ప్రేమజంట ఆత్మహత్య: పిల్లలతో సహా తల్లీ...

విజయవాడ: గుంటూరు జిల్లాలోని నర్సరావుపేట మండలం పాలపాడు రోడ్డులో ఓ ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. ఈ ప్రేమ జంట మృతిపై పలు రకాల అనుమానాలు తలెత్తుతున్నాయి.

ఈ నేపథ్యంలో పోలీసులు వచ్చి మృతదేహాలను స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం కోసం తరలించారు. ప్రేమజంట మృతిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

చిత్తూరు జిల్లాలోని ఎస్‌పురం మండలం వడ్డికండ్రిగ గ్రామంలో విషాద సంఘటన చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో ఓ తల్లి తన ఇద్దరు పిల్లలతో కలిసి బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది.

Lovers commit suicide in Guntur district

ఆత్మహత్య చేసుకున్న వారిలో కిష్టమ్మ (25), ధరణి (5), సురేష్‌ (2)లున్నారు. కుటుంబ కలహాలే తమవారిని బలిగొన్నాయని మృతురాలి బంధువులు చెప్పారు. బావిలోనుంచి మృతదేహాలను వెలికితీసి, పోస్టుమార్టం కోసం పంపించారు. పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.

వడదెబ్బకు నలుగురు మృతి

ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాల్లో శుక్రవారం వడదెబ్బకు నలుగురు వృద్ధులు మృతి చెందారు. ప్రకా శం జిల్లా బల్లికురవ మండలంలోని జమ్మలమడక ఎస్సీ కాలనీకి చెందిన దేవయ్య(85), పేరమ్మ(55), లేయమ్మ (80), శ్రీకాకుళంజిల్లా పాలకొండ మండలం లుం గూరుకుచెందిన అమ్మన్నమ్మ(66)మృతి చెందారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+