కుప్పం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కుప్పం నుండి లోకేష్ : చ‌ంద్ర‌బాబు పోటీ చేసే స్థానం ఖ‌రారు ..బాల‌కృష్ణ కు సీటు ఉన్న‌ట్టా..లేన‌ట్టా..!

|
Google Oneindia TeluguNews

వ‌చ్చే సాధార‌ణ ఎన్నిక‌ల్లో టిడిపి అధినేత ఎక్క‌డి నుండి పోటీ చేస్తార‌నే దాని పై స్ప‌ష్ట‌త వ‌స్తోంది. ఎమ్మెల్సీ గా చ‌ట్ట స‌భ ల్లో అడుగు పెట్టి మంత్రి అయిన లోకేష్ ..ఈ సారి ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌టం ఖాయ‌మైంది. వ‌చ్చే శాస‌న‌స‌భా ఎన్ని క‌ల్లో చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం అయిన కుప్పం నుండి పోటీ చేయించాల‌ని దాదాపు ఓ నిర్ణ‌యానికి వ‌చ్చేసారు. దీంతో...టిడిపి అధినేత చంద్ర‌బాబు ఎక్క‌డి నుండి పోటీ చేస్తార‌నే చ‌ర్చ సాగుతోంది. ఇందు కోసం కృష్ణా జిల్లా లేదా గుంటూరు జిల్లాలోని ఒక స్థానం నుండి పోటీ చేస్తార‌నే అంచ‌నాలు వినిపించాయి. వీట‌న్నింటినీ కాద‌ని.. రాజ‌కీయంగా టిడిపి కి మేలు జ‌రిగే విధంగా..అదే స‌మ‌యంలో భారీ మెజార్టీతో గెలిచే నియోజ‌క‌వ‌ర్గాన్ని చంద్ర‌బాబు ఎంపిక చేసుకుంటున్నారు. ఇప్ప‌టికే ఆ నియోజ‌క‌వ‌ర్గం పై పూర్తి స్థాయిలో దృష్టి సారించారు.

కుప్పం నుండి లోకేష్ : గ‌్రౌండ్ ప్రిపేర్‌

ఏపి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ను ఎమ్మెల్యేగా ఆరు సార్లు గెలిపించిన కుప్పం నియోజ‌క‌వ‌ర్గం నుండి త‌న యుడు లోకేష్ ను దింపాల‌ని చంద్ర‌బాబు ఓ నిర్ణ‌యానికి వ‌చ్చారు. కుప్పం నియోజ‌క‌వ‌ర్గం చంద్ర‌బాబు కుటుంబానికి రాజ‌కీయంగా ఎదురులేని స్థానం. త‌న వారసుడిగా లోకేష్ ను ప్ర‌మోట్ చేస్తున్న చంద్ర‌బాబు..కుప్పం నుండి లోకేష్ ను పోటీ చేయించ‌టం ద్వారా..మ‌రింత బ‌ల‌మైన సంకేతాలు ఇవ్వాల‌ని భావిస్తున్నారు. ఇప్ప‌టికే కుప్పం నియోజ‌క‌వ‌ర్గం పార్టీ ప్ర‌ముఖుల‌తో లోకేష్ అనేక సార్లు భేటీ అయ్యారు. ఆ నియోజ‌క‌వ‌ర్గం పై ముఖ్య‌మంత్రి హోదాలో ఉన్న చంద్ర‌బాబు ప్ర‌త్యేక దృష్టి పెట్ట‌లేక పోతున్నారు. స్థానికంగా ఉన్న నేత‌ల‌తో ఎప్ప‌టిక‌ప్పుడు లోకేష్ స‌మావేశ‌మై అక్క‌డ అభివృద్ది అంశాల‌తో పాటుగా రాజకీయ అంశాల‌కు ప్రాధాన్య‌త ఇస్తున్నారు. దీంతో..కుప్పం నుండి లోకేష్ పోటీ చేయ‌టం ద్వారా ఖ‌చ్చితంగా భారీ మెజార్టీతో గెలుస్తార‌ని...శాస‌న‌స‌భ‌లో చంద్ర‌బాబు నియోజ‌క‌వ‌ర్గం నుండి ఆయ‌న వార‌సుడిగా అసెంబ్లీ లో ప్ర‌వేశించేలా చేయాల‌ని చంద్ర‌బాబు భావిస్తున్నారు.

Lokesh contesting form Kuppam... TDP chief Chandrababu naidu contesting From...?

చంద్ర‌బాబు పోటీ స్థానం ఇదే..!! జిల్లాలోనే ప్ర‌భావం చూపేందుకు..

