వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

lockdown 4.0 : ఏపీలో ఈనెల 31 వరకు దేవాలయాల్లో దర్శనాలు రద్దు : మంత్రి వెల్లంపల్లి

|
Google Oneindia TeluguNews

కరోనా కట్టడి చర్యల్లో భాగంగా దేశమంతా లాక్ డౌన్ విధించడంతో ఆ ప్రభావం ఆలయాల మీద పడింది. ఇప్పటికే దాదాపు రెండు నెలలుగా ఆలయాలు భక్తులు లేక వెలవెలబోతున్నాయి. ఇక లాక్‌డౌన్ ఆంక్షల నుండి మినహాయింపులు ప్రకటిస్తున్న నేపధ్యంలో ఏపీలోని ప్రముఖ దేవాలయాలు త్వరలో భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తాయి అని అందరూ భావిస్తే కేంద్రం ప్రకటించిన లాక్ డౌన్ పొడిగింపు 4.0 తో ఏపీ ప్రభుత్వం కూడా ఆలయాల్లో దర్శనాల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది .

థియేటర్లు , మల్టీ ప్లెక్స్ లను నిండా ముంచేసిన కరోనా లాక్ డౌన్..మూడు నెలల వరకు నో పర్మిషన్?థియేటర్లు , మల్టీ ప్లెక్స్ లను నిండా ముంచేసిన కరోనా లాక్ డౌన్..మూడు నెలల వరకు నో పర్మిషన్?

 ఈ నెల 31 వరకు రాష్ట్రంలో అన్ని దేవాలయాల్లోకి భక్తులకు నో పర్మిషన్

ఈ నెల 31 వరకు రాష్ట్రంలో అన్ని దేవాలయాల్లోకి భక్తులకు నో పర్మిషన్


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాలు తెరచుకుంటాయని అంతా భావించారు . అన్నవరం సత్య దేవుని ఆలయం , చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తి దేవాలయంతో పాటు, కాణిపాకం వరసిద్ది వినాయకుడి ఆలయం తదితర ప్రముఖ ఆలయాలు భక్తుల దర్శనాలకు విధి విధానాలు రూపొందిస్తున్నాయయని త్వరలో దర్శనాలకు గ్రీన్ సిగ్నల్ వస్తుందని భావిస్తే అలాంటిదేమీ లేదని తేల్చి చెప్పింది ఏపీ ప్రభుత్వం . ఈ నెల 31 వరకు రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లోకి భక్తులను అనుమతించడం లేదని దేవదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రకటించారు .

 భక్తులు లేకుండానే నిత్య పూజలు కొనసాగించాలని మంత్రి ఆదేశాలు

భక్తులు లేకుండానే నిత్య పూజలు కొనసాగించాలని మంత్రి ఆదేశాలు


కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశానుసారం లాక్‌డౌన్‌ కాలపరిమితి మే 31తేదీ వరకు పొడిగించిన నేపథ్యంలో దర్శనాలను నిలిపివేస్తున్నట్లు మంత్రి తెలిపారు.ఇక ఇప్పటికే దేవాలయాల్లో నిత్య పూజలు నిర్వహిస్తున్నారు. భక్తులకు మాత్రమే అనుమతి లేదు. ఇక ఈ నేపధ్యంలో గతంలో ఇచ్చిన ఆదేశాలను యధావిధిగా కొనసాగించాల్సిందిగా మంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఇక దేవాలయాల్లో సాంప్రదాయం ప్రకారం నిత్య పూజలు కొనసాగుతాయని అంతేకాకుండా ఆర్జిత సేవల కోసం ఆన్‌లైన్‌ ద్వారా చెల్లింపులు జరిపి పరోక్షంగా సేవలు అందించే విధంగా అన్ని దేవాలయాల్లో ఏర్పాటు చేసుకోవాలని కార్యనిర్వాహక అధికారులకు ఆదేశాలు ఇచ్చామని మంత్రి పేర్కొన్నారు.

లాక్ డౌన్ 4. 0.. ఆలయాల్లో దర్శనాలకు నో

లాక్ డౌన్ 4. 0.. ఆలయాల్లో దర్శనాలకు నో

రాష్ట్రంలో ఇంకా కరోనా కట్టడి జరగలేదని కరోనా ఒకరి నుంచి మరొకరికి సోకే ప్రమాదం ఉంది కాబట్టి ఆలయాల్లో ఈ నెలాఖరు వరకు దర్శనాలు ఆపివెయ్యాలని యధావిధిగా అర్చకులు మాత్రమే నిత్య సేవలు నిర్వహించాలని సూచించారు . ఇది భక్తులకు కాసింత రుచించని విషయమే . ఒకపక్క వైన్స్ నిర్వహిస్తున్న సర్కార్ మీద ఆలయాల విషయంలో కూడా ఒత్తిడి పెంచుతున్నారు చాలా మంది భక్తులు . అయినా సరే లాక్ డౌన్ 4. 0 కొనసాగుతున్న నేపధ్యంలో ఆలయాలలో దర్శనాలకు నో చెప్పేసింది ఏపీ సర్కార్ .

English summary
Endowment minister Vellampalli Srinivas has announced that devotees will not be allowed into all the temples in the state till may 31st . The Minister said that the lockdown period had been extended till May 31 as per the directives of the Union and State Governments.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X