వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లాక్ డౌన్, కరోనా నియంత్రణ పై ప్రధాని చెప్పింది విందాం .. జనసేనాని పవన్ కళ్యాణ్

|
Google Oneindia TeluguNews

కరోనాపై పోరాటంలో భాగంగా నిన్న జనతా కర్ఫ్యూకు మద్దతు ప్రకటించిన జనసేనాని ఇక తాజాగా కరోనాను నియంత్రించటానికి ప్రధాని మోదీ మాటను పాటిద్దామంటూ పిలుపునిచ్చారు. కరోనా ప్రపంచాన్ని వణికిస్తున్న తరుణంలో అందరం సమైక్యంగా పోరాటం సాగించాలని పవన్ ఇప్పటికే చెప్పిన విషయం తెలిసిందే . ప్రతి ఒక్కరు సామాజిక దూరం పాటించాలని , జాగ్రత్తలు తీసుకోవాలని పవన్ పేర్కొన్నారు. ఇక ప్రజల్లో అవగాహన కోసం జనసైనికులు ప్రయత్నం చెయ్యాలని చెప్పారు.

విజయవాడలో లాక్ డౌన్ .. రోడ్లపైకి వస్తే కఠిన చర్యలే ..వార్నింగ్ ఇస్తున్న పోలీసులువిజయవాడలో లాక్ డౌన్ .. రోడ్లపైకి వస్తే కఠిన చర్యలే ..వార్నింగ్ ఇస్తున్న పోలీసులు

ప్రధాని మాట పాటిద్దాం అంటున్న జనసేన చీఫ్

ప్రధాని మాట పాటిద్దాం అంటున్న జనసేన చీఫ్

ఇక పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా చేసిన ట్వీట్ లో ప్రధాని మాట పాటిద్దాం, కరోనా విముక్త భారతాన్ని సాధిద్దాం. మనలని మనం రక్షించుకుందాం. దయచేసి అందరూ కరోనా వ్యాధి తీవ్రతని గుర్తించాలి, లాక్ డౌన్‌ని విధిగా పాటించాలి అని పేర్కొన్నారు. అంతే కాదు కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రజలందరూ పాటించేలా చర్యలు తీసుకోవాలి అని పేర్కొన్నారు.

ప్రధాని ట్వీట్ ను రీ ట్వీట్ చేసిన పవన్ కళ్యాణ్

ఇక దేశం మొత్తం లాక్ డౌన్ ప్రకటించినా ప్రజలు ఇళ్ళకు పరిమితం కాకుండా బయట తిరగటం , కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా విధిస్తున్న లాక్‌డౌన్‌లను లైట్ తీసుకోవటంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇక రాష్ట్రాలకు సైతం సీరియస్ గా లాక్ డౌన్ పాటించాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు . ఇక ఈ నేపధ్యంలోనే ప్రధాని ట్వీట్ ను రీ ట్వీట్ చేసిన పవన్ కళ్యాణ్ ప్రజలు ప్రధాని మోడీ మాట విందామని మనల్ని మనం రక్షించుకుందాం అని పేర్కొన్నారు.

ప్రజలు లాక్ డౌన్ ను సీరియస్ గా తీసుకోవాలన్న ప్రధాని

సోమవారం ఉదయం ఆయన ఈ విషయమై మరింత అప్రమత్తం చేస్తూ... లాక్ డౌన్‌లను చాలా మంది సీరియస్‌గా తీసుకోవడం లేదు. మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించడం ద్వారా మిమ్మల్ని, మీ కుటుంబాన్ని కాపాడుకోవాలని మిమ్మల్ని కోరుతున్నానని ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా నియమ, నిబంధనలు తు.చ తప్పకుండా అమలు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను అని హిందీలో చేసిన ట్వీట్‌లో ప్రధాని పేర్కొన్నారు.

English summary
Pawan Kalyan's Twitter account tweeted at the Prime Minister's post, "Let Corona getout from India." Let us protect ourselves. Please note that everyone should recognize the severity of corona disease and follow the lockdown as a duty. He also said that the people should follow the central government's orders and and also the state governments orders.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X