తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఘనంగా శ్రీవారి బ్రహ్మోత్సవాల అంకురార్పణ

|
Google Oneindia TeluguNews

తిరుపతి: కలియుగ ప్రత్యక్ష దైవం, అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు తిరుమల తిరుపతి శ్రీవేంకటేశ్వరస్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు ఆదివారం రాత్రి అంకురార్పణ ఘనంగా జరిగింది. స్వామివారి సేనాధిపతి విశ్వక్సేనుడు బ్రహ్మోత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు తిరుమాడ వీధులను పరిశీలించారు.

ఆలయ నైరుతి మూలలో అర్చకులు భూమి పూజ నిర్వహించారు. ఈ అంకురార్పణ క్రతువుతో ఈ మహావేడుక ప్రారంభమైంది. భూమి పూజతో మట్టిని సేకరించి, యాగశాలను మట్టితో నింపి.. తొమ్మిది పాలికల్లో శాలి, వ్రహి, యవ, మద్గ, మాష, ప్రియంగు వంటి నవ ధాన్యాలతో అంకురార్పణ చేశారు.

బ్రహ్మాండనాయకుని బ్రహ్మోత్సవాలతో తిరుమల గిరులు పండగ శోభను సంతరించుకున్నాయి. గోవింద నామస్మరణతో తిరుమల మారుమోగుతోంది.
ఛత్ర, చామర మంగళవాయిద్యాలతో మాడవీధుల్లో ఊరేగుతూ ఆలయానికి చేరుకున్నారు.

కాగా, సోమవారం బ్రహ్మోత్సవాలకు ధ్వజారోహన నిర్వహించనున్నారు. సాయంత్రం 5.30 నుంచి 7గంటల లోపు మీన లగ్నంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. రాత్రి 8గంటలకు పెదశేషవాహనంపై శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి దర్శనమివ్వనున్నారు.

కాగా, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. ఇది ఇలావుండగా, బ్రహ్మోత్సవాల సమయంలో ప్రోటోకాల్ ప్రముఖులకే బ్రేక్ దర్శనం పరిమితమని ఈవో అనీల్ కుమార్ సింఘాల్ తెలిపారు. 9 రోజులపాటు ప్రత్యేక దర్శనాలు రద్దు చేస్తున్నట్లు చెప్పారు.

 Lord Venkateswara Brahmotsavams grand festival started in Tirumala

బెజవాడ ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు

ఇంద్రకీలాద్రిపై దుర్గామల్లేశ్వరస్వామి వార్ల శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. తొలిరోజైన ఆదివారంనాడు అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. రాత్రి దుర్గామల్లేశ్వరస్వామి ఉత్సవ మూర్తుల ఊరేగింపు వైభవంగా జరిగింది.

కొండ కింది నుంచి వినాయక దేవాలయం మీదుగా ఇంద్రకీలాద్రి కొండపైకి స్వామి, అమ్మవార్లను ఊరేగింపుగా మేళతాళాలతో తీసుకెళ్లారు. కొండ దిగువన ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో చిన్నారుల చేసిన శాస్త్రీయ నృత్యం భక్తులను ఆకట్టుకుంది. డప్పులు, కోలాటాలు, వేషధారాణాలతో కళాకారులు చేసిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.

English summary
Lord Venkateswara Brahmotsavams grand festival started in Tirumala on Sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X