• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

పొలాలతో పాటు వాళ్ళ కళ్ళలోనూ నీళ్ళు .. ఆ రైతులను ఆదుకోవాలని జగన్ కు లోకేష్ లేఖ

|
Google Oneindia TeluguNews

ఇటీవల కురిసిన అకాల వర్షాలతో ఉభయగోదావరి జిల్లాల్లో నాలుగు లక్షలకు పైగా ఎకరాల్లో వరి పంటకు నష్టం వచ్చిందని పొలాలతో పాటు రైతుల కళ్లలో నీళ్లు నిండి ఎక్కడ చూసినా దయనీయ పరిస్థితులు కనిపించాయని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశారు. అకాల వర్షాలకు తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాలలో పంట నష్టపోయి రైతులు పడుతున్న ఇబ్బందులపై లేఖ రాసిన లోకేష్ రైతుల దయనీయ పరిస్థితులను లేఖ ద్వారా సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు.

వరదలపై ఏపీ సీఎస్ కు చంద్రబాబు లేఖ; ప్రభుత్వ వైఫల్యాలను ఏకరువు పెట్టిన మాజీ సీఎం!!వరదలపై ఏపీ సీఎస్ కు చంద్రబాబు లేఖ; ప్రభుత్వ వైఫల్యాలను ఏకరువు పెట్టిన మాజీ సీఎం!!

రైతులు పండించిన పంటను అకాల వర్షాలు మింగేశాయన్న లోకేష్

రైతులు పండించిన పంటను అకాల వర్షాలు మింగేశాయన్న లోకేష్

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి నారా లోకేష్ రాసిన లేఖలో ఉభయ గోదావరి జిల్లాల్లో అత్యధికంగా పండించే వరి పంటకు పెద్ద ఎత్తున నష్టం వచ్చిందని, అప్పులు చేసి పెట్టుబడులు పెట్టి ఇంటిల్లిపాది శ్రమించి పండించిన పంట చేతికందే సమయంలో వర్షాలకు నీటి పాలై తీవ్ర ఆందోళనలో రైతులు ఉన్నారని పేర్కొన్నారు .ఈ ఏడాది వచ్చిన వరుస తుపాన్లతో తీవ్రంగా నష్టపోయిన రైతులు రెండుసార్లు నాట్లు వేసి పంటను కోల్పోయారని లేఖ ద్వారా స్పష్టం చేశారు లోకేష్. మరోసారి పెద్దఎత్తున పెట్టుబడి పెట్టి వ్యవసాయం చేసి పండించిన పంటను అకాల వర్షాలు మింగేశాయి అని లోకేష్ తన లేఖ ద్వారా సీఎం జగన్ కు తెలియజేశారు.

ఉభయగోదావరి జిల్లాలలో అకాల వర్షాలకు దెబ్బ తిన్న పంటలపై లోకేష్

ఉభయగోదావరి జిల్లాలలో అకాల వర్షాలకు దెబ్బ తిన్న పంటలపై లోకేష్

ఎక్కడ చూసినా వర్షాలకు కుళ్ళిన పంటలు, నేలకొరిగిన చేలు, మొలకెత్తుతున్న ధాన్యమే కనిపిస్తున్నాయని, రైతుల పంట పొలాల్లో నీళ్లు, కళ్ళల్లో నీళ్లతో దయనీయంగా పరిస్థితి ఉందని లోకేష్ పేర్కొన్నారు. తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాలో నాలుగు లక్షల ఎకరాలకు పైగా వరి పంటకు నష్టం వచ్చిందని చాలా చోట్ల పంట తడిసిపోయి మొలకలు కూడా వస్తున్నాయని లోకేష్ పేర్కొన్నారు. ఇక మిర్చి పంటకు కూడా బాగా నష్టం వాటిల్లిందని పేర్కొన్న లోకేష్ సరైన నిర్వహణ లేకపోవడంతో డ్రెయిన్లు పొంగిపొర్లి పొలాలు నీట మునిగాయని పేర్కొన్నారు.

