వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బస్సులుగా లారీలు, నో ఇన్సూరెన్స్, జేసీ ఉమారెడ్డి, గోపాల్ రెడ్డి పేరుతో వాహనాల రిజిస్ట్రేషన్..

|
Google Oneindia TeluguNews

జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డి అరెస్ట్‌తో దివాకర్ ట్రావెల్స్‌లో జరుగుతోన్న లోపాలకు సంబంధించి మరోసారి చర్చకు దారితీసింది. దివాకర్ ట్రావెల్స్ నిబంధనలను తుంగలో తొక్కారని ఆర్టీఏ అధికారులు గుర్తించారు. ఇతర రాష్ట్రాల్లో అక్రమంగా రిజిష్ట్రేషన్ చేసుకొని ఏపీలో తిరుగుతున్నారని.. లారీలను కూడా బస్సులుగా మార్చారనే సంచలన విషయాలు వెలుగులోకి చూశాయి. ఇంతకీ జేసీ ట్రావెల్స్‌ ఏం చేశాయి. నిబంధనలను ఎలా తుంగలో తొక్కాయి.

జగన్‌కు ఏసుప్రభువు లేడు వెంకన్న లేడు..ఆయన్ను నియంత్రించే వ్యక్తి ఒక్కరే : జేసీ హాట్ కామెంట్స్జగన్‌కు ఏసుప్రభువు లేడు వెంకన్న లేడు..ఆయన్ను నియంత్రించే వ్యక్తి ఒక్కరే : జేసీ హాట్ కామెంట్స్

160 వాహనాల కొనుగోలు..

160 వాహనాల కొనుగోలు..

దేశంలో బీఎస్-3 వాహనాలకు అనుమతి లేదు. కాలుష్య నియంత్రణ చర్యల్లో భాగంగా బీఎస్-4 వాహనాలనే అనుమతిస్తున్నారు. కానీ అప్పటికే జేసీ వద్ద ఉన్న బీఎస్-3 వాహనాలను 4గా మార్చివేశారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల కన్నా ముందు 160 వాహనాలను జేసీ ట్రావెల్స్ కొనుగోలు చేసింది. నాగాలాండ్‌లో అశోక్ లేలాండ్ కంపెనీ నుంచి కొనుగోలు చేసి.. బీఎస్-4గా రిజిష్ట్రేషన్ చేశారు. ఆ వాహనాలు తిరగడంతో అధికారులు ఆడపా దడపా పట్టుకుంటున్నారు. ఇప్పటివరకు 60 వాహనాలను సీజ్ చేశారు. మిగిలిన 94 వాహనాలను గుర్తించాల్సి ఉంది.

Recommended Video

APSRTC In Tough Situation,Neighbour States Not Intrested To Allow AP Buses
జేసీ ఉమారెడ్డి పేరుతో..

జేసీ ఉమారెడ్డి పేరుతో..

నాగాలాండ్‌లో కొనుగోలు చేసిన వాహనాలను జేసీ ఉమారెడ్డి పేరుతో కొన్ని ఉండగా.. మరికొన్ని జఠాధర కంపెనీకి చెందిన సీ గోపాల్ రెడ్డి పేరుతో రిజిస్ట్రేషన్ చేశారు. అయితే ఆర్టీఏ అధికారులు వాహనాలను పట్టుకోవడంతో.. జేసీ అండ్ టీం అప్రమత్తమైందని.. కొందరి వ్యక్తులకు వాహనాలను అప్పగించారని తెలిసింది. మరికొన్ని వాహనాల విడి భాగాలు తొలగించి విక్రయించారని తెలిసింది. మరికొన్నింటినీ బస్సులుగా మార్చారనే సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. మరికొన్ని వాహనాలకు సంబంధించి టైర్ల నుంచి బ్యాటరీ, ఇంజినీ, బాడీ తొలగించారని తెలుస్తోంది.

బస్సులుగా లారీలు

బస్సులుగా లారీలు

మొత్తం వాహనాలు 154 నుంచి 160 వరకు ఉన్నాయి. ఇందులో ఆర్టీఏ అధికారులు 60 వాహనాల వరకు సీజ్ చేశారు. మరో 94 వాహనాలను మాత్రం ఎక్కడున్నాయో తెలియరాలేదు. కానీ నాలుగు లారీలను బస్సులుగా మార్చి తిప్పుతున్నారని వెలుగుచూసింది. జేసీ ట్రావెల్స్ వాహనాల్లో ప్రయాణించేవారికి ఇన్సూరెన్స్ వర్తించదని ఇప్పటికే తెలిపామని అధికారులు చెబుతున్నారు. కానీ ట్రావెల్స్ తిప్పుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని తెలిపారు.

English summary
lorries are modified to buses by jc travels rta officials said in statement.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X