అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

లోకేశ్ నిజం ఒప్పేసుకున్నట్లేనా.. బాబు కియో కారు ఆవిష్కరణ ఉత్తిత్తిదే.. నాడు- నేడు..

|
Google Oneindia TeluguNews

టీడీపీ నేత లోకేశ్‌ తన తండ్రి చంద్రబాబు కియో కార్ల పరిశ్రమ రావటానికి చేసిన కృషిని వివరించే తొందరలో అసలు విషయం మరిచిపోయారు. గతంలో తన తండ్రి కియో తొలి కారు ఆవిష్కరణ పేరుతో నల్లటి కవర్‌తో ఉన్న కారును నడిపి..ఆవిష్కరించారు. ఇదే తొలి ఉత్పత్తి అంటూ హంగామా చేసారు. ఇప్పుడు ఈ రోజు కియో సంస్థ ఏపీలో ఉత్పత్తి చేసిన తొలి కారును ఆవిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. దీనికి మద్దతుగా లోకేశ్ సైతం ట్వీట్‌ చేసారు. ఇది ఒక దార్శినికుడి స్వప్నానికి ఫలితం అంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు. కియో సంస్థ నుండి మొట్ట మొదటి మేడ్‌ ఇన్‌ ఆంధ్రా కారు విడుదల అవుతున్నదంటూ అందులో వివరించారు. మరి నాడు ఆవిష్కరించింది ఏంటి.. నేడు ఆవిష్కిస్తున్నది ఏంటి..ఏదీ నిజమైన కియో కారు..

నేడు కియో కారు ఆవిష్కరణ..

నేడు కియో కారు ఆవిష్కరణ..

అనంతపురం జిల్లాలో ఏర్పాటైన ప్రముఖ కార్ల తయారీ సంస్థ కియో తమ తొలి తయారీని విడుదల చేస్తోంది. సంస్థ ప్రతినిధులతో పాటుగా కొరియా ప్రభుత్వం నుండి ఈ కార్యక్రమానికి ప్రతినిధులు హాజరవుతున్నారు. ముఖ్యమంత్రి జగన్‌ హాజరవ్వాల్సి ఉండగా.. ఢిల్లీ పర్యటన లో ఆలస్యం కావటంత..వరదల ప్రభావంతో దెబ్బ తిన్న ప్రాంతాల ఏరియల్ సర్వే కోసం వెళ్లటంతో ఆయన హాజరు కాలేదు. ఆయన స్థానం లో ఆర్దిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్‌ రెడ్డి ముఖ్యమంత్రి సందేశం చదివి వినిపించనున్నారు. అయితే. కియో సంస్థ ఏపికి తీసుకు రావటం పైనా క్రెడిట్‌ ఎవరికి దక్కుతందనే దాని పైన చర్చ సాగింది. ప్రధాని మోదీ సూచనతోనే ఏపీకి కియో వచ్చిందని బీజేపీ నేతలు బెబుతుంటే..తమ అధినేత కృషి వల్లనే సంస్థ ఇక్కడ ఏర్పాటైందని టీడీపీ నేతలు వాదిస్తున్నారు. ఇదే సమయంలో వైయస్‌ కియో సంస్థ ను 2007లోనే పరిశ్రమ ఏర్పాటు గురించి ప్రస్తావించారని..ఇదే విషయాన్ని సంస్థ సీఈవో లేఖ రాసారంటూ వైసీపీ ప్రభుత్వం బయటక పెట్టింది. ఎట్టకేలకు సంస్థ ఉత్పత్తి మార్కెట్‌లోకి వస్తోంది.

లోకేశ్‌ ట్వీట్‌తో కొత్త చర్చ మొదలు..

ఇక, కియో సంస్థ తాము ఏపీలో ఉత్పత్తి చేసిన తొలి కారును మార్కెట్‌లోకి ప్రవేశ పెడుతున్న సమయంలో టీడీపీ నేత లోకేశ్‌ ఒక ట్వీట్‌ చేసారు. అందులో చంద్రబాబు కారణంగానే కియో ఏపికి వచ్చిందంటూ వచ్చిన పేపర్‌ క్లిప్పింగ్‌లను జత చేసారు. ఇది ఒక దార్శనికుడి స్వప్నానికి ఫలితం. కియా మోటార్స్ సంస్థని ఆంధ్రప్రదేశ్ లో నెలకొల్పడానికి @ncbn గారు చేసిన కృషి మాటల్లో చెప్పలేనిది. నేడు కియా సంస్థ నుండి మొట్టమొదటి మేడ్ ఇన్ ఆంధ్రా కారు విడుదల అవుతున్న సందర్భంగా కియా యాజమాన్యానికి, సిబ్బందికి శుభాకాంక్షలు.
అంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు. అయితే, ఇదే సమయంలో వైసీపీ నేతలు కొత్త అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. ఇదే ఏడాది జవనరి 28న ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు కియో సంస్థలో ఉత్పత్తి చేసిన తొలి కారును ఆవిష్కరణం అంటూ ఒక కారును ప్రారంభించారు. దీనికి పెద్ద ఎత్తున ప్రచారం చేసారు. అయితే చంద్రబాబు ఆవిష్కరించిన ఆ కారును మొత్తంగా నల్లటి కవర్‌తో కప్పేసారు. చంద్రబాబు కారును డ్రైవింగ్ చేసి కారును విడుదల చేసారు. కియో సంస్థ ఏపీకి రావటం..కార్లు మార్కెట్‌లోకి విడుదల చేయటం తమ ఘనతగా ప్రచారం చేసుకున్నారు.

ఇప్పుడు లోకేశ్‌ నేడు తొలి కారు అని చెబుతూ..

ఇప్పుడు లోకేశ్‌ నేడు తొలి కారు అని చెబుతూ..

ఈ రోజు కియో సంస్థ తమ తొలి కారును మార్కెట్‌లోకి విడుదల చేయటం పైన అభినందిస్తూ లోకేశ్ ట్వీట్‌ చేసారు. దీని ద్వారా నాడు చంద్రబాబు ఆవిష్కరణ ఉత్తుత్తిదే అని చెప్పకనే చెప్పేసారంటూ వైసీపీ నేతలు కామెంట్ చేస్తున్నారు. అప్పట్లోనే వైసీపీ ఎంపి విజయ సాయి రెడ్డి ఇదే విషయాన్ని ప్రస్తావించారు. కార్ల తయారీ పూర్తి కాకుండానే ఎన్నికల ముందు ప్రజల్లో ఇమేజ్‌ పెంచుకొనేందుకు కియో సంస్థ ద్వారా కార్లు ఉప్పత్తి అయి మార్కెట్‌లోకి వస్తున్నాయనే భ్రమ కల్పించారని ఆరోపించారు. పూర్తి కాని కారును ఆవిష్కరించారంటూ నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు పైన ఫైర్‌ అయ్యారు. ఇక, ఇప్పుడు పరోక్షంగా లోకేశ్ సైతం ఈ రోజు కియో కార్‌ మార్కెట్‌లోకి విడుదల అవుతుందని చెప్పటం ద్వారా..మరి నాటి హంగామా..ఆవిష్కరణ ఏంటనేది టీడీపీ నేతలే సమాధానం చెప్పాలి.

English summary
Lokesh Tweet created policital controversy in AP. Today KIO launching first car which made in Anantapur plant. Lokesh greeted on this occassion. YCP remembering in last January Chandra babu laucnhed first car from KIO.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X