వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మూర్ఖత్వం అసలుపేరు, అహంభావం ముద్దుపేరు జగన్ అట .. జగన్ లో కసి లోకేష్ కు బాగా నచ్చిందట

|
Google Oneindia TeluguNews

ఏపీలో గత ఎన్నికల్లో టీడీపీ ఓటమిపాలైన తరువాత టీడీపీ నేతలు అందరు కూడా దాదాపుగా సైలెంటుగా ఉంటున్నారు. అయితే టిడిపి నుండి వైసిపి ప్రభుత్వంపై, సీఎం జగన్మోహన్ రెడ్డిపై మాటల దాడి చేస్తూ దూకుడు చూపిస్తున్నారు టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. ఏపీలో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో ఇంత జోష్ చూపించని లోకేష్ బాబు ఓటమి తర్వాత బాగా యాక్టివ్ అయ్యారు. ఆయన ఏపీ ప్రభుత్వం పై చాలా సీరియస్ గా వ్యాఖ్యలు చేస్తున్నారు.

<strong>శ్వేతపత్రాల పేరుతో అప్పట్లో బోగస్ పత్రాలు .. ఇప్పుడు తాళపత్రాలు తెచ్చినా లాభం లేదట బాబు</strong>శ్వేతపత్రాల పేరుతో అప్పట్లో బోగస్ పత్రాలు .. ఇప్పుడు తాళపత్రాలు తెచ్చినా లాభం లేదట బాబు

 విద్యుత్ ఒప్పందాల సమీక్ష గురించి జగన్ కు చురకలు వేసిన నారా లోకేష్

విద్యుత్ ఒప్పందాల సమీక్ష గురించి జగన్ కు చురకలు వేసిన నారా లోకేష్

ఏ మాత్రం అవకాశం దొరికినా వైసిపి ప్రభుత్వం మీద, వైసీపీ నాయకుల మీద విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు నారా లోకేష్. ఎక్కువగా ఏపీలోని రాజకీయ నాయకులు తమ సమయం వృధా కాకుండా, పైసా ఖర్చు లేకుండా సోషల్ మీడియా వేదికగా రాజకీయ పంచాయతీలకు తెరలేపారు. ఇక అదే బాటలో నారా లోకేష్ సైతం ట్విట్టర్ ని వేదికగా చేసుకొని మరీ జగన్ ప్రభుత్వాన్ని నాయకులందరినీ విమర్శిస్తూ వరుసగా ట్వీట్లు పెడుతూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇటీవల విద్యుత్ ఒప్పందాల సమీక్ష కేంద్ర ప్రభుత్వం వద్దన్నా రాష్ట్ర ప్రభుత్వం కచ్చితంగా విద్యుత్ ఒప్పందాల సమీక్ష జరిపితీరుతామని నిర్ణయం తీసుకున్న నేపధ్యంలో జగన్ పై వ్యంగ్యంగా ట్వీట్ చేశారు నారా లోకేష్ . ఇక అక్కడితోఆగకుండా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కసి తనకు చాలా నచ్చిందంటూ సెటైర్లు వేశారు.

మూర్ఖత్వం అసలు పేరు, అహంభావం ముద్దు పేరు జగన్ అని పేర్కొన్న చినబాబు లోకేష్

మూర్ఖత్వం అసలు పేరు, అహంభావం ముద్దు పేరు జగన్ అని పేర్కొన్న చినబాబు లోకేష్

ఒక పోస్ట్ లో ఇక జగన్ కు మూర్ఖత్వం వుందని ఆయన ఆరోపించారు. మూర్ఖత్వం అసలు పేరు, అహంభావం ముద్దు పేరు అయిన జగన్ గారిని చూస్తుంటే ఇది అక్షరాలా నిజం అనిపిస్తుంది. విద్యుత్ ఒప్పందాలు పారదర్శకంగానే జరిగాయని, సమీక్ష వద్దని కేంద్రం, మేధావులు చెప్పినా జగన్ గారి చెవికెక్కలేదు. ఓ కమిటీ వేసి, ఏదో చేసేద్దామని, లేని అవినీతిని నిరూపించాలని కసిగా ఉన్నారు అని వ్యాఖ్యానించారు. ఇక మరొక ట్వీట్ లో నారా లోకేష్ కరెంటు కోతల మీద దృష్టిపెట్టండి. రాష్ట్రాన్ని చీకట్లోకి నెట్టకండి అని సలహా ఇచ్చారు.

మీ కసి నాకు తెగ నచ్చేసింది కానీ ఎన్‌టీపీసీ వాళ్ళకు నచ్చలేదనుకుంటా అంటూ ఎద్దేవా చేసిన లోకేష్

మీ కసి నాకు తెగ నచ్చేసింది కానీ ఎన్‌టీపీసీ వాళ్ళకు నచ్చలేదనుకుంటా అంటూ ఎద్దేవా చేసిన లోకేష్

" జగన్ గారూ! మీ కసి నాకు నచ్చింది. కానీ ఎన్‌టీపీసీ వాళ్ళకు నచ్చలేదనుకుంటా. అందుకే ఈ లెటర్ రాసారు. తెలుగుదేశం పార్టీ హయాంలో విద్యుత్ ఒప్పందాలన్నీ పారదర్శకంగా జరిగాయని, నాటి మార్కెట్ ధరల కంటే తక్కువకే కొనుగోలు ధరలు నిర్ణయించామని రాసారు."
"బిడ్ల ఎంపిక విధానాన్ని జాతీయ విద్యుత్తు నియంత్రణ మండలి కూడా ప్రశంసించిందని రాసారు. ఏంటో! మీ కసిని ఎవరూ అర్థం చేసుకోవడం లేదు. ఇప్పటికైనా కమిటీలు, సమీక్షలు అంటూ కాలయాపన చేయకుండా ఏపీలో కరెంటు కోతల మీద దృష్టిపెట్టండి. రాష్ట్రాన్ని చీకట్లోకి నెట్టకండి." అంటూ సెటైర్లు వేశారు. అయితే లోకేష్ బయటకు వచ్చి మాట్లాడడానికి భయపడుతూ, ఇలా ఎప్పటికి ట్వీట్లు చేస్తూ కాలక్షేపం చేస్తున్నారని వైసిపి నేతలు విమర్శిస్తున్నారు. మీడియా ముందుకు వచ్చే లోకేష్ బాబు ఇలాంటి విషయాల గురించి మాట్లాడితే బాగుంటుందని లోకేష్ పైన ఎదురుదాడి చేస్తున్నారు. మొత్తానికి లోకేష్ చెప్పిన విషయం ఏదైనా జగన్ లో ఉన్న కసి లోకేష్ కు బాగా నచ్చిందట..

English summary
Lokesh responded via Twitter and setairs on CM Jagan. He said that i lke your will power, But NTPC do not like . That is why this letter was written by them . they wrote that during the rule of the Telugu Desam Party, power contracts were made transparent and that the purchase prices were fixed at below market prices. ”“The National Electricity Regulatory Board also praised the bid selection process,” . What! No one understands your will power jagan . sarcastically tweeted nara lokesh .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X