వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అన్నక్యాంటీన్ల మూసివేత వెయ్యి పాపాల పెట్టు అన్న లోకేష్ :నేడు క్యాంటీన్ల ముందు నిరసనలు

|
Google Oneindia TeluguNews

గత టీడీపీ ప్రభుత్వం పేదల ఆకలి తీర్చడానికి ఐదు రూపాయలకే భోజన వసతిని కల్పిస్తూ ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ లను ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం మూసివేసింది. దీంతో నిరుపేదల ఆకలి తీర్చే అన్న కాంటీన్ లను మూసివేయడం తగదని, వెంటనే వాటిని కొనసాగేలా చర్యలు తీసుకోవాలనినేడు రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్ ల వద్ద నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తుంది. ఇక ఇదే విషయంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ టీడీపీ సైన్యానికి పిలుపునిచ్చారు. అన్న క్యాంటీన్లు తెరిచే వరకు ఉద్యమం కొనసాగిద్దామని ఆయన ట్విట్టర్ వేదికగా తెలియజేశారు.

<strong>జగనన్న వచ్చారని వరుణుడు పారిపోయాడహో: లక్ష కోట్లు వెనకేసుకున్నా అక్రమ సంపాదనేనా? నారా లోకేష్!</strong>జగనన్న వచ్చారని వరుణుడు పారిపోయాడహో: లక్ష కోట్లు వెనకేసుకున్నా అక్రమ సంపాదనేనా? నారా లోకేష్!

అన్న క్యాంటీన్ల మూసివేతపై నేడు రాష్ట్రవ్యాప్తంగా క్యాంటీన్ల ముందు నిరసనలు

అన్న క్యాంటీన్ల మూసివేతపై నేడు రాష్ట్రవ్యాప్తంగా క్యాంటీన్ల ముందు నిరసనలు

అన్న క్యాంటీన్ ల మూసివేతపై రగడ కొనసాగుతుంది. టీడీపీ వై సీపీ తీరుపై భగ్గుమంటుంది. అన్న కాంటీన్ లను మూసివేసి , పేదల కడుపు కొడుతుందని టీడీపీ ఆరోపిస్తుంది. అన్న క్యాంటీన్ల విషయంలోనూ అవినీతికి పాల్పడిందని వైసిపి ఆరోపణలు గుప్పిస్తోంది . ఇక ఇటీవల జరిగిన టిడిపి రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశంలో అన్న కాంటీన్ మూసివేత విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు టిడిపి నాయకులు. అన్న క్యాంటీ న్ల మూసివేత నిర్ణయానికి నిరసనగా ఈ నెల 16న అంటే నేడు రాష్ట్రవ్యాప్తంగా క్యాంటీన్ల ముందు నిరసన చేపట్టాలని టీడీపీ నిర్ణయించింది. ధర్నాలతో పాటు పేదలకు అ ల్పాహార పంపిణీ చేపట్టాలని, దీక్షలు, ప్రదర్శనలు వంటివి చెయ్యాలని పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో నిశ్చయించారు. దీంతో నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్న క్యాంటీన్ ల ముందు నిరసన ప్రదర్శనలు , అల్పాహార్ పంపిణీ చెయ్యాలని టీడీపీ శ్రేణులు సమాయత్తం అయ్యాయి.

సోషల్ మీడియా వేదికగా లోకేష్ ఫైర్ .. క్యాంటీన్లని తెరిచి పేదల ఆకలి తీర్చండి అన్న లోకేష్

సోషల్ మీడియా వేదికగా లోకేష్ ఫైర్ .. క్యాంటీన్లని తెరిచి పేదల ఆకలి తీర్చండి అన్న లోకేష్

ఇక కర్నూలు మాజీ మేయర్ బంగి అనంతయ్య ప్రభుత్వంపై తన వినూత్న నిరసనను అ రెండు రోజుల ప్రారంభించారు. అన్న క్యాంటీన్ల మూసివేతకు నిరసనగా మాజీ మేయర్ బంగి అనంతయ్య కలెక్టరేట్ ఎదుట భిక్షాటన చేశారు. అన్న క్యాంటీన్లు తెరవాలని డిమాండ్ చేశారు.
ఇక లోకేష్ సోషల్ మీడియా వేదికగా అన్న క్యాంటీన్ ల విషయంలో జగన్ సర్కార్ నిర్ణయం పై నిప్పులు చెరిగారు. ట్విట్టర్ లో వరుస ట్వీట్స్ చేసిన లోకేష్ " జగన్ గారూ! మిమ్మల్ని గెలిపించినందుకు ప్రజల ఋణం తీర్చుకునేలా ఉండాలి పాలన. కానీ మీ పాలన ఇన్నాళ్ళూ మిమ్మల్ని అధికారానికి దూరం పెట్టినందుకు కక్ష సాధింపులా ఉంది. అన్న క్యాంటీన్ల మూసివేత ఒక్కటి చాలు, వెయ్యి పాపాల పెట్టు. వాటిని తిరిగి తెరచి పేదల ఆకలి తీర్చండి చాలు. అంటూ #ReOpenAnnaCanteens
అంటూ అన్నా క్యాంటీన్ లను రీ ఓపెన్ చెయ్యాలని హ్యాష్ ట్యాగ్ చేశారు.

టీడీపీ మీద కక్షతో పేదల నోటి వద్ద కూడు తీసెయ్యొద్దు అని లోకేష్ ట్వీట్..

ఇక మరో పోస్ట్ లో టీడీపీ మీద కక్షతో పేదల నోటి వద్ద కూడు తీసేసిన దారుణం సహించలేకున్నాం అంటూ పేర్కొన్నారు లోకేష్ ."తెదేపా మీద కక్షతో ప్రభుత్వం ఏమైనా చేయొచ్చు. కానీ అన్న క్యాంటీన్లు మూసేసి పేదలను కష్టపెట్టడాన్ని సహించలేకపోతోంది తెలుగుదేశం. అందుకే ఈరోజు అన్న క్యాంటీన్ల వద్ద నిరసన దీక్షలు నిర్వహిస్తోంది తెదేపా. అందరూ కలిసిరండి క్యాంటీనులను తిరిగి తెరిచేవరకు ఉద్యమిద్దాం. " అంటూ పార్టీ శ్రేణులకు , ప్రజలకు పిలుపు నిచ్చారు. ఇక అంతే కాదు అన్న క్యాంటీన్ ల విషయంలో టీడీపీ దీక్షలకు మద్దతుగా పెట్టిన పోస్ట్ లను కూడా రీ ట్వీట్ చేశారు లోకేష్ . "అన్నా క్యాంటీన్లు అత్యంత ప్రజాదరణ పొందిన పథకం కాబట్టి దానిని చంపేస్తే జనం మదిలో చంద్రబాబు గుర్తులను చెరిపెయ్యొచ్చు అనుకున్నారు కానీ ప్రజలు పిచ్చోళ్ళు కాదు మీకు బుద్ది చెబుతారు" అని లోకేష్ అన్న క్యాంటీన్ ల విషయంలో నేటి ఆందోళనల నేపధ్యంలో వైసీపీ సర్కార్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

English summary
The ANNA canteens were closed by the current YCP government. It is not proper to shut down the canteens which will starve the poor and take immediate action to hold protests across the state. TDP National Secretary General Nara Lokesh has called on the TDP army on the same issue. He said on Twitter that the movement would continue until the canteens opened
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X