వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబు ఎఫెన్స్....లోకేష్ సెల్ఫ్ గోల్...టిడిపిలో అగ్రనేతల వ్యాఖ్యలపై మల్లగుల్లాలు

నంది అవార్డుల విమర్శల నేపధ్యంలో వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా టిడిపి నేత లోకేష్ సెల్ఫ్ గోల్ చేసినట్లు రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

|
Google Oneindia TeluguNews

అమరావతి: నంది అవార్డుల విమర్శల నేపధ్యంలో వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా టిడిపి నేత లోకేష్ సెల్ఫ్ గోల్ చేసినట్లు రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. హైదరాబాద్లో ఉంటున్న ఆంధ్రావాళ్లను టార్గెట్ చేసేలా ఉన్న ఈ వ్యాఖ్యలు ఇటు టిడిపి లోను అటు టిటిడిపిలోను తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.ఏపీలో ఓటు హక్కు ఆధార్ కార్డు లేని వారు హైదరాబాద్ లో కూర్చుని విమర్శిస్తున్నారని,అసలు అవార్డులే ఇవ్వని వారి గురించి ఎవరూ మాట్లాడరని,ఏదైనా మీరు తెలంగాణలో మాట్లాడుకోండని లోకేష్ వ్యాఖ్యలు చేశారు.అంతే కాదు హైదరాబాద్‌లో కూర్చుని మాట్లాడే వారు ఎన్ఆర్ఐల తరహాలో నాన్ రెసిడెంట్ ఆంధ్రాస్ (ఎన్ఆర్ఏ) అని వ్యాఖ్యానించారు. ప్రత్యేకించి లోకేష్ చేసిన పదప్రయోగం నాన్ రెసిడెంట్ ఆంధ్రాస్ హైదరాబాద్లో ఉంటున్న తెలుగువారి మనసులని తీవ్రంగా గాయపర్చినట్లు సినీ నటుడు పోసాని ఘాటు ప్రతిస్పందన బట్టి అర్థం అవుతోంది.

బాబు ఎఫెన్స్....లోకేష్ సెల్ఫ్ గోల్...

బాబు ఎఫెన్స్....లోకేష్ సెల్ఫ్ గోల్...

గడచిన కొన్ని రోజులుగా టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ లో చోటు చేసుకుంటున్న పరిణామాలపై చేస్తున్న వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ప్రత్యర్థుల విమర్శలకు ధీటుగా జవాబివ్వాలనే క్రమంలో ఈ ఇద్దరు అగ్ర నేతలు చేస్తున్నవ్యాఖ్యనాలు సమస్యను మరింత జటిలం చేస్తున్నాయి. గతంలో జరిగిన విషయాల పక్కన బెట్టినా తాజాగా ఆంధ్రప్రదేశ్ లో రెండు సంఘటనలు టిడిపి ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లోకి నెట్టాయి. అందులో ఒకటి కృష్ణా నదిలో చోటుచేసుకున్న బోటు ప్రమాదం కాగా మరొకటి నంది అవార్డుల ప్రదానం.అయితే ఈ రెండు ఘటనల్లోను టిడిపి ప్రభుత్వం వ్యవహరించిన తీరు అన్ని వైపుల నుంచి విమర్శల పాలైంది. ఈ ఘటనల పై వచ్చిన విమర్శలను తిప్పి కొట్టేందుకు టిడిపి అధినేత చంద్రబాబు, లోకేష్ చేసిన వ్యాఖ్యలు విమర్శలను సద్దుమణిగేలా చెయ్యకపోగా మరింత ఆజ్యం పోసి సెగ తగిలేలా చేశాయి.