టిడిపి అధినేత చంద్ర‌బాబు వ్యూహాత్మ‌కంగా తాను పోటీ చేసే స్థానాన్ని ఎంపిక చేసుకున్నారు. రాయ‌ల‌సీమ ప్రాంతం లో టిడిపికి ప‌ట్టున్న అనంత‌పురం జిల్లాను ఎంచుకున్న‌ట్లు తెలుస్తోంది. 2014 ఎన్నిక‌ల్లో రాయ‌ల‌సీమ లో వైసిపి ప్ర‌భా వం చూపించినా..అనంత‌పురంలో మాత్రం టిడిపికి ప‌ట్టం క‌ట్టారు. దీంతో..వ‌చ్చే ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు అదే జిల్లాలోని
క‌ళ్యాణ దుర్గం నుండి పోటీ చేయాల‌ని భావిస్తున్న‌ట్లు విశ్వ‌స‌నీయ స‌మాచారం. ముఖ్య‌మంత్రి అనంత‌పురం జిల్లా ప‌ర్య‌ట‌న లో ఈ మేర‌కు సంకేతాలు ఇచ్చిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. క‌ళ్యాణ‌దుర్గం నియోజ‌క‌వ‌ర్గం క‌ర్నాట‌క సరిహ‌ద్దు లో ఉండ‌టంతో పాటుగా రాప్తాడు..రాయ‌దుర్గం నియోజ‌క‌వ‌ర్గాల‌కు బోర్డ‌ర్ లో ఉంది. అక్క‌డ నాలుగున్నారేళ్లు గా వైసిపికి బ‌ల‌మైన నాయ‌క‌త్వం లేదు. ఇక‌, అనంత‌పురం లో టిడిపి గ్రూపు రాజ‌కీయాల‌తో అక్క‌డి టిడిపి ప‌రిస్థితి పై ముఖ్య‌మంత్రి అస‌హ‌నంతో ఉన్నారు. దీంతో..అదే జిల్లా నుండి తానే స్వ‌యంగా పోటీ చేయ‌టం ద్వారా పార్టీకి నైతికంగా బ‌లం పెర‌గ‌టంతో పాటుగా..జిల్లాలోని 14 నియోజ‌క‌వ‌ర్గాల పై ప్ర‌భావం చూపుతుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. అయితే, పిసిసి చీఫ్ ర‌ఘువీరారెడ్డి నియోజ‌క‌వ‌ర్గం సైతం ఇదే. కాంగ్రెస్ - టిడిపి పొత్తు ఉన్న ప‌రిస్థితుల్లో ర‌ఘువీరా మ‌రి చంద్ర‌బాబు ఈ స్థానం నుండి పోటీ చేస్తానంటే..ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. టిడిపి అధినేత క‌ళ్యాణ దుర్గం నుండి పోటీ చేయ‌టం దాదాపు ఖాయ‌మ‌ని జిల్లా నేత‌లు చెబుతున్నారు.

మ‌రి..బాల‌కృష్ణ కు సీటు లేన‌ట్లేనా..

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు అనంత‌పురం జిల్లా నుండి...లోకేష్ కుప్పం నుండి పోటీ చేయ‌టం దాదాపు ఖాయ‌మైన ప‌రిస్థితుల్లో ఇప్పుడు సినీ హీరో - హిందూపూర్ ఎమ్మెల్యే బాల‌కృష్ణ పోటీ పై అనేక అంచ‌నాలు వినిపిస్తున్నాయి. చంద్ర‌బాబు - లోకేష్ ఇద్ద‌రూ రాయ‌ల‌సీమ నుండి పోటీ చేస్తున్న స‌మ‌యంలో అదే ప్రాంతం..చంద్ర‌బాబు పోటీ చేస్తున్న జిల్లా నుండే నంద‌మూరి కుటుంబం నుండి బాల‌కృష్ణ‌కు హిందూపురం సీటు ఇవ్వ‌టం స‌మీక‌ర‌ణాల్లో భాగంగా సాధ్యం కాదనే అభిప్రాయం వినిపిస్తోంది. దీంతో..బాల‌కృష్ణ ను కృష్ణా లేదా గుంటూరు జిల్లాల్లోని ఒక నియోజ‌క‌వ‌ర్గం నుండి పోటీ చేయించ‌టం ద్వారా..అక్క‌డ పార్టీ కి బ‌లం పెంచే విధంగా ఉంటుంద‌నే అభిప్రాయం పార్టీలో వినిపిస్తోంది. అయితే, బాల‌కృష్ణ కు వ‌చ్చే ఎన్నిక‌ల్లో హిందూపురం సీటు ఇచ్చే అవ‌కాశాలు త‌క్కువ‌గానే క‌నిపిస్తున్నాయి. దీంతో...ఇప్పుడు బాల‌కృష్ణ ఎక్క‌డి నుండి పోటీ చేస్తారు..అస‌లు చేస్తారా లేదా అనే చ‌ర్చ అనంత టిడిపి కేడ‌ర్ లో మొద‌లైంది....

English summary
Tdp Chief Chandra Babu Naidu Changing his consituency for 2019 elections. He planning to contest From new assembly segment. He wants to give Kuppam for his son Lokesh . Chandra Babu also planning tp contest From Rayalaseem region.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X