వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వాళ్ళు సంపాదిస్తే ఖర్చుచేస్తున్నాం, రాజకీయాల్లోకి రావడం బ్రహ్మిణి ఇష్టం: లోకేష్

By Narsimha
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: రాజకీయాల్లోకి రావాలా, వద్దా అనే విషయాన్ని బ్రహ్మిణి తీసుకొంటారని, ఆ విషయంలో తన బలవంతం ఏమీ ఉండదని ఏపీ రాష్ట్ర ఐటీశాఖ మంత్రి నారాలోకేష్ చెప్పారు.

అమెరికా పర్యటనలో ఉన్న నారాలోకేష్ విదేశీ టిడిపి సభ్యులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు.ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రానికి చెందిన రేఖ అనే మహిళ బ్రహ్మిణి రాజకీయ రంగ ప్రవేశం గురించి లోకే‌ష్‌ను ప్రశ్నించారు. దీంతో లోకేష్ ఈ విషయమై తన సమాధానాన్ని చెప్పారు.

దావోస్ పర్యటనను ముగించుకొని విదేశాల్లోనే లోకేష్ పర్యటిస్తున్నారు. విదేశాల్లోని టిడిపి పార్టీ కమిటీలతో లోకేష్ సమావేశమౌతున్నారు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు రావాలని ఎన్ఆర్‌ఐలను లోకేష్ ఆహ్వనిస్తున్నారు.

రాజకీయాల్లోకి రావాలో వద్దో బ్రహ్మిణి నిర్ణయించుకొంటారు

రాజకీయాల్లోకి రావాలో వద్దో బ్రహ్మిణి నిర్ణయించుకొంటారు

రాజకీయాల్లోకి రావాలో వద్దో బ్రహ్మిణి నిర్ణయించుకొంటారని ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ చెప్పారు. ఆమెకు ఇష్టమైతే నిర్ణయం తీసుకొంటారని చెప్పారు. ఆమె ఏ నిర్ణయం తీసుకొన్నా తాము వ్యతిరేకించబోమని చెప్పారు.

బడ్జెట్ ఎఫెక్ట్: శివసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రేతో బాబు ఫోన్లో చర్చలు, ఏపీలో మారుతున్న రాజకీయాలు బడ్జెట్ ఎఫెక్ట్: శివసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రేతో బాబు ఫోన్లో చర్చలు, ఏపీలో మారుతున్న రాజకీయాలు

బ్రహ్మిణి సంపాదిస్తే ఖర్చు పెడుతున్నాం

బ్రహ్మిణి సంపాదిస్తే ఖర్చు పెడుతున్నాం

మహిళా సాధికారితలో తమ కుటుంబం ముందుందని లోకేష్ చెప్పారు. అమ్మ, బ్రహ్మిణి సంపాదిస్తుంటే ఆ డబ్బులను నేను నాన్న ఖర్చు పెడుతున్నట్టు నారా లోకేష్ చెప్పారు. హెరిటేజ్ సంస్థలో భువనేశ్వరి, బ్రహ్మిణి నడుపుతున్నారు. దీంతోనే లోకేష్ నవ్వుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఎన్టీఆర్‌తోనే ఉంటూ గద్దెదించారు, రాజమండ్రి సీటిస్తానంటే వద్దన్నా:మురళీమోహన్ ఎన్టీఆర్‌తోనే ఉంటూ గద్దెదించారు, రాజమండ్రి సీటిస్తానంటే వద్దన్నా:మురళీమోహన్

నన్ను కూడ రాజకీయాల్లోకి రావాలనే ఎవరూ కోరలేదు

నన్ను కూడ రాజకీయాల్లోకి రావాలనే ఎవరూ కోరలేదు

తాను కూడ రాజకీయాల్లోకి రావాలని ఎవరూ కూడ కోరలేదని నారా లోకేష్ చెప్పారు. అయితే తానే రాజకీయాల్లోకి రావాలని నిర్ణయం తీసుకొన్నట్టుగా నారాలోకేష్ చెప్పారు. హెరిటేజ్ సంస్థలో బాధ్యతలను వదులుకొని లోకేష్ రాజకీయాల్లోకి వచ్చారు. తొలుత పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. తర్వాత లోకేష్ గత ఏడాది ఏప్రిల్ మాసంలో లోకేష్ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

మీ నిర్ణయాన్ని బ్రహ్మిణి చెబుతా

మీ నిర్ణయాన్ని బ్రహ్మిణి చెబుతా

రాజకీయాల్లోకి బ్రహ్మిణి రావాలని తాము కోరుకొంటున్నట్టు ఎన్ఆర్‌ఐ మహిళా రేఖ లోకేష్ దృష్టికి తెచ్చారు. అయితే ఈ విషయాన్ని తాను బ్రహ్మిణి దృష్టికి తీసుకెళ్ళనున్నట్టు ప్రకటించారు.

English summary
AP IT Minister Nara Lokesh interacting with the NRI TDP members in Meet and Greet programme has answered their questions. Nara Lokesh, answering a question about his wife Nara Brahmini's political entry.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X