వైకాపా కోడి కత్తి డ్రామా!;అధికారం కోసం అడ్డదారులు...జగన్ మోదీ రెడ్డికి కొత్త కాదు:లోకేష్ ట్వీట్స్

అమరావతి:జగన్‌పై దాడి ఒక డ్రామాగా అభివర్ణిస్తూ మంత్రి నారా లోకేష్ ట్వీట్‌ చేశారు. జగన్‌ పదవి కోసం అడ్డదారులు తొక్కే క్రమంలో ఇలాంటి నాటకాలకు పాల్పతున్నారని లోకేష్ ఆరోపించారు.

లోకేష్ ఏమని ట్వీట్ చేశారంటే..."వైకాపా కోడి కత్తి డ్రామా!...అధికారం కోసం అడ్డదారులు తొక్కడం 'జగన్ మోదీ రెడ్డి'కి కొత్త కాదు...మరోసారి ఓటమి తప్పదు అనే భయంతో ఈ కోడి కత్తి డ్రామాకి తెరలేపారు...దాడి వెనుక ఉన్న వైకాపా కుట్ర ప్రజలకు అర్థం అయ్యింది...ఇంకా ప్రజలను మభ్య పెట్టాలని వైకాపా నేతలు మొసలి కన్నీరు కారుస్తున్నారు"...అని కామెంట్ చేశారు.

మరో ట్వీట్ లో..."తండ్రి చితికి నిప్పు పెట్టకముందే ముఖ్యమంత్రి పీఠం పై కన్నేసిన వ్యక్తి ఇలాంటి కత్తి డ్రామా చెయ్యడంలో ఆశ్చరం లేదు.ఎన్ని కుయుక్తులు పన్నినా ఆఖరిగా ప్రజల ముందు గెలిచేది నిజం మాత్రమే." అని లోకేష్ వ్యాఖ్యానించారు.

అంతకుముందు జగన్‌ పై దాడి గురించి విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ ను పొడవమని వైసీపీ నేతలే వెయిటర్‌కు కత్తి ఇచ్చినట్లుగా ఉందని జలీల్ ఖాన్ వ్యాఖ్యానించారు. జగన్ వంటి నేతపై దాడి జరిగితే నిందితుడిని కొట్టకుండా పోలీసులకు అప్పగించేంత సహనం వైసీపీకి ఉందా అని ప్రశ్నించారు.

 Lokesh latest tweets over attack on Jagan

గతంలో జగన్ అభివృద్ధికి అడ్డుపడేవారని...ఇప్పుడు ముగ్గురు తయారయ్యారని మండిపడ్డారు. జగన్, పవన్‌, బీజేపీ కలిసి రాష్ట్రంలో అల్లర్లకు కుట్ర పన్నారని జలీల్‌ఖాన్ ఆరోపించారు. అయితే విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే అయిన జలీల్ ఖాన్ వైసిపి తరుపున గెలిచి టిడిపిలోకి ఫిరాయించిన శాసన సభ్యుడు కావడం గమనార్హం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+