కుప్పం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పిడికిలి బిగించి లోకేష్ తొలి అడుగు - బాలయ్య భారీ ర్యాలీ : సొమ్మసిల్లిన తారకరత్న.!!

కుప్పం నుంచి నారా లోకేష్ యువగళం పాదయాత్ర ప్రారంభమైంది. బాలకృష్ణ , పార్టీ నేతలు భారీ సంఖ్యలో హాజరయ్యారు.

|
Google Oneindia TeluguNews

టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేష్ యువగళం పాదయాత్ర ప్రారంభమైంది. కుప్పంలోని ప్రసన్న వరదరాజుల ఆలయం నుంచి లోకేష్ తొలి అడుగు సరిగ్గా 11.03 గంటలకు ప్రారంభమైంది. నందమూరి బాలకృష్ణ హిందూపురం నుంచి ర్యాలీ తో కుప్పం చేరుకొని లోకేష్ తో కలిసి పూజల్లో పాల్గొన్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుతో సహా పార్టీ నేతలంతా కుప్పం తరలి వచ్చారు. కుప్పంలో పసుపు జెండాలతో పండగు వాతావరణం కనిపిస్తోంది. మధ్నాహ్నం కుప్పంలో భారీ బహిరంగ సభ జరగనుంది. లోకేష్ యువగళం యాత్ర వేళ టీడీపీ అధినేత చంద్రబాబు ట్వీట్ చేసారు. ఆల్ ది బెస్ట్ యువగళం పాదయాత్ర అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు. లోకేష్ యాత్రలో పాల్గొన్న హీరో తారకరత్న సొమ్మసిల్లారు.

నిర్ణయించిన ముహూర్తానికే తొలి అడుగు

నిర్ణయించిన ముహూర్తానికే తొలి అడుగు


ముందుగా నిర్ణయించిన ముహూర్తం మేరకు లోకేష్ కుప్పంలో తొలి అడుగు వేసారు. మొత్తం నాలుగు వందల రోజుల్లో నాలుగు వేల కిలో మీటర్లు లోకేష్ యాత్ర కొనసాగనుంది. కుప్పం నియోజకవర్గంలో మూడు రోజుల పాటు నిర్వహించనున్నారు. లోకేష్ పాదయాత్ర ప్రారంభం వేళ నందమూరి బాలకృష్ణ పాల్గొన్నారు. చంద్రబాబు మినహా పార్టీ నేతలంతా కుప్పంకు చేరుకున్నారు. పెద్ద సంఖ్యలో కార్యకర్తలు లోకేష్ కు మద్దతుగా తరలి వచ్చారు. యాత్రకు అనుకూలంగా నినాదాలు చేసారు. పెద్ద సంఖ్యలో వచ్చిన పార్టీ శ్రేణులతో కుప్పంలో టీడీపీ పండుగ కనిపిస్తోంది. పాదయాత్రలో తొలి రోజు 8.5 కిలో మీటర్ల మేర లోకేష్ నడవనున్నారు. మధ్నాహ్నం బహిరంగ సభ తరువాత యాత్ర కొనసాగనుంది.

పిడికిలి బిగించి లోకేష్ ముందడుగు

పిడికిలి బిగించి లోకేష్ ముందడుగు


తొలి రోజు యాత్రలో భాగంగా హెబ్రాన్ హౌస్ ఆఫ్ వర్షిప్ చర్చిలో ప్రార్థనలు చేస్తారు. ఆ తరువాత అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించనున్నారు. కుప్పం బస్టాండ్ దగ్గర ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పిస్తారు., త్త బస్టాండ్ దగ్గర పొట్టి శ్రీరాములు, గాంధీ విగ్రహాలకు నివాళులు ఆర్పించనున్నారు. సాయంత్రం యువగళం సభకు హాజరుకానున్నారు. ఈ సభ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసారు. లోకేష్ తన యాత్ర ప్రారంభ సమయంలో ప్రభుత్వంపైన తన పోరాటం ప్రారంభమైందంటూ పిడికిలి బిగించి కార్యకర్తలకు తన లక్ష్యాన్ని చాటారు. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో వచ్చిన కార్యకర్తలు లోకేష్ తో కలిసి తొలి రోజు యాత్రలో పొల్గొంటున్నారు. అందరికీ అభివాదం చేసుకుంటూ లోకేష్ ముందుకు సాగుతున్నారు.

చంద్రబాబు ట్వీట్ - బాలయ్య ర్యాలీ

లోకేష్ యాత్రను టీడీపీ అధినేత చంద్రబాబు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. పార్టీ నేతలకు మార్గనిర్దేశం చేస్తున్నారు. ఇదే సమయంలో ట్వీట్ చేసారు. అందులో ఎక్కడా లోకేష్ పేరెత్తకుండా యువగళం కు ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఆ ట్వీట్ లో.. యువత భవిత కోసం...ప్రజల బతుకు కోసం...రాష్ట్ర భవిష్యత్ కోసం...అని పేర్కొన్నారు. లోకేష్ యాత్ర వేళ నందమూరి ప్రత్యేకార్షణగా నిలిచారు. ఆయన భారీ ర్యాలీతో కుప్పం చేరుకున్నారు. లోకేష్ తో కలిసి పూజల్లో పాల్గొన్నారు. తొలి అడుగు వేసే సమయంలోనూ మద్దతుగా నిలిచారు. పాదయాత్రలో పాల్గొన్నారు. లోకేష్ కు మద్దతుగా పాదయాత్రలో పాల్గొన్న నందమూరి తారకరత్న సొమ్మసిల్లారు. మధ్నాహ్నం బహిరంగ సభలో బాలయ్య ప్రసంగించనున్నారు. పార్టీ నేతలంతా హాజరయ్యే ఈ సభలో లోకేష్.. బాలయ్య మాత్రమే ప్రసంగాలు చేయనున్నారు.

English summary
Nara Lokesh Yuvagalam Padayatra starts from Kuppam at decided Muhurtam Balakrishna and TDP leaders participated in the first Day padayatra.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X