గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

లాక్ డౌన్ సమయంలో జోరుగా మైనింగ్ మాఫియా ... చిన్న అవకాశాలను కూడా వాడేస్తున్న కేటుగాళ్ళు

|
Google Oneindia TeluguNews

కరోనా లాక్ డౌన్ అందరినీ ఇళ్ళకు పరిమితం చేస్తే కొందరు మాఫియా గ్యాంగ్ లకు మాత్రం కాసుల వర్షం కురిపిస్తుంది . ఓ వైపు రాష్ట్రం కరోనాతో కల్లోలంగా మారుతుంటే ఏపీలో కరోనా నివారణకు వాడే బ్లీచింగ్‌కు ముగ్గురాయి ముడిసరుకు అంటూ అక్రమంగా తవ్వకాలు జరుపుతున్నారు. మైనింగ్ మాఫియా ఏ చిన్న అవకాశం కూడా వదలకుండా వాడేస్తున్నారు .ఇక ఇదంతా చూస్తున్నా మైనింగ్ అధికారులు మాత్రం నోరు మెదపటం లేదు . చాలా ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు.

లాక్ డౌన్ టైమ్ పాస్ ... పేకాట , కోడిపందేలు .. తోలు తీస్తున్న పోలీసులులాక్ డౌన్ టైమ్ పాస్ ... పేకాట , కోడిపందేలు .. తోలు తీస్తున్న పోలీసులు

కరోనా మాటున మైనింగ్ మాఫియా అక్రమ దందా

కరోనా మాటున మైనింగ్ మాఫియా అక్రమ దందా

ముఖ్యంగా గుంటూరు జిల్లాలో కరోనా మాటున మైనింగ్ మాఫియా అక్రమ దందా సాగిస్తోంది. గుంటూరు జిల్లాలో కరోనా పాజిటివ్ విపరీతంగా పెరుగుతున్న వేళ జిల్లా వాసుల్లో ఆందోళన నెలకొంది .ఇక పాజిటివ్ కేసుల్లో రాష్ట్రంలోనే జిల్లా రెండో స్దానంలో ఉంది. ఇది జిల్లా వాసులను టెన్షన్ కు గురి చేస్తోంది. ఈ పరిస్దితులను అధిగమించేందుకు జిల్లా వ్యాప్తంగా లాక్‌డౌన్‌ను పటిష్టంగా అమలు చేస్తున్నారు. కానీ లాక్‌డౌన్‌ సమయంలోనూ మైనింగ్ మాఫియా , అలాగే మట్టి మాఫియా ఇష్టారాజ్యంగా తమ పని తాము చేసుకుపోతున్నారు .

పిడుగురాళ్లలో సున్నపురాయి, మాచవరంలో మైనింగ్, మట్టి తవ్వకాలు

పిడుగురాళ్లలో సున్నపురాయి, మాచవరంలో మైనింగ్, మట్టి తవ్వకాలు

గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతం ముగ్గురాయికి ప్రఖ్యాతి గాంచిన ప్రాంతం ఇక్కడి నుంచి పెద్ద ఎత్తున ముగ్గురాయి మైనింగ్ జరుగుతోంది. పిడుగురాళ్లలో సున్నపురాయి, మాచవరంలో మైనింగ్, మట్టి తవ్వకాలు జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఇక పోలీసులు పట్టుకుంటే మాత్రం మైనింగ్ అధికారులు పెనాల్టితో సరిపెట్టేస్తున్నారు. లాక్‌డౌన్ అమలు జరుగుతుంటే మైనింగ్, మట్టి తవ్వకాల పనులు ఎలా చేస్తున్నారనే విషయంపై చర్చ జరుగుతోంది. కానీ కరోనా కట్టడికి ఉపయోగించే బ్లీచింగ్ పౌడర్ తయారీలో ముడి సరుకు ముగ్గు రాయి కాబట్టి అక్రమార్కులు ఆ పేరు చెప్పి తమ దందా కొనసాగిస్తున్నారు .

అనుమతులు ఉన్నాయన్న వంకతో ఇష్టారాజ్యంగా తవ్వకాలు

అనుమతులు ఉన్నాయన్న వంకతో ఇష్టారాజ్యంగా తవ్వకాలు

సాధారణ రోజుల్లో కంటే ఎక్కువగా ప్రస్తుతం మైనింగ్ అక్రమ రవాణా అవుతోంది. ముగ్గురాయిని తవ్వి రవాణా చేస్తున్న ట్రాక్టర్లను సీజ్ చేసిన పోలీసులు వాటిని స్దానిక మైనింగ్ అధికారులకు అప్పగించినా నామమాత్రపు ఫైన్ లతో వాటిని తిరిగి విడుదల చేస్తున్నారు. పెద్దగా చర్యలు తీసుకోకపోగా బ్లీచింగ్‌కు ముగ్గురాయి ముడిసరుకుగా వాడకంలో ఉందని అందుకు అనుమతులు ఇచ్చామని అధికారులు చెప్తుండటం గమనార్హం . ఇక దీంతో తమకు అనుమతులు ఉన్నాయన్న కారణంతో అక్రమార్కులు ఇష్టారాజ్యంగా మైనింగ్ కు పాల్పడుతున్నారు .

Recommended Video

Coronavirus: COVID-19 Cases Reached 893 Mark In AP With 80 New Cases

English summary
The corona lock down is restricted to houses, but it is benifiting for some mafia gangs. On the other hand, if the state is in turmoil with the corona, the in the AP mining mafia has been illegally excavated Limestone for bleaching. The mining mafia is being used without leaving any small possibility .The mining authorities are looking at all this and not taking any action .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X