వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనాకు రాముడే విరుగుడన్న వైవీ సుబ్బారెడ్డి.. అఖండదీపంపై దుష్ప్రచారం తగదని హితవు

|
Google Oneindia TeluguNews

టీటీడీపై తాజాగా సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న దుష్ప్రచారంపై టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. అఖండదీపం కొండెక్కినట్లు సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు. రేపటి నుంచి జరిగే తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు, శ్రీరామనవమితో పాటు పలు విషయాలపై ఆయన ప్రకటన విడుదల చేశారు. ప్రపంచాన్ని విలవిల్లాడిస్తున్న కరోనా వైరస్ కు విరుగుడుగా రాములోరొస్తున్నారని వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు.

కరోనాకు విరుగుడు రాముడే..

కరోనాకు విరుగుడు రాముడే..


ప్రపంచమంతా కరోనాతో విలవిల్లాడుతుండగా, రక్షించడానికి శ్రీ రామచంద్రుడు వస్తున్నట్లుందని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. తెలుగు ప్రజలకు శ్రీ రామ నవమి సందర్బంగా ఆయన శుభాకాంక్షలు తెలిపారు. సహస్ర నామాలు పలక లేని వాళ్లు శ్రీరామ అని మూడు సార్లు ఉచ్చరిస్తే అంతా మంచి జరుగుతుందని పరమేశ్వరుడు చెప్పినమాటను వైవీ గుర్తుచేశారు. తిరుమల శ్రీవారి గర్భాలయంలో సీతారామలక్ష్మణ విగ్రహాలున్నాయి.. ఈ ఏడాది ఆ విగ్రహాలకు అభిషేకం జరిపి ఆస్థానం నిర్వహించనున్నట్లు సుబ్బారెడ్డి వెల్లడించారు.
ఒంటిమిట్టలో ఈ నెల 7న సీతారాముల కల్యాణం
జరుగుతుందని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.

 రేపటి నుంచి తిరుమల బ్రహోత్సవాలు..

రేపటి నుంచి తిరుమల బ్రహోత్సవాలు..

ఈ నెల 2 నుంచి 11 వరకు తిరుమల శ్రీవారి ఏకాంత బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా ఎలాంటి లోపాల్లేకుండా నిర్వహిస్తామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. భక్తులు తమ ఇంటి నుంచే రాములవారి కల్యాణాన్ని వీక్షించేందుకు ఎస్వీబీసీ ఛానల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేస్తామని తెలిపారు. తద్వారా భక్తులు స్వామి వారి అనుగ్రహాన్ని పొందాలని ఆయన ఆకాంక్షించారు. ఇందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు వైవీ వెల్లడించారు.

వదంతులపై కఠిన చర్యలు..

వదంతులపై కఠిన చర్యలు..

తిరుమల శ్రీవారి ఆలయానికి సంబంధించి వదంతులు సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని వైవీ సుబ్బారెడ్డి హెచ్చరించారు. .

తిరుమలలో శ్రీవారి గర్భగుడి లోకి వెళ్లి వీడియో తీశారంటూ సోషల్ మీడియాలో వదంతులు వ్యాప్తి చేస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వైవీ హెచ్చరించారు. వైరల్ అయిన వీడియో గర్భగుడిలో తీసింది కాదని, అలిపిరి గేటు వద్ద మూల విరాట్ నమూనా ఆలయంలో తీసిందని వివరించారు. అఖండ దీపాన్ని కొండెక్కించినట్లు, స్వామి వారికి కైంకర్యాలు, సేవలు చేయడం లేదంటూ ఇంకా కొందరు పనిగట్టుకొని దుష్ప్రచారం చేయడం తగదని హితవు పలికారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని సన్నిధిలో అఖండ దీపం ఎప్పుడూ వెలుగుతూనే ఉంటుందని చెప్పారు. స్వామి వారికి నిత్య కైంకర్యాలు యధావిధిగా కొనసాగుతున్నట్లు తెలియజేశారు. ఈ వదంతులన్నింటిపై విచారించి తగు చర్యలు తీసుకుంటామని సుబ్బారెడ్డి వివరించారు.

English summary
ttd chairman yv subbareddy fired on social media posts over tirumalal's akhanda deepam and various sensitive issues. he warned to take stringent action on violators. ttd chairman said that lord sri rama is the medicine for deadly coronavirus. ttd will host tirumala brahmotsavam from 2nd april and hold sri rama navami on 7th april.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X