నెల్లూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దారుణం: వాళ్లు పారిపోయి పెళ్లిచేసుకుంటే.. పోలీసులు వీళ్లని పట్టుకొచ్చి చితక్కొట్టారు!

ప్రేమికుల వ్యవహారంలో ఓ పోలీసు అధికారి మితిమీరి ప్రవర్తించాడు. మేజర్‌లైన ప్రేమికుల విషయంలో అబ్బాయి కుటుంబ సభ్యులను అక్రమంగా నిర్బంధించాడు. వారిని చిత్రహింసలకు గురిచేశాడు.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

నెల్లూరు: ప్రేమికుల వ్యవహారంలో ఓ పోలీసు అధికారి మితిమీరి ప్రవర్తించాడు. మేజర్‌లైన ప్రేమికుల విషయంలో అబ్బాయి కుటుంబ సభ్యులను అక్రమంగా నిర్బంధించాడు. వారిని చిత్రహింసలకు గురిచేశాడు.

తనకు అనారోగ్యంగా ఉందని, తనను కొట్టొద్దంటూ ప్రేమికుడి తమ్ముడు సదరు అధికారి కాళ్లు పట్టుకుని బతిమాలినా వినిపించుకోలేదు. తీవ్రంగా కొట్టడంతో ఆ యువకుడు అపస్మారక స్ధితిలోకి వెళ్లాడు.

దీంతో పోలీసులు కంగుతిని, ఈ విషయం బయటకు పొక్కుతుందన్న భయంతో అతడ్ని చికిత్స నిమిత్తం ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ప్రాణాపాయ స్ధితిలో బాధితుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

 అసలేం జరిగిందంటే..

అసలేం జరిగిందంటే..

నెల్లూరు జాకీర్‌హుస్సేన్‌ నగర్‌కు చెందిన రేష్మా, కిసాన్‌ నగర్‌కు చెందిన మునీర్‌బాషాలు ఎనిమిది నెలలుగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమ రేష్మా కుటుంబ సభ్యులకు ఇష్టం లేదు. దీంతో వారిద్దరూ మూడ్రోజుల క్రితం ఇంటి నుంచి పారి పోయారు.

 పోలీసు అధికారి అత్యుత్సాహం...

పోలీసు అధికారి అత్యుత్సాహం...

దీంతో రేష్మీ కుటుంబ సభ్యులు వెంటనే రెండో పట్టణ పోలీసులను ఆశ్రయించి, మునీర్‌బాషానే రేష్మాని కిడ్నాప్‌ చేశాడని ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన స్టేషన్‌లోని ఓ అధికారి అత్యుత్సాహం ప్రదర్శించాడు.

 అనారోగ్యంగా ఉందని బతిమాలినా...

అనారోగ్యంగా ఉందని బతిమాలినా...

మునీర్‌బాషా ఇద్దరు సోదరులను, అతడి తండ్రిని పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చి నిర్బంధించి బాషా ఆచూకీ చెప్పాలంటూ వేధించాడు. ముగ్గురిపై లాఠీచార్జి చేశాడు. వీరిలో మునీర్‌బాషా సోదరుడైన గౌస్‌బాషా తనకు ఆరోగ్యం సరిగా లేదని, తనను కొట్టవద్దని ఆ అధికారి కాళ్లుపట్టుకుని బతిమాలాడు.

 కంగారుగా ఆసుపత్రికి తరలింపు...

కంగారుగా ఆసుపత్రికి తరలింపు...

ఆరోగ్యం బాగోలేదని చెప్పినా కరుడుకట్టిన ఆ ఖాకీ హృదయం కరగలేదు. రెచ్చిపోయి మరింత తీవ్రంగా కొట్టడంతో గౌస్ బాషా అపస్మారక స్ధితిలోకి వెళ్లిపోయాడు. దీంతో ఆ పోలీసు అధికారికి కంగారు పట్టుకుంది. వెంటనే అతడ్ని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించాడు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.

 మేం మేజర్లం.. పెళ్లి చేసుకున్నాం..

మేం మేజర్లం.. పెళ్లి చేసుకున్నాం..

ఇదిలా ఉంటే మూడు రోజుల క్రితం ప్రేమికులు మునీర్‌బాషా, రేష్మా ఓ మసీదులో వివాహం చేసుకుని మంగళవారం ఇద్దరూ కలిసి నగర డీఎస్పీ మురళీకృష్ణను కలిశారు. తాము మేజర్‌లమని, పెద్దలు అంగీకరించక పోవడంతో వివాహం చేసుకున్నామని, తమకు రక్షణ కల్పించాలని కోరారు. దీంతో డీఎస్పీ రెండో పట్టణ సీఐతో మాట్లాడి వారిద్దరి సర్టిఫికెట్‌లు పరిశీలించి రక్షణ కల్పించాలని ఆదేశించారు.

 ఇరుక్కుపోయిన పోలీసులు..

ఇరుక్కుపోయిన పోలీసులు..

ఈ ఘటనలో ఇరుకుటుంబాల సభ్యులు కౌన్సెలింగ్‌ పూర్తయ్యి ఒకటవుతుండగా.. అనవసరమైన విషయాల్లో తలదూర్చి రెండో పట్టణ పోలీసులే ఇబ్బందుల్లో పడ్డట్లయింది. ఈ ప్రేమ వ్యవహారంలో ఎలాంటి సంబంధం లేని ప్రేమికుడి సోదరుడు గౌస్ బాషా ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, బాధిత కుటుంబ సభ్యులు తమకు జరిగిన అన్యా యాన్ని మీడియా దృష్టికి తీసుకురావడంతో పాటు తమకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని చెబుతున్నారు.

English summary
Reshma and Muneer Basha both are lovers. They ran away from their house and got married three days back. After this incident Family members of Reshma approached Nellore 2-Town Police and complained against Muneer Basha that he kidnapped their daughter Reshma. Police brought 2 brothers of Muneer and his father to station. they tortured them to know where Muneer is stayed. Due to the torture one of Muneer Brothers, Gouse Basha who is suffering from ill health went into dangerous situation. then police shifted him to a private hospital in the city. After that Couple approached DSP Murali Krishna and told that they both are majors and due to Reshma's family objection, they both ran away and got married. Now police are shocked.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X