• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మోహన్ బాబు మొదటి టార్గెట్ లోకేష్ బాబే ... మంగళగిరిలో మోహన్ బాబు ప్రచారం అందుకే

|
  AP Assembly Election 2019: మోహన్ బాబు మొదటి టార్గెట్ లోకేష్ బాబే...!! || Oneindia Telugu

  ఏపీ మంత్రి నారా లోకేష్ టార్గెట్ గా వైసీపీ నేతలు ప్రచారం కొనసాగిస్తున్నారు. వైసీపీలో ముఖ్య నాయకులు ఎవరైనా ముందుగా మంగళగిరి నుండి ప్రచారం చెయ్యటానికి ఆసక్తి చూపిస్తున్నారు. నిన్నటికి నిన్న షర్మిల లోకేష్ బాబు ను పప్పు అని సంభోదించి తన ప్రచారంలో ఒక ఆట ఆడుకుంటే , ఇక మాటలతో మాయ చెయ్యగల మోహన్ బాబు సైతం మంగళగిరి నుండి ప్రచారం చేసి లోకేష్ ను టార్గెట్ చేసుకుంటున్నారు. దీంతో లోకేష్ మీద జరుగుతున్న మూకుమ్మడి మాటల దాడితో చంద్రబాబు ఇబ్బంది పడుతున్నారు.

  అందరి టార్గెట్ లోకేష్ బాబే... అందుకే అందరి ప్రచారం మంగళగిరి నుండే

  అందరి టార్గెట్ లోకేష్ బాబే... అందుకే అందరి ప్రచారం మంగళగిరి నుండే

  లోకేష్ పొలిటికల్ ఎంట్రీ నుండీ ఇప్పటి వరకు లోకేష్ టార్గెట్ గా ప్రతిపక్ష నేతలు మాటల తూటాలు పెలుస్తూనే ఉన్నారు. పప్పు అని, చిట్టి నాయుడు అని , ఇక తాజాగా మెగా బ్రదర్ నాగబాబు రేలంగి అని ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు లోకేష్ ను మాటలతో చెడుగుడు ఆడుతున్నారు. సినీ నటుడు.. ఇక తాజాగా వైసీపీలో చేరిన మాజీ రాజ్యసభ సభ్యుడు మోహన్ బాబు మంచి వాగ్దాటి.. మాటలతో మంట పుట్టించే లక్షణం ఉన్న నాయకుడు . ఆయన మాట తీరు ఎలా ఉంటుందో తెలుగు ప్రజలందరికీ తెలుసు.

  నేటి నుండి మోహన్ బాబు ఎన్నికల ప్రచారం .. మంగళగిరి నుండే

  నేటి నుండి మోహన్ బాబు ఎన్నికల ప్రచారం .. మంగళగిరి నుండే

  ఇటీవల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన.. నేటి నుంచి ఏపీలో ఎన్నికల ప్రచారాన్ని చేపడుతున్నారు.ఆయన తన తొలి ఎన్నికల ప్రచారాన్ని మంగళగిరి నుంచి స్టార్ట్ చేయటం లోకేష్ ను టార్గెట్ చెయ్యటమే అంటున్నారు రాజకీయ వర్గాలు. ఇప్పటికే లోకేష్ పై వేస్తున్న పంచ్ లు, జోకులు, సెటైర్లకు ఎలా స్పందించాలో తెలీక పాపం లోకేష్ బాబు ఇబ్బంది పడుతుంటే ఇక మోహన్ బాబు కూడా లోకేష్ టార్గెట్ అంటూ రంగం లోకి దిగటం టీడీపీ శ్రేణులను ఇబ్బందికి గురి చేస్తుంది.

  ఎన్నికల ప్రచారంలో జగన్: హోరెత్తిన జనం (ఫొటోలు)

  ప్రచారంలో ఇబ్బంది పడుతున్న లోకేష్ .. ఆయనపైన సెటైర్లు , జోకులు

  ప్రచారంలో ఇబ్బంది పడుతున్న లోకేష్ .. ఆయనపైన సెటైర్లు , జోకులు

  ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగిన లోకేష్ మంగళగిరి నుండి పోటీ చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో తడబడుతుంటే ఆయన పై భారీగా జోకులు ఈ నియోజకవర్గంలో వినిపిస్తున్నాయి. లోకేశ్ మాట్లాడే తీరు సరిగా లేకపోవటం.. ఆయన మాటల్లో దొర్లే తప్పులు.. తొట్రుబాటు వ్యాఖ్యలు చేయటంతో చినబాబు లోకేష్ ను అందరూ టార్గెట్ చేస్తున్నారు. ఆఖరికి ఆయనపై పోటీ కి ట్రాన్స్ జెండర్ కూడా బరిలోకి దిగింది అంటే లోకేష్ పడుతున్న ఇబ్బంది ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.

  మోహన్ బాబు వాగ్దాటిని లోకేష్ తట్టుకోవటం కష్టమే

  మోహన్ బాబు వాగ్దాటిని లోకేష్ తట్టుకోవటం కష్టమే

  ఇక మోహన్ బాబు లాంటి సినీ ప్రముఖులు, రాజకీయాల్లో ఆరితేరిన వారు, అనర్గళంగా పక్క వారి గుక్క తిప్పుకోనీకుండా మాట్లాడగలిగిన వాగ్ధాటి ఉన్న వారు ఎన్నికల ప్రచార బరిలోకి దిగితే చినబాబుకు చుక్కలు ఖాయమంటున్నారు. గతంలో కొంతకాలం టీడీపీ తరఫున ప్రచారం చేసిన మోహన్ బాబు.. ఈసారి అందుకు భిన్నంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేయటంతో ఆయన చేసే వ్యాఖ్యలపై ఉత్కంఠ నెలకొంది. మరి మోహన్ బాబు వాగ్దాటిని చినబాబు తట్టుకుంటారో లేదో ..

  English summary
  Starting Saturday, senior Telugu film actor-producer and former Rajya Sabha member Manchu Mohan Babu will kick-start his campaign for the YSR Congress party, in which he had joined early this week. Interestingly, the first person Mohan Babu would be targeting in the Telugu Desam Party in his first campaign trail would be Nara Lokesh Babu, TDP general secretary and son of party president and chief minister N Chandrababu Naidu.Mohan Babu will start his first election rally from Mangalagiri and the party leaders are expecting that his histrionic speeches will definitely attract huge crowds.He has chosen Mangalagiri for obvious reasons because it will give him an opportunity to expose Naidu and his son at a time.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X