వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ పత్రికపై 75 కోట్లకు పరువు నష్టం దావా వేసిన లోకేష్ .. ఎందుకో తెలుసా !!

|
Google Oneindia TeluguNews

ఏపీలో రాజకీయం రసకందాయంలో పడుతుంది. ఏపీ సీఎం వైఎస్ జగన్ పత్రిక సాక్షిపై తెలుగుదేశం పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్ ప‌రువున‌ష్టం దావా వేశారు. విశాఖ‌ప‌ట్నం 12వ అద‌న‌పు జిల్లా జ‌డ్జి కోర్టులో ఆయన రూ.75 కోట్ల‌కు ప‌రువున‌ష్టం దావా వేశారు . ఇష్టారాజ్యంగా రాతలు రాసి తన పరువుకు భంగం కలిగించారని లోకేష్ ఈ దావా దాఖలు చేశారు.

టీడీపీపై వైసీపీ రివర్స్ ఎటాక్ .. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు పిలుపుటీడీపీపై వైసీపీ రివర్స్ ఎటాక్ .. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు పిలుపు

 చిన‌బాబు చిరుతిండి 25 ల‌క్ష‌లండి వార్తపై లోకేష్ పరువు నష్టం దావా

చిన‌బాబు చిరుతిండి 25 ల‌క్ష‌లండి వార్తపై లోకేష్ పరువు నష్టం దావా

ఇక లోకేష్ దావా వేసేంత ఆయన పరువుకు భంగం కలిగించిన కథనం ఏమిటి అంటే సాక్షి దిన‌ప‌త్రిక‌లో 2019 అక్టోబ‌ర్ 22న ``చిన‌బాబు చిరుతిండి 25 ల‌క్ష‌లండి`` శీర్షిక‌తో వేసిన కథనం లోకేష్ ఆగ్రహానికి కారణం అయ్యింది . అయితే ఆ క‌థ‌నంలో పేర్కొన్న అంశాలన్నీ పూర్తిగా అవాస్త‌వాలేన‌ని లోకేష్ చెప్తున్నారు . దురుద్దేశపూర్వకంగా రాసిన త‌ప్పుడు క‌థ‌నం అని ఖండిస్తూ 2019 అక్టోబ‌ర్ 25న సాక్షి సంపాద‌క‌బృందానికి నారా లోకేశ్ త‌ర‌ఫున న్యాయ‌వాదులు లీగల్ రిజిస్ట‌ర్ నోటీసు పంపించారు.

 సాక్షి రాసినవి తప్పుడు కథనాలని పేర్కొన్న లోకేష్

సాక్షి రాసినవి తప్పుడు కథనాలని పేర్కొన్న లోకేష్

దీనికి సంబంధించి 2019 న‌వంబ‌ర్ 10న సాక్షి నుంచి లోకేష్ కు తిరుగుస‌మాధానం ఇచ్చారు . ఇక వారి సమాధానానికి సంతృప్తి చెంద‌ని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్ ప‌రువున‌ష్టం దావా వేశారు. విశాఖ‌ప‌ట్నం ఎయిర్‌పోర్ట్‌లో తాను చిరుతిళ్లు తిన్నాన‌ని సాక్షి రాసిన తేదీల‌లో తాను ఇత‌ర ప్రాంతాల‌లో కావాలని తప్పుడు కథనాలు రాసి తనను ఇబ్బంది పెట్టారని ఆయన పేర్కొన్నారు.

రాజకీయ లబ్ధి కోసమే అని ఆగ్రహం

రాజకీయ లబ్ధి కోసమే అని ఆగ్రహం

త‌న ప‌రువుకు భంగం క‌లిగించేందుకు, రాజకీయంగా ల‌బ్ధి పొందేందుకు అసత్య ప్రచారాలు చేశారని దావాలో పేర్కొన్నారు. ఉన్న‌త విద్యావంతుడిగా, ఒక జాతీయ పార్టీకి ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా, ఎమ్మెల్సీగా, మంత్రిగా ప‌నిచేసిన త‌న ప‌రువు ప్ర‌తిష్ట‌లు నాశనం చేసేందుకు ప్రయత్నం చేశారని పేర్కొన్నారు. త‌నకు సంబంధంలేని అంశాల‌తో ముడిపెట్టి అస‌త్య‌క‌థ‌నం రాసి ప్ర‌చురించిన కార‌ణంగా తీవ్ర‌మ‌నోవేద‌న‌కు గుర‌య్యాన‌ని పేర్కొన్నారు.

రూ.75 కోట్ల‌కు ప‌రువున‌ష్టం దావా

రూ.75 కోట్ల‌కు ప‌రువున‌ష్టం దావా


అందుకు బాధ్యులైన సాక్షి సంస్థ జ‌గ‌తి ప‌బ్లికేష‌న్స్ లిమిటెడ్‌, సాక్షి ప్ర‌చుర‌ణ‌క‌ర్త మ‌రియు సంపాద‌కుడైన వ‌ర్థెల్లి ముర‌ళి, విశాఖ‌ప‌ట్నంకి చెందిన సాక్షి న్యూస్ రిపోర్ట‌ర్లు బి వెంక‌ట‌రెడ్డి, గ‌రిక‌పాటి ఉమాకాంత్‌లపై రూ.75 కోట్ల‌కు ప‌రువున‌ష్టం దావా దాఖ‌లు చేశారు నారా లోకేష్ . విశాఖపట్నం 12వ అదనపు జిల్లా జడ్జి కోర్టులో ఈ ఉదయం ఆయన పిటిషన్ దాఖలు చేశారు.

English summary
TDP MLC and Former Minister Nara Lokesh has filed a defamation case against YS Jagan Mohan Reddy’s Sakshi paper for an intentional bad story demanding Rs 75 Crore as damages. The case has been filed in the court of 12th Additional District Judge of Vishakapatnam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X