అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

"రాజన్న రాజ్యంలో రాక్షసపర్వం" ఆడియో విడుదల చేసిన లోకేశ్..! జగన్ పాలనపై తీవ్ర ఆరోపణలు(వీడియో)

|
Google Oneindia TeluguNews

Recommended Video

వైసీపీ నేత ఆడియో విడుదల చేసిన లోకేశ్‌ || Nara Lokesh Released A Audio Regarding YCP Leader

కొద్ది రోజులుగా జ‌గ‌న్ ప్ర‌భుత్వం పైన ట్విట్ట‌ర్ ద్వారా యుద్దం చేస్తున్న టీడీపీ నేత లోకేశ్ తాజాగా మ‌రో ట్వీట్ చేసారు. కొద్ది రోజుల క్రితం ఒక జ‌ర్న‌లిస్టును వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధ‌ర్ రెడ్డి బెదిరిస్తున్న ఆడియోను పోస్ట్ చేసిన లోకేశ్ తాజాగా వైసీపీ నేత టీడీపీ నేత‌ను ఎలా తిడుతున్నారో చూడండి అంటూ ఒక ఆడియోను పోస్ట్ చేసారు. అందులో వారి పేర్లు బ‌య‌ట‌కు రాలేదు. ఆడియోను వింటే వారిద్ద‌రూ గుంటూరు జిల్లాకు చెందిన వారుగా అర్దం అవుతోంది. అదే స‌మ‌యంలో రాజ‌ధాని ప్రాంతం గురించి లోకేశ్ తొలి సారిగా స్పందిస్తూ కీల‌క వ్యాఖ్య‌లు చేసారు.

రాక్ష‌స ప‌ర్వం అంటూ ఆడియో..

రాక్ష‌స ప‌ర్వం అంటూ ఆడియో..

టీడీపీ నేత లోకేశ్ ట్విట్ట‌ర్ లో ఒక ఆడియో పోస్ట్ చేసారు. అందులో ఒక వ్య‌క్తి మ‌రో వ్య‌క్తిని కేసుల గురించి బెదిరిస్తూ.. అస‌భ్య ప‌ద‌జాలంతో దూషిస్తూ..బెదిరిస్తున్న మాట‌లు ఉన్నాయి. ఆడియోలో కానీ..లోకేశ్ చేసిన ట్వీట్‌లో సైతం వారు పేర్లు ఏంటి..ఎక్క‌డ జ‌రిగిన ఘ‌ట‌న అనేదీ ప్ర‌స్తావించ‌లేదు. లోకేశ్ ట్వీట్‌లో పార్టీ మారని టీడీపీ నేతలను వైసీపీ నాయకులు తీవ్రంగా వేధిస్తున్నారనీ, హింసిస్తున్నారని లోకేశ్ పేర్కొన్నారు. ‘సీఎం జగన్ గారూ..! పార్టీ మారను అన్న పాపానికి ఒక టీడీపీ నాయకుడిని ఎలా హింసిస్తున్నారో చూడండి. టీడీపీ నేత భార్యను ప్రస్తావిస్తూ మీ వైసీపీ నేతలు వాడిన భాష ఎంత జుగుప్సాకరంగా ఉందో విని సిగ్గుపడండి. ఇదీ మీ రాజన్న రాజ్యంలో జరుగుతున్న రాక్షస పర్వం' అని ట్వీట్ చేశారు. ఈ సంభాషణను హెడ్ ఫోన్స్ పెట్టుకుని వినాలని లోకేశ్ సూచించారు.

టీడీపీ కార్య‌క‌ర్త‌ల‌నున జ‌గ‌న్ హ‌త్య చేయించారు..

టీడీపీ కార్య‌క‌ర్త‌ల‌నున జ‌గ‌న్ హ‌త్య చేయించారు..

జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఏ కార్య‌క్ర‌మం మీద స్ప‌ష్ట‌త లేద‌ని లోకేశ్ విమర్శించారు. రాజ‌ధానిలో రైతుల‌కు న‌ష్టం క‌లిగేలా ఏ కార్య‌క్ర‌మం ఆపేసినా ప్ర‌జా ఉద్య‌మం చేప‌డ‌తామ‌ని..రైతుల‌కు అండ‌గా నిలుస్తామ‌ని స్ప‌ష్టం చేసారు. ముఖ్యమంత్రి కి అవగాహన లేదు అనే విషయం బయటపడకుండా గత ప్రభుత్వం పై బురద జల్లే కార్యక్రమం పెట్టుకున్నారని ఫైర్ అయ్యారు. వైఎస్ అధికారంలోకి వచ్చిన మొదటి 100 రోజుల్లో 60 కి పైగా కార్యకర్తలను హత్య చేయించారని ఆరోప‌ణ‌లు చేసారు. తన తండ్రి పంథాలో ప్రజలను పక్కన పెట్టి జగన్ గారు టిడిపి కార్యకర్తల పై దాడులు చేయిస్తూ ఆరుగురు టిడిపి కార్యకర్తలను హత్య చేయించారని తీవ్ర ఆరోప‌ణ‌లు చేసారు. తెలుగుదేశం పార్టీ హయాంలో ప్రవేశపెట్టిన ఒక్కో సంక్షేమ కార్యక్రమాన్ని అటక ఎక్కిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఎత్తేసారని..రాజధాని పనులు ఆపేసారని.. కౌలు డబ్బులు వెయ్యడం లేదంటూనే..కరెంట్ కోతలు ప్రారంభం అయ్యా యని.. రైతులకు విత్తనాలు సరఫరా చెయ్యడం లేదంటూ లోకేశ్ విమ‌ర్శ‌లు గుప్పించారు.

మంగ‌ళ‌గిరి నేత‌ల‌తో క‌లిసి వారికి భ‌రోసా..

మంగ‌ళ‌గిరి నేత‌ల‌తో క‌లిసి వారికి భ‌రోసా..

టీడీపీ ఎమ్మెల్సీ లోకేశ్ మంగ‌ళ‌గిరి పార్టీ కార్యాల‌యంలో స్థానిక నేత‌ల‌తో సమావేశ‌మ‌య్యారు. పార్టీ బలోపేతం..స్థానిక సంస్థల ఎన్నికలు తదితర అంశాల పై వారితో చ‌ర్చించారు. కార్యకర్తలకు అండగా ఉంటా అని లోకేశ్ భ‌రోసా ఇచ్చారు . నిత్యం కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తాన‌ని హామీ ఇచ్చారు. రానున్న స్థానిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని పిలుపు నిచ్చారు. త్వ‌రలో మండలాలవారిగా సమావేశా లు నిర్వహిస్తాం అని వెల్ల‌డించారు. కష్ట పడి పని చేసిన కార్యకర్తలు, నాయకులకి సరైన గుర్తింపు ఉంటుంది భ‌రోసా ఇచ్చారు. కొత్త ప్రభుత్వం సంక్షేమ..అభివృద్ధి కార్యక్రమాలు గాలికి వదిలి కక్ష సాధింపు రాజకీయాలకు అధిక ప్రాధా న్యత ఇస్తోందని విమ‌ర్శించారు. ప్రజా వేదిక కూల్చివేత పై ఉన్న శ్రద్ధ రైతులకు విత్తనాలు పంపిణీ విషయంలో పెట్టలేదని లోకేశ్ మండిప‌డ్డారు.

English summary
TDP Leader Lokesh serious allegations ono CM Jagan. Lokesh says Jagan is the reason for TDP workers murder. He released a audio regarding YCP leader threatening TDP leader.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X