India
  • search
  • Live TV
గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ రెడ్డి వికృతానందం పొందింది ఈ రోజే - రఘురామకు లోకేష్ బర్త్ డే విషెస్ : ప్రజలే ముఖ్యమంటూ..!!

|
Google Oneindia TeluguNews

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ రాజుకు టీడీపీ ప్రధాన కార్యదర్శి నారాలోకేశ్‌ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన విషెస్ చెబుతూ వరుస ట్వీట్లు చేసారు. ఇదే రోజున గత ఏడాది చోటు చేసుకున్న సంఘటనలను లోకేష్ తన ట్వీట్ లో గుర్తు చేసారు. పదవి, పరపతి కంటే ప్రజలే ముఖ్యం అంటూ సొంత పార్టీ అరాచకాలను, అవినీతిని తనదైన శైలిలో ఎండగడుతున్న యుశ్రారైకాపా ఎంపి గారికి జన్మదిన శుభాకాంక్షలు...అని ట్వీట్ లో పేర్కొన్నారు.

సరిగ్గా ఏడాది క్రితం..ఇదే రోజున

దీనికి కొనసాగింపుగా.. వాస్తవాలు బయటపెడుతున్నారనే కక్షతో సొంత పార్టీ ఎంపి అని చూడకుండా అక్రమంగా అరెస్ట్ చేసి చిత్రహింసలకు గురిచేసి జగన్ రెడ్డి గారు వికృతానందం పొందింది కూడా గతేడాది ఇదే రోజు..అంటూ లోకేష్ ట్వీట్ చేసారు. అందులోనే దెబ్బలతో ఉన్న రఘురామ కాళ్ల ఫొటోలను జత చేసారు. గత ఏడాది రఘురామ రాజు హైదరాబాద్ లో ఉన్న సమయంలో ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసారు. ముఖ్యమంత్రి జగన్ పైన అనుచిత వ్యాఖ్యలు చేసారంటూ ఆయన్ను అరెస్ట్ చేసి..హైదరాబాద్ నుంచి గుంటూరు సీఐడీ కార్యాలయానికి తరలించారు. కోర్టు లో హాజరు పర్చి రిమాండ్ విధించటంతో గుంటూరు జిల్లా జైలుకు తరలించారు.

నాడు రాజకీయంగా కలకలం

అయితే, కోర్టుకు తరలించిన సమయంలో..అక్కడ సీఐడీ అదుపులో ఉన్న తన పైన గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి.. చిత్ర హింసలకు గురి చేసారని..తన ఫోన్ తీసుకున్నారంటూ మెజిస్ట్రేట్ కు రఘురామ ఫిర్యాదు చేసారు. ఇక, దీని పైన రఘరామ తరపు న్యాయవాదులు హైకోర్టును ఆశ్రయించారు. గుంటూరు ప్రభుత్వాస్పత్రితో పాటుగా ప్రయివేటు ఆస్పత్రిలో రఘురామ కాళ్లకు ఉన్న దెబ్బల పైన కోర్టు నివేదిక కోరింది. ఆ తరువాత సుప్రీంలో అప్పీల్ చేయగా..అక్కడ బెయిల్ ఇవ్వటంతో పాటుగా హైదరాబాద్ లోని ఆర్మీ ఆస్పత్రిలో చికిత్సకు అనుమతించారు. అక్కడ చికిత్స సమయంలో అక్కడి వైద్యులు సుప్రీ కోర్టుకు ఆయన శరీరం పైన దెబ్బల గురించి నివేదిక ఇచ్చారు. బెయిల్ పైన ఉన్న రఘురామ అప్పటి నుంచి ఢిల్లీలోనే ఉన్నారు. సంక్రాంతి సమయంలో మరోసారి హైదరాబాద్ వచ్చిన రఘురామ..తన సొంత జిల్లాకు వెళ్లేందుకు సిద్దమయ్యారు.

లోకేష్ విషెస్.. ట్వీట్ వైరల్

లోకేష్ విషెస్.. ట్వీట్ వైరల్


అప్పుడు సైతం సీఐడీ పోలీసులు మరోసారి విచారణకు రావాలంటూ నోటీసులు ఇవ్వగా.. వాటి పైన రఘురామ ఢిల్లీ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసారు. ఇక, తిరుపతిలో అమరావతి జేఏసీ నిర్వహించిన సభలో పాల్గొన్న రఘురామ..చంద్రబాబును ఆ వేదిక పైన ఆలింగనం చేసుకున్నారు. ఇక, సీఐడి రఘురామ పైన నమోదు చేసిన అభియోగాల్లో....చంద్రబాబు - లోకేష్ తో ఉన్న బంధాల గురించి ప్రస్తావన చేసింది. టీడీపీ అధినేత చంద్రబాబు సైతం పలు సందర్భాల్లో రఘురాను వైసీపీ ప్రభుత్వం వేధించందంటూ చెప్పుకొచ్చారు. వైసీపీ రఘురామ పైన అనర్హత కోసం అనేక ప్రయత్నాలు చేసినా..ఇప్పటి వరకు అది సాధ్యపడలేదు. ఇక, ఇప్పుడు నాటి ఫొటోలను జత చేస్తూ..రఘురామ రాజును ప్రశంసిస్తూ..లోకేష్ ట్వీట్ చేయటం రాజకీయంగా చర్చకు కారణమైంది.


English summary
Nara Lokesh wished YSRCP rebel MP Raghu Rama Raju on his birth day, Lokesh mentioned last year same day issue in his tweet.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X