• search
 • Live TV
గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

కరోనాను లెక్క చెయ్యని ప్రేమికులు .. పెళ్ళికి పెద్దలు అంగీకరించరని ఆత్మహత్య

|

ఇది కరోనా కాలం . ఎవరూ ఊహించని కష్టకాలం . లాక్ డౌన్ నేపధ్యంలో ప్రజలు అందరూ ఇళ్లకే పరిమితం అవుతున్న కాలం . ఇక ఇలాంటి కాలంలో కరోనా వల్ల దేశం మొత్తం కుదేలవుతున్నా, ఈ పరిస్థితుల నుండి ఎప్పుడు బయట పడతాం భగవంతుడా అని అందరూ బాధ పడుతున్నా ఆ ప్రేమికుల జంటకు అవేవీ పట్టలేదు. కరోనా గురించి అంతా ఆలోచిస్తుంటే ఆ జంట మాత్రం తమ ప్రేమ బంధాన్ని పెళ్లి దాకా తీసుకు వెళ్ళటానికి ఇష్టపడని తమ కుటుంబ సభ్యుల గురించి ఆలోచించారు . ఇప్పుడు ఉన్న పరిస్థితుల తర్వాత కుటుంబ సభ్యులను ఏదో రకంగా నచ్చజెప్పి పెళ్లి చేసుకోవాలి అన్న ఆలోచన మానేసి ప్రాణం తీసుకున్నారు .

చైనా పేరెత్తితేనే భయపడుతున్న జనం .. అదే చైనా వాళ్ళు కనిపిస్తే ఇక హడలే !!

గుంటూరు జిల్లాలో జరిగిన ప్రేమజంట విషాదాంత కథ వివరాల్లోకి వెళ్తే ప్రేమ వివాహాన్ని పెద్దలు అంగీకరించకపోవడంతో మనస్తాపానికి గురైన ఓ ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసుల కథనం ప్రకారం ఒక ప్రైవేట్ ఆస్పత్రి పని చేస్తున్న ఒక యువతీ, ఒక ప్రైవేట్ బ్యాంక్ లో పని చేస్తున్న యువకుడు ఇద్దరూ ప్రేమించుకున్నారు. ఇక వీరి ప్రేమ కాలేజీలో చదువుకుంటున్నప్పటి నుంచే కొనసాగింది . ఇక వీరి పెళ్ళికి పెద్దలు అంగీకరించరని భావించారు. రెండు రోజుల క్రితం ఆత్మహత్యకు పాల్పడ్డారు.

Corona teaches life .. People are accustoming to living in simplicity
  No Social Distancing, Masks In HD Kumaraswamy’s Son Nikhil Wedding Amid Lockdown

  ఆస్పత్రికి వెళ్ళిన యువతి రెండు రోజులుగా ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు యువతి సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ఆమె బ్రాడీపేటలో ఉన్నట్టు గుర్తించి అక్కడికి చేరుకున్నారు. అక్కడ యువతీయువకులు ఇద్దరూ విగతజీవులై కనిపించారు. తమ పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు ప్రాథమికంగా తేల్చారు. ఇక సంఘటనా స్థలంలో క్లూస్ టీం ఆధారాలు సేకరిస్తుంది. మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం పంపించారు .

  English summary
  The love story of a love affair in Guntur district goes back to the days when a love couple was disillusioned with the elders disapproval of a love marriage. According to a police report, a young woman working in a private hospital and a young man working in a private bank were both loved. Their love has continued since they were in college. They felt that the elders cannot accept their marriage so, they committed suicide two days ago.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more