యూనివర్సిటీలలో వైసీపీ కార్యకర్తల జాబ్ మేళాలు ఎలా నిర్వహిస్తారు? యూజీసీకి లోకేష్ లేఖ
జగన్ సర్కారు తీరుపై నారా లోకేష్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాజకీయ అవసరాల కోసం యూనివర్సిటీలను దుర్వినియోగం చేస్తున్నారంటూ యు జి సి కి లేఖ రాసిన నారా లోకేష్ ఈ మేరకు ఆ లేఖను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో యూనివర్సిటీలు దుర్వినియోగం అవుతున్నాయని లోకేష్ ఈ లేఖలో వ్యక్తం చేశారు. యూనివర్సిటీలను కాపాడాల్సిన బాధ్యత యూజీసీపైన ఉందని పేర్కొన్నారు.

వైసీపీ కార్యకర్తల కోసమే జాబ్ మేళాలు ప్రకటించటం రాజ్యాంగ విరుద్ధం
రాజకీయ
అవసరాల
కోసం
రాష్ట్రంలో
విశ్వవిద్యాలయాలను
దుర్వినియోగం
చేస్తున్నారంటూ
యూనివర్సిటీ
గ్రాంట్స్
కమిషన్(యూజీసీ)
ఛైర్మన్
జగదీష్
కుమార్
,
కేంద్ర
ఉన్నత
విద్య
శాఖ
కార్యదర్శి
సంజయ్
మూర్తికి
లేఖ
రాసానని
పేర్కొన్న
లోకేష్
విశ్వవిద్యాలయాల్లో
వైసిపి
రాజకీయ
పార్టీ
కార్యకర్తలకు
ప్రైవేటు
ఉద్యోగాలంటూ
జాబ్
మేళా
ప్రకటించటం
రాజ్యాంగ
వ్యతిరేకం
అని
లేఖ
ద్వారా
స్పష్టం
చేశారు.
తిరుపతిలో
వెంకటేశ్వర
విశ్వవిద్యాలయంలో,
నాగార్జున
యూనివర్సిటీలో,
ఆంధ్రా
యూనివర్సిటీలలో
ఏపీ
సీఎం
జగన్మోహన్
రెడ్డి
ఆదేశాల
మేరకు
పార్టీ
కార్యక్రమంగా
జాబ్
మేళాలు
నిర్వహిస్తున్నారని
లేఖలో
పేర్కొన్నారు
లోకేష్.

విశ్వవిద్యాలయాల ప్రాంగణాల్లోనే రాజకీయ జాబ్ మేళాలు.. చర్యలు తీసుకోండి
విశ్వవిద్యాలయాల ప్రాంగణాల్లోనే రాజకీయ జాబ్ మేళాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని దీనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తమ పార్టీ కార్యక్రమానికి యూనివర్సిటీలను వినియోగించడం యూనివర్సిటీ నిబంధనలను ఉల్లంఘించడం అని పేర్కొన్నారు. 2019 ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి ప్రైవేట్ కంపెనీల ద్వారా 15 వేల నుంచి 25 వేల మంది పార్టీ కార్యకర్తలకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామని వాగ్ధానం చేశారని ఈ మేరకు ysrcpjobmela.com వెబ్ సైట్ ను కూడా ప్రారంభించారు అని లోకేష్ లేఖలో పేర్కొన్నారు.

రాష్ట్రంలో నిరుద్యోగులున్నా, వైసీపీ కార్యకర్తలకు జాబ్ మేళాలు
రాష్ట్రంలో
నిరుద్యోగ
సమస్య
తీవ్రంగా
ఉందని
పేర్కొన్న
లోకేష్,
సీఎంఐఈ
ప్రకారం
ఆంధ్రప్రదేశ్
రాష్ట్రంలో
పట్టభద్రుల
నిరుద్యోగ
రేటు
35
శాతం
ఉందని
పేర్కొన్నారు.
దక్షిణ
భారత
దేశంలో
ఇది
దారుణమైన
పరిస్థితి
అని,
భారతదేశంలో
ఆంధ్ర
ప్రదేశ్
నిరుద్యోగులు
ఎక్కువగా
ఉన్న
రాష్ట్రాలలో
4వ
స్థానంలో
ఉందని
పేర్కొన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా
లక్షల
మంది
నిరుద్యోగులు
ఉంటే
కేవలం
వైసీపీ
కార్యకర్తలకు
మాత్రమే
జాబ్
మేళాలు
ప్రకటించారని
ఆయన
అసహనం
వ్యక్తం
చేశారు.

రాజ్యాంగ సూత్రాలను ఉల్లంఘిస్తూ జాబ్ మేళాల నిర్వహణపై యూజీసీ చర్యలు తీసుకోవాలి
గత
సార్వత్రిక
ఎన్నికల్లో
వైయస్సార్
కాంగ్రెస్
పార్టీ
గెలుపు
కోసం
కృషి
చేసిన
వారికే
ఈ
జాబ్
మేళాలు
నిర్వహిస్తున్నట్లు
వైసీపీ
ఎంపీ
విజయసాయి
రెడ్డి
స్వయంగా
ప్రకటించారు.
రాజ్యాంగ
సూత్రాలను
ఉల్లంఘిస్తూ
జరిగిన
ఈ
ఘటనల
పట్ల
తగు
చర్యలు
తీసుకోవాలని
లోకేష్
యుజిసి
కి
విజ్ఞప్తి
చేశారు.
లక్షలాదిమంది
నిరుద్యోగ
పట్టభద్రులను
నిర్లక్ష్యం
చేస్తూ
ఉద్యోగ
అవకాశాలను
వైయస్సార్
కాంగ్రెస్
పార్టీ
కార్యకర్తలకే
పరిమితం
చేస్తున్నారు.
విద్యా
సంస్థల
నైతికత,
విలువలు
దిగజారకుండా
తగు
జాగ్రత్తలు
తీసుకోవాలని
తాను
యూజీసీ
ని
కోరానని
లోకేష్
పేర్కొన్నారు.