చంద్రబాబు ఏమన్నారు

చంద్రబాబు ఏమన్నారు

కృష్ణానదిలో బోటు ప్రమాదానికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు ఇలా వ్యాఖ్యానించారు...‘ప్రమాద దుర్ఘటనకు మంత్రే బాధ్యత వహించాల్సి ఉంటుంది'..‘గతంలో శాఖాపరమైన వైఫల్యాలకు మంత్రులు వెంటనే రాజీనామాలు చేసేవారు'... అయితే ఇప్పుడు ఈ వ్యాఖ్యలే తీవ్ర కలకలం రేపుతున్నాయి. సహచర మంత్రులు, ఉన్నతాధికారుల సమక్షంలోనే సిఎం తనని టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేయటంతో మంత్రి అఖిలప్రియ ఒక్కసారిగా ఖంగుతిన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ఆ సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేసుంటే ఆగ్రహంతో మాట్లాడి ఉండొచ్చని భావించవచ్చు. కానీ
ప్రమాదం జరిగిన రోజుల వ్యవధి అనంతరం చంద్రబాబు ఈ వ్యఖ్యలు చెయ్యడంతో ఆయన మాటల వెనుక ఏదో అంతరార్ధం ఉందని మంత్రి అఖిల ప్రియతో సహా అందరూ భావించాల్సి పరిస్థితి ఏర్పడింది.

పెద్ద ఎత్తున చర్చ..

పెద్ద ఎత్తున చర్చ..

మరోవైపు చంద్రబాబు వ్యాఖ్యలపై టిడిపిలో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ప్రమాదానికి గురైన బోటు వెనుక ఇద్దరు మంత్రులతో పాటు ఉన్నతాధికారుల హస్తం కూడా ఉన్నట్లు ఆరోపణలు వినబడుతూనే ఉన్నాయి.ఇరిగేషన్ శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు బాధ్యత కూడా ఉందంటూ ఆరోపణలు వినిపిస్తున్నసంగతి అందరికీ తెలిసిందే. అదీ కాక గడచిన మూడు సంవత్సరాలుగా పర్యాటక శాఖను చంద్రబాబే పర్యవేక్షిస్తున్నారు. నదిలో తిరుగుతున్న బోట్లన్నింటికీ లైసెన్సులు ఇచ్చింది చంద్రబాబు హయాంలోనే కావడం గమనించాల్సిన అంశం.
అలాగే, అనుమతి లేని బోట్లు కూడా చాలా కాలంగా తిరుగుతూనేవున్నాయి. వాస్తవంగా నైతికంగా అందుకు బాధ్యత తీసుకోవాల్సింది ముఖ్యమంత్రే . మరి గోదావరి పుష్కరాల సందర్భంగా రాజమండ్రిలో జరిగిన తొక్కిసలాటలో 30 మంది మరణిస్తే ఎవరిపైనా చర్యలు తీసుకోలేదనే విమర్శలు తెరమీదకు వస్తున్నాయి.

బాబు మాటల వెనుక అంతరార్థం ఏమిటి?

బాబు మాటల వెనుక అంతరార్థం ఏమిటి?

తనను డిఫెన్స్ చేసుకునేందుకు, తన అనుంగు మంత్రుల ప్రమేయాన్ని కప్పిపుచ్చుకునేందుకు, ఇంత పెద్ద ప్రమాదం జరిగినప్పడు అందరూ చిన్న స్థాయి వ్యక్తులపైనే చర్యలు తీసుకుంటే ప్రజల్లో అసంతృప్తి తొలగిపోదని భావించి ఎవరో ఒక పెద్ద స్థాయి వ్యక్తిని ప్రమాదానికి బాధ్యులను చేస్తూ చర్య తీసుకోవాలి కాబట్టే మంత్రి అఖిల ప్రియపై చంద్రబాబు వ్యూహాత్మకంగా వ్యాఖ్యలు చేశారని విశ్లేషణలు వెల్లువెత్తున్నాయి. మరోవైపు అసలు అఖిల ప్రియతో పనయిపోయింది కాబట్టి మంత్రి గా ఆమె పనితీరు నిరాశాజనకంగా ఉంది కాబట్టి ఇక ఆమెని వదిలించుకోవాలని సిఎం చంద్రబాబు భావిస్తున్నారని అందులో ఈ ప్రమాదానికి శాఖా మంత్రిగా ఆమెదే భాధ్యత కనుక ఆమెంతట ఆమె పదవి నుంచి తప్పుకునేలా ఆయన ఆ వ్యాఖ్యలు చేసారనేది మరి కొందరి విశ్లేషణ. ఏదేమైనా సిఎం చంద్రబాబు వ్యాఖ్యలు మంత్రి మంత్రి అఖిల ప్రియని దిగ్భ్రాంతికి గురిచేసి ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు.

