• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

YSRCP Logic:ఆలయ దాడులకు సంక్షేమ పథకాలకు లింకు: తేదీలతో సహా వైసీపీ వివరణ..!

|

ఏపీలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ముఖ్యమంత్రి వైయస్ జగన్ పలు సంక్షేమ పథకాలు ప్రారంభించడం ప్రజలు సీఎంపై ప్రశంసలు కురిపిస్తుండటంతో ప్రతిపక్షాలు ఓర్వలేకున్నాయని ఈ క్రమంలోనే ఆ సంక్షేమ పథకాల గురించి రాష్ట్రంలో చర్చ జరగకుండా ప్రభుత్వానికి ఎక్కడ మంచి పేరు వస్తుందో అన్న ఆందోళన మొదలైందని వైసీపీ నాయకులు నేతలు చెబుతున్నారు. ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా... ప్రజల ఆశీర్వాదం సీఎం జగన్‌కు ఉందని వారు గుర్తు చేస్తున్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వం ప్రారంభించిన ప్రతి సంక్షేమ పథకంకు ముందు రోజో లేక మరుసటి రోజో ఏదో ఒకటి ఘటన వెలుగుచూస్తోందని ఇది ముమ్మాటికీ కుట్రే అని వైసీపీ గట్టిగా వాదిస్తోంది. ఇందుకు రుజువులు కూడా చూపిస్తోంది.

2019లో నాడు నేడు: గుంటూరు దుర్గ ఆలయంపై దాడి

2019లో నాడు నేడు: గుంటూరు దుర్గ ఆలయంపై దాడి

2019 నవంబర్ 14న సోషల్ మీడియాలో గుంటూరులోని దుర్గ ఆలయంపై దాడి విషయం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది. సరిగ్గా ఆరోజు సీఎం జగన్ మనబడి నాడు-నేడు అనే కార్యక్రమాన్ని ఒంగోలులో ప్రారంభించారు. అయితే ఈ కార్యక్రమం గురించి ప్రజలు చర్చించకూడదని ఎవరో కుట్రపన్ని దుర్గమ్మ ఆలయం గురించి సోషల్ మీడియాలో విషప్రచారం చేశారని వైసీపీ చెబుతోంది. అయితే ఆ ప్రచారంలో నిజం లేదని, రోడ్డు విస్తరణలో భాగంగా ఆలయంను మరో చోటికి మాత్రమే మారుస్తున్నారనేది స్పష్టమైందని వైసీపీ చెబుతోంది. ఇక రైతుల మేలు కోరి ప్రభుత్వం ధరల స్థిరీకరణలో భాగంగా రూ.30వేల కోట్లను జనవరి 2020లో కేటాయించింది. మరుసటి రోజు అంటే జనవరి 21వ తేదీన పిఠాపురంలోని హనుమాన్ ఆలయంలో 23 విగ్రహాలు ధ్వంసమైయ్యాయని వైసీపీ ధ్వజమెత్తింది. రైతులు ఈ పథకం పై హర్షం వ్యక్తం చేస్తున్న క్రమంలో ఈ ఘటన జరిగిందని వైసీపీ నాయకులు చెబుతున్నారు.

దిశ పోలీస్ స్టేషన్ ప్రారంభానికి ముందు...

దిశ పోలీస్ స్టేషన్ ప్రారంభానికి ముందు...

2020 ఫిబ్రవరి నెలలో 11వ తేదీన రొంపిచర్ల వేణుగోపాల స్వామి ఆలయంలో కొన్ని విగ్రహాలు ధ్వంసమయ్యాయి. అదే నెల 13వ తేదీన ఉండ్రాజవరంలోని ఆలయ ద్వారాలు ధ్వంసంకాగా ఫిబ్రవరి 14వ తేదీన నెల్లూరులోని కొండ బిట్రగుంటలో ఆంజనేయ స్వామి రథంకు ఎవరో నిప్పు పెట్టారు. ఈ ఘటనలకు సరిగ్గా వారం రోజుల ముందు సీఎం జగన్ రాజమండ్రిలో దిశ పోలీస్ స్టేషన్‌ ప్రారంభించారని దీనిపై రాష్ట్రంలోని మహిళలు ప్రభుత్వంను మెచ్చుకుంటుండగా దాన్ని పక్కదోవ పట్టించేందుకు వరసగా ఆలయాలపై దాడులు జరిగాయని వైసీపీ మండిపడింది. 55,607 అంగన్‌వాడీల్లో పనిచేస్తున్న 31,16,000 మంది మహిళలకు లబ్ధిచేకూరేలా పథకం ప్రారంభించనున్నట్లు సెప్టెంబర్ 7వ తేదీన సీఎం జగన్ ప్రకటిస్తారనే వార్త బయటకు రాగా...దానికి ఒక్కరోజు ముందు అంతర్వేదిలోని లక్ష్మీనరసింహా స్వామి ఆలయంలో రథంకు ఎవరో దుండగులు నిప్పు పెట్టడం జరిగిందనే విషయాన్ని గుర్తు చేశారు.

