వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అవిశ్వాసంపై చర్చకు సిద్దం: ప్రభుత్వం, విపక్షాల ఆందోళనలతో లోక్‌సభ వాయిదా

By Narsimha
|
Google Oneindia TeluguNews

Recommended Video

అవిశ్వాసం తీర్మానం చర్చ : మహిళ వేషధారణలో టీడీపీ ఎంపీ, రేణుకా చౌదరి మద్దతు

అమరావతి: కేంద్రంపై అవిశ్వాస తీర్మానం నోటీసులు అందాయని లోక్ సభ స్సీకర్ సుమిత్రా మహజన్ ప్రకటించారు. విపక్షాల ఆందోళనల నేపథ్యంలో మంగళవారం నాటికి సభను వాయిదా వేశారు. అయితే సభ ఆర్డర్‌లో ఉంచేందుకు సహకరించాలని స్పీకర్ పదే పదే విన్నవించారు.. కానీ, ఫలితం లేకపోయింది. దీంతో సభను మంగళవారానికి వాయిదా వేస్తూ సుమిత్రా మహజన్ నిర్ణయం తీసుకొన్నాు.

ఊహించినట్టుగానే కేంద్ర ప్రభుత్వంపై ఇచ్చిన అవిశ్వాస తీర్మానం సోమవారం నాడు కూడ చర్చకు రాలేదు. కానీ, ఈ అంశంపై టిడిపి సభ్యుడు తోట నరసింహం, వైసీపీ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి ఇచ్చిన నోటీసులు అందాయని స్పీకర్ ప్రకటించారు.

Lok Sabha adjourned till tomorrow, no-trust vote not taken up

అయితే స్పీకర్ ప్రకటనకు ముందే కేంద్ర హోం మంత్రి రాజ్‌నాధ్ సింగ్ ప్రభుత్వం అవిశ్వాసానికి తాము సిద్దంగానే ఉన్నామని ప్రకటించింది. అయితే అవిశ్వాసంపై సభ్యలు ఎంతమంది మద్దతిచ్చారనే విషయాన్ని లెక్కించేందుకు సభ ఆర్డర్‌లో ఉండాల్సిన అవసరం ఉందని స్పీకర్ సుమిత్రా మహజన్ ప్రకటించారు.

అయితే సభలో గందరగోళ వాతావరణం నెలకొంది. టిఆర్ఎస్, అన్నాడిఎంకె సభ్యులు వెల్‌లో ఆందోళన కొనసాగించారు. నినాదాలు కొనసాగించారు. దీంతో సభలో గందరగోళ వాతావరణం నెలకొంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో లోక్‌సభను మంగళవారానికి వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ సుమిత్రా మహజన్ ప్రకటించారు.

English summary
Since the House is not in ordeer, I will not be able to bring the notices in the House," says Sumitra Mahajan. She later adjourned the House till tomorrow. no confidence motion not taken up on monday in parliament.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X