వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీలో పెరిగిన సహజవాయువు ధర- కరోనా, సంక్షేమ పథకాలే కారణం..

|
Google Oneindia TeluguNews

ఏపీలో సహజవాయువు ధరలను ప్రభుత్వం మరోసారి పెంచింది. కరోనా వైరస్‌ కారణంగా ఎదురవుతున్న ఆర్ధిక సంక్షోభాన్ని తట్టుకునేందుకు సహజవాయువు ధరలపై వ్యాట్‌ను భారీగా పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ మేరకు ఇవాళ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఏకంగా పదిశాతం పెరిగిన వ్యాట్‌తో పరిశ్రమలకు వాడే సహజ వాయుపు ధర పెరిగింది.

ఇవాళ రాష్ట్రంలో సహజవాయువుపై వ్యాట్‌ను 14.5 శాతం నుంచి 24.5 శాతం మేర పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పదిశాతం మేర గ్యాస్‌పై వ్యాట్‌ పెంపుకు కరోనా కారణంగా ఎదురవుతున్న ఆర్ధిక ఇబ్బందులు, సంక్షేమ పథకాలను కారణంగా ప్రభుత్వం పేర్కొంది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో సహజవాయువు పరిధిలోకి వచ్చే ఐదు ఉత్పత్తుల ధరలు భారీగా పెరగబోతున్నాయి.

lpg cylinder prices hike in ap as government increase 10 percent vat

రాష్ట్రంలో కరోనా కారణంగా ఖజానాకు రాబడి తగ్గిపోయిందని, ఆదాయం వచ్చే అన్ని దారులూ మూసుకుపోయాయని అందుకే వ్యాట్‌ పెంచక తప్పడం లేదని ప్రభుత్వం తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది. అలాగే ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా సంక్షేమ పథకాలు అమలు చేసేందుకు కూడా ప్రస్తుతం నిధుల కొరత వేధిస్తోందని, ఇలాంటి పరిస్ధితుల్లో వ్యాట్‌ పెంపు కారణంగా కాస్త ఊరట లభిస్తుందని భావిస్తున్నట్లు ప్రభుత్వం తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల్లో తెలిపింది. అంటే కరోనా, సంక్షేమ పథకాలే గ్యాస్‌ ధరల పెంపుకు కారణమయ్యాయని ప్రభుత్వం స్పష్టం చేసినట్లయింది.

అయితే సహజవాయువు ధర పెంపును గ్యాస్‌ సిలెండర్‌ ధర పెంపుగా జరుగుతున్న ప్రచారాన్ని ప్రభుత్వం ఖండించింది. గ్యాస్ సిలెండర్ల ధర జీఎస్టీ పరిధిలో ఉందని, దాని రేట్లు పెంచే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని స్పష్టం చేసింది. ప్రభుత్వం పెంచిన వ్యాట్‌ ప్రభావం గృహ అవసరాలకు వాడే గ్యాస్‌పై పడదని, కేవలం పరిశ్రమలకు అందించే గ్యాస్‌పైనే ఉంటుందని ఓ ప్రకటనలో తెలిపింది.

English summary
lpg prices in andhra pradesh increased once again as government has hiked vat from 14.5 percent to 24.5 percent in wake of covid 19 crisis.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X