దుర్గగుడిలో వెండి సింహాలు అదృశ్యం

దుర్గగుడిలో వెండి సింహాలు అదృశ్యం

ఇక సెప్టెంబర్ 11వ తేదీన 87 లక్షల మంది మహిళలకు వైయస్సార్ ఆసరా పథకంను సీఎం జగన్ ప్రారంభించారని... అదే సమయంలో అంటే సెప్టెంబర్ 13వ తేదీన విజయవాడలోని కనకదుర్గ ఆలయంలో వెండి సింహాల విగ్రహాలు అదృశ్యమయ్యాయని గుర్తు చేశారు. సెప్టెంబర్ 28వ తేదీన వైయస్సార్ జలకల పథకం ప్రారంభం అవడానికి మూడు రోజుల ముందు అంటే సెప్టెంబర్ 25వ తేదీన నాయుడుపేటలోని తుమ్మూరులో ఆంజనేయ స్వామి ఆలయం ధ్వంసమై వార్తల్లో నిలిచింది. విద్యాకానుక అక్టోబర్ 8వ తేదీన ప్రారంభం కావడానికి ముందు మంత్రాలయంలోని నరసింహ ఆలయంపై దాడి జరిగిందనే విషయాన్ని ప్రజల దృష్టికి తీసుకొస్తోంది వైసీపీ

ఇళ్ల పట్టాల పంపిణీ రోజునే..రామతీర్థం ఆలయంపై దాడి

ఇళ్ల పట్టాల పంపిణీ రోజునే..రామతీర్థం ఆలయంపై దాడి

ఇక తాజాగా వైసీపీ ప్రభుత్వం తలపెట్టిన పేద మహిళలకు 30 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం సందర్భంగా తిరుమలలో పూర్ణకుంభం సిలువ ఆకారంలో ఉందంటూ... సోషల్ మీడియాలో ప్రచారం చేశారని వైసీపీ ఆరోపిస్తోంది. ఇక విజయనగరం జిల్లాలో సీఎం జగన్ ఇళ్ల పట్టాల పంపిణీకి వస్తున్నారని తెలిసి ముందస్తు వ్యూహంలో భాగంగా రామతీర్థంలో శ్రీరాముడి ఆలయంపై దాడి జరిగిందని అదే రోజున రాజమండ్రిలో సుబ్రహ్మణ్య స్వామి ఆలయంపై దాడి జరిగిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు వైసీపీ నాయకులు.

సంక్షేమ పథకాలకు మంచి పేరు వస్తుండటంతోనే...

సంక్షేమ పథకాలకు మంచి పేరు వస్తుండటంతోనే...

అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే... ప్రభుత్వం ఏ సంక్షేమ పథకం ప్రారంభించినా.. ఆ పథకంకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుండటంతో దాన్ని డైవర్ట్ చేసేందుకు కొందరు పనిగట్టుకుని ఆలయ దాడులు చేస్తూ హిందువుల మనోభావాలు దెబ్బతీసేందుకు కుట్ర పన్నుతున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. చాలామంది మతపరమైన అంశాలకు సున్నితంగా ఉంటారు కాబట్టే... ఆలయాలపై దాడులు చేసి కొందరు రాజకీయంగా పబ్బం గడుపుకునే కార్యక్రమం చేస్తున్నారని వైసీపీ మండిపడింది. సీఎం జగన్‌ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలపై ఆరోపణలు చేస్తే ప్రతిపక్షాలకు పుట్టగతులు ఉండవనే సంగతి తెలిసే... ప్రజల పై మతపరమైన అస్త్రం వదులుతోందని వైసీపీ మండిపడింది. అలా చేసి ప్రభుత్వంను ఇరకాటంలోకి నెట్టివేయాలని చేస్తున్న కుట్రను ప్రభుత్వం ధీటుగా ఎదుర్కొని వీటి వెనక ఉన్నవారిని కచ్చితంగా బయటకు లాగుతామని అధికార పార్టీ నేతలు చెబుతున్నారు. త్వరలోనే అమ్మ ఒడి కార్యక్రమం ఉంది కాబట్టి మరో ఆలయంపై దాడి చేసే అవకాశాలు ఉన్నాయని వైసీపీ నేతలు చెబుతున్నారు.

English summary
AP YSRCP leaders have come out with a logic behind the temple attacks. Whenever the govt is launching a welfare scheme for the people of AP, there were attacks happening on the temples.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X