వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రేపటి నుంచే లారీల బంద్‌:సరకు రవాణాపై ప్రభావం

By Suvarnaraju
|
Google Oneindia TeluguNews

విశాఖపట్టణం:రవాణా వ్యవస్థలో అత్యంత కీలకపాత్ర పోషించే లారీలు శుక్రవారం నుంచి నిరవధికంగా నిలిచిపోనున్నాయి. సమస్యల పరిష్కారం కోరుతూ లారీ వర్కర్ల అసోసియేషన్లు లారీల బంద్ కు పిలుపునిచ్చాయి.

అఖిల భారత మోటారు వర్కర్ల సంఘం జాతీయ సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంలో జిల్లాలోని సంయుక్త కార్యాచరణ సమితి పిలుపు మేరకు రవాణా వాహనాల యజమానులు ఈ నిర్ణయం తీసుకున్నారు. అత్యవసరం మినహా మిగిలిన అన్ని సరకు రవాణా వాహనాలను నిలిపేస్తామని వివిధ సంఘాల నాయకులు స్పష్టం చేశారు.

20 నుంచి బంద్...విరమణ లేదని హెచ్చరిక

20 నుంచి బంద్...విరమణ లేదని హెచ్చరిక

జిల్లాల వ్యాప్తంగా దాదాపు లక్షలాది లారీలు, మినీవ్యాన్లు, టిప్పర్లను ఎక్కడికక్కడే నిలిపేస్తామని ప్రకటించారు. ఈమేరకు యూనియన్ల నేతలు ఇంధన రవాణా ట్యాంకర్ల యజమానులతో కూడా చర్చలు జరిపారు. ప్రభుత్వంతో జరుగుతున్న చర్చలు కొలిక్కి తప్ప సమ్మెను విరమించేది లేదని జేఏసీ నేతలు స్పష్టం చేశారు. పాలు, నీరు, ఔషధాల రవాణాకు మినహాయింపు ఇచ్చామన్నారు. నిత్యావసరాలు, కూరగాయలు, రోజువారీ సరకుల రవాణా ఆగిపోతుందని చెప్పారు. మరోవైపు లారీ బంద్ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు.అత్యవసర సేవలకు ఎలాంటి ఆటంకం లేకుండా చూడాలని సిబ్బందిని ఆదేశించారు.

లారీ ల బంద్...ఇవీ డిమాండ్లు...

లారీ ల బంద్...ఇవీ డిమాండ్లు...

డీజిల్‌ ధరలను జీఎస్టీ పరిధిలోకి తేవాలి...దేశవ్యాప్తంగా ఒకే ధర నిర్ణయించాలి...మూడు నెలలకోసారి సవరించాలి...దేశవ్యాప్తంగా గడువు ముగిసిన టోల్‌గేట్లను శాశ్వతంగా తొలగించాలి...పెంచిన థర్డ్‌ పార్టీ ఇన్స్యూరెన్స్‌ ప్రీమియం తగ్గించాలి...లారీ యజమానుల నుంచి టీడీఎస్‌ వసూలు చేయరాదు...రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సింగిల్‌ పర్మిట్‌ విధానం అమలు చేయాలి...2015లో లారీల సమ్మె సమయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలి...ప్రమాదాలు, ఓవర్‌లోడు కేసుల్లో డ్రైవర్ల లైసెన్స్‌ రద్దు విధానాన్ని విరమించుకోవాలి.

 మరి కొన్ని...డిమాండ్లు

మరి కొన్ని...డిమాండ్లు

లారీలపై ఓవర్‌ లోడు నిషేధించాలి...జీఎస్టీ, ఇ-వేబిల్లు సమస్యలు పరిష్కరించాలి...పెండింగ్‌లో ఉన్న పర్యాటక వాహనాలకు జాతీయ అనుమతులు జారీ చేయాలి.
ఆర్టీవో, పోలీసు, వాణిజ్య పన్నుల శాఖ అధికారుల వేధింపుల నుంచి రక్షణ కల్పించాలి...జాతీయ పర్మిట్లు ఉన్న సరుకు రవాణా వాహనాలకు ఇద్దరు డ్రైవర్ల నిబంధన రద్దు చేయాలి. విశాఖ జిల్లా లారీల సంఘ గౌరవ అధ్యక్షుడు కె.వి.ఎస్‌.మూర్తి మాట్లాడుతూ "విశాఖ జిల్లావ్యాప్తంగా ఈ నెల 20 నుంచి లారీలను నిలిపేస్తున్నాం... కలెక్టరు పిలుపు మేరకు ఆయనతో సమావేశమయ్యాం...అత్యవసరాలకు ఆటంకం కలిగించొద్దని ఆయన కోరారు...దీనికి మేం పూర్తిగా సహకరిస్తామని చెప్పాం...అయితే సమస్యలు పరిష్కారమయ్యే వరకు వాహనాలను నిలిపేస్తాం"...అని చెప్పారు.

 సమ్మెలో...పాల్గొన బోము

సమ్మెలో...పాల్గొన బోము

అయితే లారీల సమ్మెలో తాము పాల్గొనడం లేదని విశాఖ ఆయిల్‌ ట్యాంకర్ల సంఘ అధ్యక్షుడు జి.రఘురామరాజు చెప్పారు. "కారణం బంద్ హెచ్చరికల సందర్భంగా లారీల అసోసియేషన్లు ప్రభుత్వం ముందుంచిన డిమాండ్లలో కేవలం ఇ-వేబిల్లు సమస్య ఒక్కటే చమురు రవాణా యజమానులకు సంబంధించినది. కలెక్టర్‌తో సమావేశంలో కూడా ఇదే చెప్పాం. లారీల సమ్మెకు ఒకరోజైనా సంఘీభావం తెలపాలనుకున్నాం. అయితే తాజాగా మా సంఘ సభ్యులతో నిర్వహించిన సమావేశంలో ఆ ప్రతిపాదనను కూడా విరమించుకున్నాం. కాబట్టి మేము సమ్మెలో పాల్గొనడం లేదు"...అని చెప్పేశారు.

English summary
Visakhapatnam: The lorries, which play the key role in the transport system, will remain Idle from Friday. Lorry Workers' Associations have called for a lorries bandh seeking solutions to their problem.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X