వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీ మంత్రిని ‘బెంజ్ మినిస్టర్’ అంటూ లోకేష్: మా వాళ్లను ఇరికిస్తున్నారంటూ బుద్ధా ఫైర్

|
Google Oneindia TeluguNews

అమరావతి: ఇప్పుడు ఈఎస్ఐ స్కాంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయంగా వేడిపుట్టిస్తోంది. అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా, ఏపీ మంత్రి గుమ్మనూరు జయరాంపై టీడీపీ నేత, ఎమ్మెల్సీ నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

బెంజ్ మంత్రి జయరామ్ అంటూ నారా లోకేష్

ఈఎస్ఐ స్కాం వెనుక అసలు సూత్రధారి రాష్ట్ర మంత్రి గుమ్మనూరు జయరామేనని లోకేష్ ఆరోపించారు. పనులు లేక కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే మంత్రి మాత్రం ఈఎస్ఐ స్కాం నిందితుడు ఇచ్చిన బెంజ్ కారులో విలాసంగా తిరుగుతున్నాడని విమర్శించారు. ‘బెంజ్ మినిస్టర్ జయరాం' అంటూ లోకేష్ ధ్వజమెత్తారు. అత్యంత ఖరీదైన బెంజ్ కారు మంత్రి కుమారుడికి ఎలా వచ్చిందని ప్రశ్నించారు.

అచ్చెన్నాయుడును కక్షతోనే ఇరికించారు..

అచ్చెన్నాయుడును కక్షతోనే ఇరికించారు..

ఇది ఇలావుండగా, టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న మాట్లాడుతూ.. మాజీ మంత్రి అచ్చెన్నాయుడును ఈఎస్ఐ స్కాంలో అన్యాయంగా, కక్షతోనే ఇరికించారని తేలిపోయిందని అన్నారు. మంత్రి జయరాం తప్పుచేస్తే.. అచ్చెన్నాయుడిని 80 రోజులు అక్రమంగా నిర్బంధించారని మండిపడ్డారు. కార్మిక శాఖా మంత్రి జయరాం కుమారుడు ఈశ్వర్‌కు, ఈఎస్ఐ స్కాంలో నిందితుడైన కార్తీక్‌కు మధ్య జరిగిన లోగుట్టు వ్యవహారాలకు సంబంధించిన సాక్ష్యాధారాలను బయటపెట్టామన్నారు. గుమ్మనూరు యువసేన పేరుతో ఉన్న ఫేస్‌బుక్ పేజీలో కార్తీక్ బహుమతిగా ఇచ్చిన బెంజ్ కారును ఈశ్వర్ తీసుకుంటున్న ఫొటో ఉందని చెప్పారు.

స్కాంలు చేసేది వాళ్లు.. నిందలు మాపైనా..?: బుద్ధా వెంకన్న

స్కాంలు చేసేది వాళ్లు.. నిందలు మాపైనా..?: బుద్ధా వెంకన్న


ఈఎస్ఐ స్కాంలో తనకు అడ్డుతగులుతుందని.. కార్మిక శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీగా ఉన్న ఉదయలక్ష్మిపై మంత్రి జయరాం సీఎంవోకు ఫిర్యాదు చేయలేదా? అని బుద్ధా వెంకన్న ప్రశ్నించారు. ఈఎస్ఐ స్కాంలో ఏ14గా ఉన్న ముద్దాయి ఇచ్చిన కారు తీసుకుని, అతన్ని రక్షించడానికి మంత్రి ప్రయత్నిస్తున్నారని తేలిపోయిందని అన్నారు. స్కాంలు చేసేది.. దోచుకునేది వైసీపీ వాళ్లైతే.. నిందలు మాత్రం టీడీపీవాళ్లపై మోపుతారా? అని ప్రశ్నించారు. మంత్రి జయరాం.. అయ్యన్నపాత్రుడితో చర్చకు రావాలని డిమాండ్ చేశారు. తన కుమారుడికి అందిన ముడుపుల గురించి జయరాం బయటపెట్టాలని అన్నారు. సీఎం జగన్ వెంటనే మంత్రి జయరాంను మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.

Recommended Video

Amaravati ఉద్యమానికి 200 రోజులు, Capital Issue Remains Unresolved || Oneindia Telugu
అయ్యన్నపాత్రుడి ఆరోపణలతో రాజకీయ వేడి..

అయ్యన్నపాత్రుడి ఆరోపణలతో రాజకీయ వేడి..


కాగా, మంత్రి జయరాం కుమారుడు ఈశ్వర్‌కు ఓ కేసులో ఏ14 నిందితుడిగా ఉన్న వ్యక్తి బెంజ్ కారు బహుమతిగా ఇచ్చారంటూ టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణలే ఇప్పుడు రాజకీయ వేడినిపుట్టించాయి. జయరాంకు ఏ(నిందితుడు)14గా ఉన్న వ్యక్తి బినామీ అని ఆరోపించారు. మంత్రికి బినామీ కాబట్టే ఆయన కుమారుడికి ఖరీదైన కారు బహుమతిగా ఇచ్చారన్నారు అయ్యన్నపాత్రుడు. టీడీపీ నేత ఆరోపణల్లో వాస్తవం లేదని, ఆయన చెప్పిన బెంజ్ కారుతో తమకు ఎలాంటి సంబంధం లేదని మంత్రి జయరాం స్పష్టం చేశారు.

English summary
lokesh calls minister jayaram as 'benz minister' in esi scam issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X