వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజ్యసభ నుంచి కేవీపీ సస్పెన్షన్, చిన్నపిల్లలా: ఎంపీలపై స్పీకర్ ఆగ్రహం, బాబుకు రాజ్ ఫోన్

|
Google Oneindia TeluguNews

Recommended Video

KVP Ramachandra Rao Suspended from RS

న్యూఢిల్లీ: పార్లమెంటు ఉభయ సభలు బుధవారం ఉదయం పదకొండు గంటలకు ప్రారంభమయ్యాయి. ఏపీకి న్యాయం చేయాలంటూ తెలుగుదేశం పార్టీ ఎంపీలు లోకసభలో ఆందోళన కొనసాగించారు. స్పీకర్ పోడియం వద్ద సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ నినాదాలు చేశారు.

ఏం లెక్క ఇది, తప్పు చేసింది మీరు: జైట్లీపై తీవ్రస్థాయిలో ఊగిపోయిన బాబుఏం లెక్క ఇది, తప్పు చేసింది మీరు: జైట్లీపై తీవ్రస్థాయిలో ఊగిపోయిన బాబు

ఏపీకి న్యాయం చేయాలని పట్టుబట్టారు. వారు సభ్యుల ప్రసంగాన్ని అడ్డుకుంటున్నారు. అయితే కాసేపట్లే ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగిస్తారని, దానికి అడ్డుపడవద్దని కేంద్రమంత్రులు కోరారు. దానికి టీడీపీ ఎంపీలు ససేమీరా అన్నారు.

చంద్రబాబుతో మాట్లాడిన రాజ్‌నాథ్

చంద్రబాబుతో మాట్లాడిన రాజ్‌నాథ్

ఏపీ ఎంపీలు తమ ఆందోళనలు సభలో కొనసాగించారు. ఏదైనా ఉంటే తమ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు చెప్పాలని అన్నారు. దీంతో కేంద్రహోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఫోన్ చేశారు. హామీల అమలుకు కట్టుబడి ఉన్నామని, నిరసనలు తాత్కాలికంగా ఆపేయాలని కోరారు.

 కేవీపీ డ్రామాలు చెప్పాం

కేవీపీ డ్రామాలు చెప్పాం

రాజ్‌నాథ్ సింగ్‌ను కలిసిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. ఏపీ ప్రజల ఇబ్బందులను తాము ఆయనకు వివరించామని చెప్పారు. టీడీపీ డ్రామాలు అతనికి చెప్పామన్నారు.

 రాజ్యసభ నుంచి కేవీపీ సస్పెన్షన్

రాజ్యసభ నుంచి కేవీపీ సస్పెన్షన్

కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు కేవీపీ రామచంద్ర రావు బుధవారం రాజ్యసభ నుంచి ఒక్కరోజు సస్పెన్షన్‌కు గురయ్యారు. ఏపీకి ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ కేవీపీ పదేపదే నిరసన తెలుపుతోన్న విషయం తెలిసిందే. సభకు అడ్డుపడుతున్నారని చెబుతూ కేవీపీని ఒక రోజు సభ నుంచి సస్పెండ్ చేశారు

 ఉభయ సభల్లో నిరసనలు

ఉభయ సభల్లో నిరసనలు

టీడీపీ, వైసీపీ ఎంపీలు ఉభయ సభల్లో నిరసన తెలుపుతున్నారు. వైసీపీ నుంచి విజయసాయి రెడ్డి, మేకపాటి రాజమోహన్ రెడ్డి, వైయస్ అవినాశ్ రెడ్డిలు అంతకుముందు గాంధీ విగ్రహం ముందు ధర్నా నిర్వహించారు. సోమ, మంగళ వారాలు అదే ప్రాంతంలో టీడీపీ ఎంపీలు ప్లకార్డులతో నిరసన తెలిపారు.

 సుమిత్రా మహాజన్ ఆగ్రహం

సుమిత్రా మహాజన్ ఆగ్రహం

లోకసభలో నిరసన తెలుపుతున్న టీడీపీ, వైసీపీ ఎంపీలపై స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ చిన్న పిల్లల్లా ప్రవర్తించి ఇంటికి వెళ్లి పిల్లలకు కూడా క్రమశిక్షణ నేర్పలేరని ఆవేదన వ్యక్తం చేశారు. సభ్యులకు అడ్డుగా ప్లకార్డులు పట్టుకోవడం సరికాదన్నారు.

English summary
Andhra Pradesh Telugu Desam MPS continuing protest in Parliament on Wednesday also.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X