• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

వైసీపీ రాజకీయ నిరుద్యోగులకు ఉద్యోగాలా .. మరి నిరుద్యోగ యువతకు వద్దా ? జగన్ పై నారా లోకేష్ అస్త్రం !!

|

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగ యువత జాబ్ క్యాలెండర్ కోసం సమరభేరి మ్రోగుతుంది. నూతన జాబ్ క్యాలెండర్ ను ప్రకటించి రెండు లక్షల 30 వేల పోస్టులను భర్తీ చేయాలని, పాత జాబ్ క్యాలెండర్ ను రద్దు చేయాలన్న డిమాండ్ తో ఛలో తాడేపల్లికి పిలుపునిచ్చారు . విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు, నిరుద్యోగ సంఘాల పిలుపు మేరకు ఈరోజు తాడేపల్లిలోని సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇంటి ముట్టడికి ప్రయత్నిస్తున్నారు పెద్ద ఎత్తున నిరుద్యోగ యువత.

సీఎం జగన్ ఇంటి ముట్టడి, ఛలో తాడేపల్లి ర్యాలీలతో సీఎం ఇంటి పరిసరాల్లో ఉద్రిక్తత , డ్రోన్లతో నిఘా!!సీఎం జగన్ ఇంటి ముట్టడి, ఛలో తాడేపల్లి ర్యాలీలతో సీఎం ఇంటి పరిసరాల్లో ఉద్రిక్తత , డ్రోన్లతో నిఘా!!

ఛలో తాడేపల్లి ఆందోళనలు, అరెస్టులు ..జగన్ సర్కార్ పై మండిపడిన లోకేష్

ఛలో తాడేపల్లి ఆందోళనలు, అరెస్టులు ..జగన్ సర్కార్ పై మండిపడిన లోకేష్

తెలుగుదేశం పార్టీ అనుబంధ సంస్థలైన టిఎన్ఎస్ఎఫ్, తెలుగు యువత ఆధ్వర్యంలో, మిగతా విద్యార్థి సంఘాలు, వామపక్ష పార్టీలను కలుపుకొని చేస్తున్న ఆందోళన కార్యక్రమాన్ని పోలీసులు పెద్ద ఎత్తున అణచివేస్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ ఆందోళనకారులను అరెస్టు చేస్తూ పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు. ఇక దీనిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మొన్నటి వరకు పదవ తరగతి, ఇంటర్ పరీక్షల రద్దు కోసం పోరాటం చేసిన నారా లోకేష్, ప్రస్తుత నిరుద్యోగుల పక్షాన పోరాటానికి దిగారు.అందులో భాగంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు రెండు లక్షల 30 వేల పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

వైసీపీ రాజకీయ నిరుద్యోగులకు ఉద్యోగాలా ?

వైసీపీ రాజకీయ నిరుద్యోగులకు ఉద్యోగాలా ?

ఇక తాజాగా ఛలో తాడేపల్లి నేపథ్యంలో పోలీసుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన నారా లోకేష్ నిరసనకారులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించడం పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చారని పేర్కొన్న లోకేష్ రాష్ట్ర నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఎక్కడ ? వైయస్ జగన్ గారు అంటూ సీఎం జగన్ ను నిలదీశారు. అంతేకాదు నిరుద్యోగుల ఉద్యమాన్ని నిర్బంధంతో అణచివేయలేరని తేల్చి చెప్పారు.

ఆనాడు సీఎం ఉద్యోగాల భర్తీ చెయ్యకుంటే మీ ఈ కొలువులు ఉండేవా ? పోలీసులకు సూటి ప్రశ్న

ఆనాడు సీఎం ఉద్యోగాల భర్తీ చెయ్యకుంటే మీ ఈ కొలువులు ఉండేవా ? పోలీసులకు సూటి ప్రశ్న

కొత్త జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన సీఎం జగన్ ఇల్లు ముట్టడి కార్యక్రమంలో మీ నిర్బంధాలను, అక్రమ అరెస్టులను ఎదురొడ్డి మరీ నిరసన తెలిపిన యువత ఉద్యమ స్ఫూర్తిని అభినందిస్తున్నానని నారా లోకేష్ ఈ సందర్భంగా వెల్లడించారు. ఈరోజు ఆంధ్ర ప్రదేశ్ ఉద్యోగ పోరాట సమితి ఉద్యమాన్ని ఉక్కు పాదంతో అణిచి వేస్తున్న కానిస్టేబుల్ నుంచి ఐపీఎస్ అధికారుల వరకు సీఎం జగన్ రెడ్డిలానే, ఆనాటి ముఖ్యమంత్రులు ఉద్యోగ భర్తీ చేయకుండా ఉంటే ఈ రోజు మీకు ఈ కొలువులు ఉండేవా? అని ఆలోచించాలని కోరుతున్నా అంటూ లోకేష్ పేర్కొన్నారు.

కొత్త జాబ్ క్యాలెండర్ ప్రకటించండి .. లేదంటే భవిష్యత్ లో ఉద్యమం మరింత ఉధృతం ..

కొత్త జాబ్ క్యాలెండర్ ప్రకటించండి .. లేదంటే భవిష్యత్ లో ఉద్యమం మరింత ఉధృతం ..

ఉద్యోగ పోరాట సమితి న్యాయమైన డిమాండ్లు పరిష్కరించకపోతే రానున్న రోజుల్లో ఈ ఉద్యమం మహోద్యమంగా మారుతుందని లోకేష్ హెచ్చరించారు. అప్పుడు ఈ పోలీసులు మరో వందింతలు వచ్చినా నిరసనలను ఆపలేరని, ముఖ్యమంత్రి తాను విస్మరించిన హామీలను తక్షణమే అమలు చేయాలని లోకేష్ డిమాండ్ చేశారు . ఉద్యోగాల భర్తీకి నూతన జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని పేర్కొన్న లోకేష్ అరెస్టు చేసిన విద్యార్థి, యువ నేతలందర్నీ తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం అంటూ తెలిపారు. మొత్తానికి నిరుద్యోగ యువత కోసం మరో పోరాటం మొదలు పెట్టిన లోకేష్ నిరుద్యోగులకు ఉద్యోగాల కోసం పట్టిన పట్టు విడవకుండా పోరుబాట కొనసాగిస్తున్నారు. జగన్ సర్కార్ పై ఒత్తిడి పెంచుతున్నారు.

English summary
Nara Lokesh, who was outraged at the attitude of the police in the wake of Chalo Tadepalli, was furious over the arrest of the protesters and their move to police stations. Lokesh fires that Where are the jobs for the unemployed youth in state who claim that the YSR Congress party has given jobs to the politically unemployed? . He also said that the unemployment movement could not be suppressed with detention.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X