాటు వీటికి చెక్‌ చెప్పడానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. దీనికోసం సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తున్నామని...అయితే బాధితుల బలహీనతే ఇలాంటి నేరగాళ్లకు క్యాష్‌గా మారుతోందన్నారు. లోకంటోలో వ్యభిచారం పేరుతో వచ్చే ప్రకటనలు పూర్తి మోసపూరితం అని గుర్తెరగాలని...అనేక మంది ఇలా మోసపోయి ఆ విషయాన్నీ బయటకు చెప్పుకోలేకపోతున్నారన్నారు.

English summary
Hyderabad: The Locanto free classifieds site, which are intended for commercial development, are being useful to Cheaters.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X