వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రూల్ ఈజ్ రూల్, ఆఖరికి మామ చెప్పినా సరే పట్టించుకోవద్దు: అధికారులతో లోకేష్

తన పేరు మీద సొంత మనుషులు ఫోన్ చేసినా.. ఆఖరికి అది తన మామ అయినా సరే నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించవద్దని గట్టిగా చెప్పారు.

|
Google Oneindia TeluguNews

మంత్రి కొలువులో ఆసీనులైన నారా లోకేష్.. బాధ్యతల విషయంలో ఏమాత్రం తేడా రాకుండా వ్యవహరించాలని జాగ్రత్తపడుతున్నారు. ముఖ్యంగా తన కార్యాచరణ, ఆదేశాలు అమలు చేసేది అధికారులే కాబట్టి పనితీరులో వారంతా కచ్చితత్వంతో వ్యవహరించాలని భావిస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే ఎలాంటి లాలూచీలకు, పైరవీలకు తావు ఇవ్వకుండా ఉండటానికి ఎలాంటి రికమండేషన్స్ ను ప్రోత్సహించవద్దని అధికారులకు లోకేష్ ఆదేశాలు జారీ చేశారు. ఆఖరికి తన పేరు చెప్పి ఎవరైనా ఫోన్ చేసినా సరే.. అలాంటి వాటిని పట్టించుకోవద్దని అధికారులకు తేల్చి చెప్పారు.

Lokesh

తాను మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఐటీ, పంచాయితీరాజ్ శాఖ అధికారులపై నిఘా మరింత ఎక్కువగా ఉంటుందని, కాబట్టి అధికారులంతా దాన్ని దృష్టిలో పెట్టుకుని పనిచేయాలని లోకేష్ సూచించారు. తన పేరు మీద సొంత మనుషులు ఫోన్ చేసినా.. ఆఖరికి అది తన మామ అయినా సరే నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించవద్దని గట్టిగా చెప్పారు.

కాగా, శుక్రవారం నాడు మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం లొకేష్ డ్వామా పీడీలతో సమావేశమయ్యారు. ఈ సందర్బంగా అధికారులందరికీ నియమ నిబంధనల గురించి, పనితీరులో ఎలా వ్యవహరించాలన్న దాని గురించి లోకేష్ వివరించారు.

English summary
After taking the ministry Nara Lokesh held a meeting with DWMA officials in secretariat. He said dont be neglect and dont encourage recommendations
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X