పంట నష్టం నమోదులో సర్కార్ అనుసరిస్తున్న విధానాలు దారుణం

పంట నష్టం నమోదులో సర్కార్ అనుసరిస్తున్న విధానాలు దారుణం

తడిసిన ధాన్యం, రంగు మారిన ధాన్యం అంటూ తక్కువ రేటుకు కొనేందుకు దళారులు ప్రయత్నిస్తుంటే ప్రభుత్వ యంత్రాంగం చోద్యం చూస్తోందని లోకేష్ విమర్శించారు. అధికారులేమో 33 శాతం నష్టం వాటిల్లితే పంట నష్టం నమోదు చేస్తామని నిబంధనను పెట్టి రైతులను వేధిస్తున్నారంటూ లోకేష్ ఆరోపించారు. పంట నష్టం నమోదులో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు రైతులను మరింత కుంగదీస్తున్నాయి అని లోకేష్ పేర్కొన్నారు. ప్రభుత్వం గొప్పగా ప్రచారం చేసుకుంటున్న రైతు భరోసా కేంద్రాల వద్ద కూడా తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ఎటువంటి ఏర్పాట్లు చేయలేదని లోకేష్ వెల్లడించారు.

కూరగాయాలు, పండ్ల తోటలు, ఆక్వా కల్చర్ కు కూడా భారీ నష్టం

కూరగాయాలు, పండ్ల తోటలు, ఆక్వా కల్చర్ కు కూడా భారీ నష్టం

గోనె సంచులు కూడా అందుబాటులో లేవంటూ కొన్నిచోట్ల ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడం బాధ్యతా రాహిత్యానికి అద్దం పడుతుందని లోకేష్ మండిపడ్డారు . ఉభయ గోదావరి జిల్లాలలో పెద్ద సంఖ్యలో ఉన్న కౌలు రైతులకు అపార నష్టం జరిగినా ప్రభుత్వం నుంచి వారికి ఎటువంటి సహాయం అందలేదని పేర్కొన్న లోకేష్ దిక్కుతోచని స్థితిలో రైతులు ఉన్నారని, వారిని ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు. కూరగాయల పంటలు, పండ్లతోటలకు, ఆక్వా కల్చర్ కు కూడా పెద్ద ఎత్తున నష్టం ఏర్పడిందని లోకేష్ వెల్లడించారు.

రైతులకు పరిహారం ఇవ్వాలని లోకేష్ డిమాండ్

రైతులకు పరిహారం ఇవ్వాలని లోకేష్ డిమాండ్

గత ఏడాది మిర్చి పంటకు సరైన ధర లభించక ఇబ్బందులు పడిన రైతులకు ఈ ఏడాది వర్షాలు మరింత నష్టాన్ని చేకూర్చాయని లోకేష్ పేర్కొన్నారు. రైతుకు వరికి హెక్టారుకు 25 వేల రూపాయలు, పత్తికి 25 వేల రూపాయలు, మొక్కజొన్నకు 15 వేల రూపాయలు, కొబ్బరి చెట్లకు 3వేల రూపాయలు, ఆక్వా కు హెక్టారుకు 50 వేల రూపాయలు పరిహారం అందించాలని ఎలాంటి షరతులు లేకుండా పూర్తి మొత్తం చెల్లించి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు నారా లోకేష్.

  Omicron : PM Modi High Level Review On New Variant || Oneindia Telugu
  పంట నష్టపోయిన రైతులందరికీ పరిహారం అందాలి

  పంట నష్టపోయిన రైతులందరికీ పరిహారం అందాలి

  నామ్కే వాస్తే గా ఉన్న రైతు భరోసా కేంద్రాలు రైతులకు అండగా నిలిచే కేంద్రాలుగా తీర్చిదిద్దాలని లోకేష్ జగన్ కు రాసిన లేఖలో పేర్కొన్నారు. పంట నష్టపరిహారం లెక్కింపు ప్రక్రియను రైతులకు దూరం చేస్తున్న నిబంధనలను సవరించి నష్టపోయిన ప్రతి రైతు, కౌలు రైతులకు కూడా సహాయం అందించాలని లోకేష్ వైయస్ జగన్ కు రాసిన లేఖలో స్పష్టం చేశారు.

  English summary
  Lokesh wrote a letter to CM Jagan on the plight of farmers in East Godavari and West Godavari districts due to unseasonal rains .Lokesh demanded that the government pay compensation to them.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X