వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్నార్సీపై ఏపీ ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది: మడమతిప్పే నాయకుడు కదా: లోకేశ్ సెటైర్..!

|
Google Oneindia TeluguNews

మాజీ మంత్రి లోకేశ్ ముఖ్యమంత్రి జగన్ పై సెటైర్లు వేసారు. ట్విట్టర్ ద్వారా సీఎం పైన విమర్శలు చేసారు. తాజాగా..ముఖ్యమంత్రి జగన్ ఎన్నార్సీ పైన ప్రకటన చేసారు. ఎన్నార్సీ బిల్లుకు వైసీపీ మద్దతు ఇవ్వదని.. ఏపీలో ఎన్నార్సీ అమలు కాదని స్పష్టం చేసారు. ముస్లింలకు వైసీపీ అండగా ఉంటుందని ప్రకటించారు. దీని పైన లోకేశ్ స్పందించారు. ఏపీ సీఎం జగన్ గారే పెయిడ్ ఆర్టిస్ట్ అని వైసీపీ నేతలు గుర్తించడం మంచిదని ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. ఓట్ల కోసం మడమ తిప్పే నాయకుడు కదా.. ఎంతకైనా దిగజారుతారు..అంటూ ఎద్దేవా చేసారు.

పార్లమెంట్ లో మద్దతు..బయట మాత్రం ఇలా..

ఏపీ సీఎం జగన్ గారే పెయిడ్ ఆర్టిస్ట్ అని వైసీపీ నేతలు గుర్తించడం మంచిదని ట్విట్టర్ వేదికగా టీడీపీ ఎమ్మెల్సీ లోకేష్ పేర్కొన్నారు. పార్లమెంట్‌లో మద్దతు ఇస్తారని.. అసెంబ్లీలో నోటిఫికేషన్లు ఇస్తారన్నారని.. బయట మాత్రం తాము వ్యతిరేకమని ప్రచారం చేస్తారని నారా లోకేష్ ట్వీట్‌ చేశారు. వైసీపీ నేతలు జగన్ గారే పెయిడ్ ఆర్టిస్ట్ అని గుర్తించడం మంచిదంటూ ట్వీట్ లో పేర్కొన్నారు. పార్లమెంట్‌లో మద్దతు ఇస్తారు..అసెంబ్లీలో నోటిఫికేషన్లు ఇస్తారు. బయట మాత్రం మేము వ్యతిరేకమని ప్రచారం చేస్తారు...అంటూ తాజాగా ముఖ్యమంత్రి జగన్ ఎన్నార్సీ బిల్లు పైన చేసిన వ్యాఖ్యల పైన స్పందించారు.

గెజిట్ విడుదల చేసిందంటూ..

గెజిట్ విడుదల చేసిందంటూ..

ఏపీ ప్రభుత్వం ఆగస్టు 16న ఎనార్సీపై గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిందని లోకేశ్ వివరించారు. ఇప్పుడు ఎన్నార్సీ అమలు చేయబోమని జగన్ చెబుతున్నారని వ్యాఖ్యానించారు. ఓట్ల కోసం మడమ తిప్పే నాయకుడు కదా.. ఎంతకైనా దిగజారుతారు అంటూ ఎద్దేవా చేసారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో ప్రవేశ పెట్టిన పౌరసత్వ సవరణ బిల్లుకు వైసీపీ అటు లోక్ సభ..ఇటు రాజ్యసభలోనూ మద్దతు ప్రకటించింది.

 ఏపీలో ఎన్నార్సీ అమలు కాదని

ఏపీలో ఎన్నార్సీ అమలు కాదని

అయితే, దేశ వ్యాప్తంగా ఎన్నార్సీ కు వ్యతిరేకంగా సాగుతున్న నిరనసల్లో భాగంగా..ఏపీలోని కొన్ని ప్రాంతాల్లోనూ నిరసన ప్రదర్శనలు జరిగాయి. దీంతో..డిప్యూటీ సీఎం అంజద్ భాషా ఏపీలో ఎన్నార్సీ అమలు కాదని హామీ ఇచ్చారు. దీనిని గుర్తు చేస్తూ తమ డిప్యూటీ ముఖ్యమంత్రి చెప్పింది ప్రభుత్వ నిర్ణయమని..తాము ముస్లింలకు అండగా ఉంటామని ముఖ్యమంత్రి స్పష్టం చేసారు. దీని పైన లోకేశ్ ట్వీట్ లో విమర్శ చేస్తూ జగన్ ను కార్నర్ చేసారు.

English summary
Ex Minister Lokesh cornered CM Jagan on his latest announcement on NRC. Lokesh says already Ap govt isssed Gazzette on August 16th.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X