వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీడీపీ కార్యకర్తల కోసం లోకేష్ ఫేస్ బుక్ పేజ్ ... కార్యకర్తల రక్షణే ధ్యేయమన్న బాబు టెలీకాన్ఫరెన్స్

|
Google Oneindia TeluguNews

టీడీపీ కార్యకర్తలు, మద్దతుదారులపై జరుగుతున్న దాడులను అడ్డుకోవాలని, కార్యకర్తలకు అండగా నిలవాలని టీడీపీ అధినాయకత్వం నిర్ణయించింది. ఈ నేపధ్యంలోనే మాజీ మంత్రి నారా లోకేష్ దాడులపై ఫిర్యాదు కోసం ఫోన్ నంబర్ ఇవ్వటంతో పాటు , ఫేస్ బుక్ పేజ్ప్రారంభించారు. ఇక చంద్రబాబు కార్యకరతలకు అండగా ఉండాలని టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి తానూ కార్యకర్తల్లో భరోసా నింపేందుకు యాత్ర చేస్తున్నట్టు ప్రకటించారు .

ఏపీ మంత్రులు , ఎమ్మెల్యేలు , అధికారులపై జగన్ నిఘా నేత్రం .. తేడా వస్తే తాట తీసుడేఏపీ మంత్రులు , ఎమ్మెల్యేలు , అధికారులపై జగన్ నిఘా నేత్రం .. తేడా వస్తే తాట తీసుడే

ఈ నెల 9న కడప, అనంతపురం జిల్లాల్లో చంద్రబాబు పర్యటన .. కార్యకర్తల్లో భరోసా నింపే యత్నం

ఈ నెల 9న కడప, అనంతపురం జిల్లాల్లో చంద్రబాబు పర్యటన .. కార్యకర్తల్లో భరోసా నింపే యత్నం

టీడీపీ కార్యకర్తలపై నానాటికీ దాడులు పెరుగుతున్నాయన్న ఆందోళనలో ఉన్న టీడీపీ స్వీయ రక్షణా చర్యలు చేపట్టనుంది. ప్రభుత్వం టీడీపీ కార్యకర్తల మీద దాడులు జరుగుతున్నాయని చెప్పినా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుందని పేర్కొన్న టీడీపీ అధినేత కక్ష సాధింపు చర్యల్లో భాగంగా టీడీపీ కార్యకర్తలను టార్గెట్ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. అందుకే కార్యకర్తల్లో భరోసా నింపేందుకు ఆయన యాత్ర చేపట్టనున్నారు. టీడీపీ శ్రేణుల్లో ధైర్యం నింపేందుకు ఈ నెల 9న కడప, అనంతపురం జిల్లాల్లో పర్యటిస్తానని చంద్రబాబు ప్రకటించారు. ఉండవల్లిలోని తన నివాసంతో ఈరోజు నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్ లో చంద్రబాబు టీడీపీ నేతలు, కార్యకర్తలతో మాట్లాడారు. ధైర్యంగా ఉండాలని సూచించారు .

Recommended Video

40 శాతం మంది మనకే ఓటు వేశారు-చంద్రబాబు
40 రోజుల్లో ఆరుగురు తెలుగుదేశం కార్యకర్తలను చంపేశారని చంద్రబాబు ఆవేదన .. వైసీపీ పతనం ఖాయం అని మండిపాటు

40 రోజుల్లో ఆరుగురు తెలుగుదేశం కార్యకర్తలను చంపేశారని చంద్రబాబు ఆవేదన .. వైసీపీ పతనం ఖాయం అని మండిపాటు

గత 40 రోజుల్లో ఆరుగురు తెలుగుదేశం కార్యకర్తలను పొట్టన పెట్టుకున్నారని టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. అన్నిచోట్ల వైసీపీ అరాచకాలు పెరిగిపోయాయని ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు టీడీపీ కార్యకర్తలపై దాడులు, దౌర్జన్యాలను తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. ఊర్లను ఖాళీ చేసి వెళ్లాలని టీడీపీ శ్రేణులను వైసీపీ నేతలు బెదిరిస్తున్నారని ఆరోపణలు చేశారు. టీడీపీ కార్యకర్తల ఇళ్లపై సామూహిక దాడులు చేస్తున్నారని మండిపడ్డారు .చివరికి పొలాలను కూడా సాగు చేయనివ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు న్యాయ పోరాటం సాగిస్తామని చెప్పారు. టీడీపీ నేతల హత్యల పాపం.. శాపంగా మారి వైసీపీని పతనం చేస్తుందని చంద్రబాబు హెచ్చరించారు.

టీడీపీ కార్యకర్తలకు అండగా ఫేస్ బుక్ పేజ్ .. టోల్ ఫ్రీ నంబర్ ప్రారంభించిన మాజీ మంత్రి లోకేష్

టీడీపీ కార్యకర్తలకు అండగా ఫేస్ బుక్ పేజ్ .. టోల్ ఫ్రీ నంబర్ ప్రారంభించిన మాజీ మంత్రి లోకేష్

ఇక వైసీపీ నేతలు బెదిరించినా, దాడులకు పాల్పడినా , సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారంటూ కేసులు పెట్టి వేధించినా టీడీపీ అధినాయకత్వం దృష్టికి తీసుకురావాలని నారా లోకేష్ కోరారు. టీడీపీ ప్రత్యేక విభాగం నంబర్ 7306299999కు సమాచారం అందించాలని సూచించారు. పార్టీ కోసం జండాలు మోసి అహర్నిశలు కృషి చేసిన కార్యకర్తలు, అభిమానులను రక్షించుకోవడం తమ బాధ్యత అని లోకేష్ వ్యాఖ్యానించారు. అలాగే టీడీపీ కార్యకర్తలు, మద్దతుదారులను ఆదుకునేందుకు ప్రతీ జిల్లాకు లీగల్ సెల్ ఏర్పాటు చేశామని లోకేశ్ పేర్కొన్నారు. ఎలాంటి ఇబ్బంది వచ్చినా లీగల్ సెల్ లో కంప్లైంట్ చెయ్యాలని చెప్పారు. టీడీపీ కార్యకర్తలు, మద్దతుదారులు వేధింపులపై ఫిర్యాదు చేసేందుకు https://www.facebook.com/tdpsocialmedialegalcell అనే ఫేస్ బుక్ పేజీని ప్రారంభించామని మాజీ మంత్రి లోకేష్ తెలిపారు. సోషల్ మీడియాలో టీడీపీపై ఎలాంటి అభ్యంతరకరమైన పోస్టులు పెట్టినట్టు కార్యకర్తల దృష్టికి వచ్చినా , ఈ పేజీ వేదికగా పంచుకోవాలని కోరారు. అలాంటి వ్యక్తులపై చట్టపరమైన పోరాటం చేస్తామనీ,

English summary
TDP chief and former CM Chandrababu Naidu said that six TDP activists have been assaulted in the last 40 days. Outraged that the YCP anarchy has escalated everywhere, Chandrababu said that he strongly condemns the attacks and atrocities on TDP activists. It is alleged that YCP leaders are threatening the TDP lines to evacuate the towns. TDP activists have been known to carry out mass attacks on the homes. Nara Lokesh urged to bring to the attention of the TDP leadership even if YCP leaders threaten, attack and post on social media. TDP special unit number 7306299999 is advised to provide information. Lokesh also said that a legal cell has been set up for each district to woo TDP activists and supporters. Former minister Lokesh said he has launched a Facebook page https://www.facebook.com/tdpsocialmedialegalcell to complain about harassment.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X