విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

''అక్రమంగా ఆస్తులున్నాయనే శశికళ వైపుకు ఎంఏల్ఏలు''

అన్నాడిఎంకె ప్రధాన కార్యదర్శి శశికళ వద్ద పెద్ద ఎత్తున డబ్బులున్నందున ఎంఏల్ఏలు ఆమె వైపుకు మొగ్గుచూపుతున్నారని ఆయన ఆరోపించారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

విజయవాడ:అన్నాడిఎంకె ప్రధాన కార్యదర్శి శశికళ అక్రమంగా వేల ఆస్తులు కూడబెట్టారని , అందుకే ఎంఏల్ఏలు ఆమె వైపుకు మొగ్గుచూపుతున్నారని లోక్ సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ ఆరోపించారు.

తమిళనాడు ముఖ్యమంత్రిగా పన్నీర్ సెల్వం కావాలని ప్రజలు కోరుకొంటున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. బుదవారం నాడు ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడారు.

ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహిస్తేనే డబ్బు రాజకీయాలకు తెరపడే అవకాశం ఉందన్నారు జయ ప్రకాష్ నారాయణ.ఎన్నికల సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని జయప్రకాష్ నారాయణ అభిప్రాయపడ్డారు.

loksatta president Jayaprakash Narayana allegations on AIADMK general secretary sasikala.

ఎంఏల్ఏల ద్వారా కాకుండా ప్రజలే నేరుగా సిఎంను ఎన్నుకొనే పద్దతి రావాల్సిన అవసరం ఉందన్నారు జయ ప్రకాష్ నారాయణ.సమాజంలో నిజాతీయి పరులను మంత్రులుగా చేయాలని ఆయన కోరారు. ఎంఏల్ఏలతో పాటు నిజాయితీ పరులను కూడ మంత్రులుగా చేయాలని ఆయన సూచించారు.

ఆంద్రప్రదేశ్ లో ప్రతి అంశాన్ని మేనేజ్ చేస్తున్నారని ఆయన విమర్శించారు. దీర్ఘకాలిక ప్రయోజనాలపై ప్రభుత్వం దృష్టి సారించడం లేదని ఆయన ఆరోపించారు. చివరకు ప్రగల్భాలు, ఆర్భాటాల రాష్ట్రంగా ఆంద్రప్రదేశ్ మిగిలిపోయే ప్రమాదం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

English summary
loksatta president Jayaprakash Narayana allegations on AIADMK general secretary sasikala.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X