గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాష్ట్రాన్ని ముంచే ముఖ్యమంత్రి జగన్: ఎన్ని మాటలు అన్నా పడతాను: లోకేశ్ దీక్ష విరమణ..!

|
Google Oneindia TeluguNews

మాజీ మంత్రి..టీడీపీ నేత లోకేశ్ ఇసుక కొరత..భవన నిర్మాణ కార్మికుల సమస్యల పైన ఒక రోజు దీక్ష చేసారు. ఆరు నెలల్లో మంచి ముఖ్యమంత్రి అనిపించుకుంటా అన్న జగన్ గారు ఐదు నెలల్లోనే రాష్ట్రాన్ని ముంచే ముఖ్యమంత్రి అయ్యారంటూ లోకేశ్ సీఎం జగన్ పైన ఫైర్ అయ్యారు. భవన నిర్మాణ కార్మికులకు తిండి లేకుండా చేసి వైకాపా నేతలు ఇసుక తింటున్నారని విమర్శించారు. టిడిపి హయాంలో ట్రాక్టర్ ఇసుక 1400 నుండి 1800 ఉంటే వైకాపా నేతలు అనేక ఆరోపణలు చేసారని..ఇప్పుడు జగన్ రివర్స్ టెండరింగ్ ద్వారా ట్రాక్టర్ ఇసుక 4 వేల నుండి 6 వేలు అమ్ముతున్నారు.

మరి ఏ పందికోక్కులు తింటున్నాయి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసారు. ప్రపంచంలో ఇసుకని కేజీల్లో అమ్ముతున్న రాష్ట్రం ఒక్క ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే అంటూ ఎద్దేవా చేసారు. ఇసుక కోసం ఏర్పాటు చేసిన వెబ్ సైట్ ఒక మాయ అని...అందులో సామాన్యులకు ఎప్పుడూ నో స్టాక్ అనే వస్తుంది అని లోకేశ్ దుయ్య బట్టారు.

Lokesh fire on Cm jagan and demanded to pay exgrtia for building construction workers

వరదల వల్ల ఇసుక కొరత ఏర్పడింది అని మంత్రులు అంటున్నారని...రాష్ట్రంలో దొరకని ఇసుక బెంగుళూరు,చెన్నై,హైదరాబాద్ ఎలా వెళ్తుందని ప్రశ్నించారు. తాను తిన్నది అరగక దీక్ష చేస్తున్నాను అని మంత్రులు అంటున్నారని..తనను ఎన్ని మాటలు అన్నా పడతాన కానీ...భవన నిర్మాణ కార్మికులను ఇబ్బంది పెడితే మాత్రం ఊరుకునేది లేదంటూ.. వారికి న్యాయం జరిగే వరకూ పోరాటాన్ని కొనసాగిస్తామని లోకేశ్ స్పష్టం చేసారు.

Lokesh fire on Cm jagan and demanded to pay exgrtia for building construction workers

ప్రతిపక్షాలు అనవసర రాద్దాంతం చేస్తున్నాయి అని ముఖ్యమంత్రి అంటున్నారని...రాజధాని సాక్షి గా ఒక ఎమ్మెల్యే,ఎంపీ వీధి రౌడిల్లా కొట్టుకున్నారని లోకేశ్ చెప్పుకొచ్చారు.ఆ పంచాయతీ ముఖ్యమంత్రే తీర్చారని గుర్తు చేసారు. అధికార పార్టీకే చెందిన నెల్లూరు ఎమ్మెల్యే ఇసుక దందా ఆపాలని లేఖ రాసారని చెప్పుకొచ్చారు. ఇసుక కోరితే లేకపోతే ఇసుక వారోత్సవాలు ఎందుకో ముఖ్యమంత్రి చెప్పాలని డిమాండ్ చేసారు. అసమర్థ నిర్ణయాలతో భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని...ఒక్క గుంటూరు లొనే 5గురు కార్మికులు పనులు లేక ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నారని వివరించారు.'

అయినా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదని విమర్శించారు. వెంటనే ఉచిత ఇసుక విధానం తీసుకురావాలని డిమాండ్ చేసారు. జగన్ అనాలోచిత నిర్ణయాల వలన నష్టపోయిన భవన నిర్మాణ కార్మికులకు నెలకి 10 వేల చప్పున ఐదు నెలలకు గాను 50 వేలు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేసారు. ఆత్మహత్యలు చేసుకున్న భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలకు 25 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని లోకేశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు.

English summary
TDP leader lokesh demand govt to pay 25 lakh rupees as exgrtia for who lost lives due to sand problem. He done one day protest against govt negligency on sand issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X