అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అమరావతి తాత్కాలిక సచివాలయంలో మళ్లీ కూల్చివేతలు

|
Google Oneindia TeluguNews

అమరావతి : వచ్చే డిసెంబర్ నాటికి తాత్కాలిక సచివాలయ నిర్మాణాలు పూర్తి చేసి రాబోయే అసెంబ్లీ శీతాకాల సమావేశాలను అక్కడే నిర్వహించబోతున్నట్టు ఏపీ సర్కార్ చెబుతోన్న సంగతి తెలిసిందే. అయితే సచివాలయ నిర్మాణంలో మళ్లీ కూల్చివేతల పర్వం మొదలవడం పలు ఆరోపణలకు తావిస్తోంది.

స్పష్టమైన కారణాలేవి తెలియరానప్పటికీ.. సీఎం చంద్రబాబుకు నచ్చకపోవడమో, వాస్తు సరిగా లేకపోవడమో ఈ తాజా కూల్చివేతలకు కారణమనే వాదనలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం సచివాలయంలోని ఒకటో బ్లాక్ లో నిర్మిస్తోన్న సీఎం కార్యాలయం, అడ్మినిస్ట్రేషన్ విభాగంలోని పలు గోడలు కూల్చివేసి కాంట్రాక్టులు మళ్లీ కొత్తగా నిర్మాణాలు చేపడుతున్నారు.

Loopholes in velagapudi temporary secretariat construction

గతంలో సచివాలయంలోని 4,5 బ్లాకుల్లోను ఇలాగే కొన్ని నిర్మాణాలు కూల్చి మళ్లీ కొత్తగా నిర్మించారు. ఇదిలా ఉంటే ఇలా కూల్చివేస్తూ మళ్లీ నిర్మాణాలు చేపడుతూ పోతుంటే నిర్మాణ వ్యయం కూడా భారీగానే పెరిగే అవకాశముంది. ఇప్పటికే సచివాలయ నిర్మాణం కోసం రూ.750 కోట్లు చెల్లించింది రాష్ట్ర ప్రభుత్వం.
దేశంలో మరెక్కడా లేనివిధంగా ఏపీ సర్కార్ కాంట్రాక్టర్లకు చెల్లింపులు జరుపుతోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతీసారి కూల్చివేతలు చేపడుతూ నిర్మాణాలు చేపట్టడమేంటని విపక్షాలు కూడా నిలదీస్తున్నాయి. మరోసారి ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.

English summary
There was allegations on temparory secratariat of ap capital. In recent few of the constructions was demolished and re-constructing, due to this project expenditure will become huge
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X