లోకేష్ వ్యాఖ్యలతో గందరగోళం

లోకేష్ వ్యాఖ్యలతో గందరగోళం

సిఎం వ్యాఖ్యలు చేసిన కొద్ది వ్యవధిలోనే అఖిల ప్రియ అవుట్ అంటూ మీడియాలో వార్తలు రావడంతో మంత్రి లోకేష్ వెంటనే స్పందించి అఖిల ప్రియను తప్పించే ఆలోచన లేదని స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే ఇదే సందర్భంలో లోకేష్ చేసిన వ్యాఖ్యలు పార్టీలో మరింత అయోమయాన్ని కలుగజేశాయి. అయితే సిఎం చంద్రబాబు నేరుగానే మంత్రి అఖిల ప్రియ రాజీనామా గురించి మాట్లాడగా ఆయన తనయుడు లోకేష్ అందుకు విరుద్దంగా మాట్లాడటమే కాకుండా అఖిలప్రియ సమర్థవంతంగా పనిచేస్తున్నారని కితాబు నిచ్చేశారు. అంతేకాదు బెలూన్ ఫెస్టివల్,సోషల్ మీడియా సమ్మిట్ కార్యక్రమాలు బాగా నిర్వహించారని మెచ్చుకున్నారు కూడా. అయితే ఆ రెండు కార్యక్రమాలపై విమర్శలు వచ్చిన సంగతి లోకేష్ కు తెలిసుండకపోవచ్చని అంటున్నారు. అయితే లోకేష్ అంతటితో ఆగకుండా అసలు
మంత్రి వర్గ విస్తరణే లేదని తేల్చేశారు. దీంతో లోకేష్ మాటలపై మళ్లీ విమర్శలు ఊపందుకున్నాయి. అసలు మంత్రి విస్తరణ గురించి ఏ నిర్ణయమైనా తీసుకునే హక్కు ముఖ్యమంత్రికే ఉంటుంది. ఎంత ముఖ్యమంత్రి కుమారుడైతే మాత్రం మంత్రి వర్గ విస్తరణ ఉందో లేదో లోకేష్ ఎలా చెబుతారు? అంటూ విమర్శకులు దండెత్తుతున్నారు. తద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు తన నిర్ణయాలను పాటిస్తారనే సంకేతం లోకేష్ ఇస్తున్నట్లు భావించాలని విమర్శకులు భాష్యం చెబుతున్నారు.

లోకేష్ వ్యాఖ్యలపై దుమారం

లోకేష్ వ్యాఖ్యలపై దుమారం

మరోవైపు నంది అవార్డులపై విమర్శల నేపథ్యంలో మంత్రి లోకేష్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. నంది వివాదంపై లోకేష్ వ్యాఖ్యలు చేయనంతవరకు పరిస్థితి వేరు. లోకేష్ నంది వివాదం నేపధ్యంలో చేసిన వ్యాఖ్యలు సమస్యను సద్దుమణిగేలా చెయ్యకపోగా తీవ్రతను తారాస్థాయికి చేర్చాయి. నంది పురస్కారాల సమయంలో సహజంగా భిన్నాభిప్రాయాలు సహజమేనని చాలామంది భావించారు. కానీ ఇప్పుడైతే పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సినీ పరిశ్రమకు చెందిన వారితో పాటు హైదరాబాద్ లో ఉంటున్నఆంధ్రావాళ్లు కూడా ఈ వివాదం గురించి పట్టించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. అలాంటి అవసరాన్ని స్వయానా లోకేష్‌ కల్పించడం గమనార్హం. అసలు ఈ వ్యాఖ్యలు లోకేష్‌ బాగా ఆలోచించే చేశారా అన్న ఆశ్చర్యం సినీ పరిశ్రమలో వ్యక్తమవుతోంది. సినీ పరిశ్రమని ఉద్దేశించి లోకేష్‌ ఈ వ్యాఖ్యలు చేసినా, ఆ వ్యాఖ్యలు మొత్తంగా హైద్రాబాద్‌లో వుంటోన్న సీమాంధ్రులందరికీ షాక్‌లా తగిలాయి.

అసలు లోకేష్ ఏమన్నారు?

అసలు లోకేష్ ఏమన్నారు?

ఏపీలో ఓటు హక్కు ఆధార్ కార్డు లేని వారు హైదరాబాద్ లో కూర్చుని విమర్శిస్తున్నారని,అసలు అవార్డులే ఇవ్వని వారి గురించి ఎవరూ మాట్లాడరని,ఏదైనా మీరు తెలంగాణలో మాట్లాడుకోండని లోకేష్ వ్యాఖ్యలు చేశారు.అంతే కాదు హైదరాబాద్‌లో కూర్చుని మాట్లాడే వారు ఎన్ఆర్ఐల తరహాలో నాన్ రెసిడెంట్ ఆంధ్రాస్ (ఎన్ఆర్ఏ) అని వ్యాఖ్యానించారు. ప్రత్యేకించి లోకేష్ చేసిన పదప్రయోగం నాన్ రెసిడెంట్ ఆంధ్రాస్ హైదరాబాద్లో ఉంటున్న తెలుగువారి మనసులని తీవ్రంగా గాయపర్చినట్లు సినీ నటుడు పోసాని ఘాటు ప్రతిస్పందన బట్టి అర్థం అవుతోంది. ఇదిలా ఉంటే లోకేష్ వ్యాఖ్య‌లు ఇప్పుడు టిడిపిలోనే కాదు టీటీడీపీలోను పెను దుమారాన్ని రేపుతున్నాయి.. గత జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో తాను తెలంగాణలోనే పుట్టానని లోకేష్ బహిరంగంగా వ్యాఖ్యానించిన విషయం ఇప్పడు తెరమీదకు వస్తోంది. మరి తెలంగాణలో నిన్న మొన్నటి వరకూ ఓటు హక్కు కలిగిన నారా లోకేష్ ఇప్పుడు ఏపీ మంత్రి అయితే హైద‌రాబాద్‌లో ఉన్న‌వాళ్లు కనీసం విమ‌ర్శ‌లు చేయ‌డానికి అర్హులు కారా? త‌ప్పు అనేది ఎక్క‌డున్నా ఎవ‌రైనా ఎత్తి చూపొచ్చు కదా! టిడిపి రెండు రాష్ట్రాల్లో ఉన్నప్పడు సినీ ఇండ‌స్ట్రీ కూడా రెండు రాష్ట్రాల్లో ఉండకూడదా? మరి లోకేష్ మాటలను బట్టి వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ తెలంగాణలో టీడీపీకి ఓట్లు అడగరా ? అసలు విమర్శలు చేయటానికి ఆధార్ కార్డు, ఓటర్ కార్డు ఉండాలన్నఈ లెక్కేంటి? అనే ప్రశ్నల పరంపరకు లోకేష్ తావిచ్చారు. టీడీపీ భవిష్యత్ నేతగా చెబుతున్న లోకేష్ ఏ మాత్రం ఆలోచించకుండా ఇలాంటి వ్యాఖ్యలు చేయటంపై టీడీపీ వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతోంది. ఈ వ్యాఖ్య‌ల‌ను బ‌ట్టి లోకేష్ కు తెలంగాణ‌లో టీడీపీకి ఓట్లు అక్క‌ర్లేదా? అక్క‌డ పార్టీపై ఆశ‌లు వ‌దిలేసుకున్నాడా ? మ‌రి లోకేష్ హైద‌రాబాద్‌లో బిజినెస్‌లు చేసుకుంటూ మరి అక్కడ అక్క‌డ ఇల్లు ఎందుకు క‌ట్టుకున్నాడు? అనే సందేహాల పరంపరను విమర్శకులు లేవనెత్తుతున్నారు. మొత్తం మీద లోకేష్ వాఖ్యలు సెల్ఫ్ గోల్ గా పరిమణించాయని చెప్పక తప్పదు.

English summary
Andhra Pradesh Chief Minister, TDP party President, Nara Chandhrababu Naidu’s son Nara Lokesh Naidu who is an IT Minister reacted to this criticism.but lokesh had scoredthe self-goal on this nandi issue.lokesh said that the critics has neither Voter card nor Aadhar card in AP to criticize regarding Nandi Awards. With these Critics,some medias are increasing their TRP Rates, Lokesh said. Andhra Pradesh Chief Minister, TDP party President, Nara Chandhrababu Naidu’s son Nara Lokesh Naidu who is an IT Minister reacted to this criticism.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X