వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నోట్లకు చెల్లుబాటు గడువు, రూ.2వేల బదులు 200: గల్లా జయదేవ్‌ కీలక సూచనలు

పెద్ద నోట్ల అంశంపై తెలుగుదేశం పార్టీ పార్లమెంటుసభ్యుడు గల్లా జయదేవ్ లోకసభలో పలు కీలక సూచనలు చేశారు. కరెన్సీ నోట్లకు చెల్లుబాటు గడువు(ఎక్స్‌పైరీ డేట్‌) పెట్టాలని, దీనివల్ల అక్రమంగా దాచుకోవడం .

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పెద్ద నోట్ల అంశంపై తెలుగుదేశం పార్టీ పార్లమెంటుసభ్యుడు గల్లా జయదేవ్ లోకసభలో పలు కీలక సూచనలు చేశారు. కరెన్సీ నోట్లకు చెల్లుబాటు గడువు(ఎక్స్‌పైరీ డేట్‌) పెట్టాలని, దీనివల్ల అక్రమంగా దాచుకోవడం తగ్గుతుందని గుంటూరు ఎంపీ జయదేవ్‌ పేర్కొన్నారు.

LS MP Galla Jayadev suggests expiry dates for big currency notes

గురువారం లోక్‌సభలో చర్చ సందర్భంగా జయదేవ్‌ మాట్లాడుతూ.. ఇప్పుడున్న రూ.2వేల నోటును రద్దుచేసి ఆ స్థానంలో రూ.200 నోటు తీసుకురావాలని కోరారు. మిర్చి రైతుల్ని ఆదుకోవాలని జయదేవ్‌ లోక్‌సభలో డిమాండ్ చేశారు.

గత సంవత్సరం మిర్చి క్వింటాలు రూ.15వేల వరకు ఉండగా ఈ ఏడాది రూ.8వేలకు పడిపోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. రూ.12వేల మద్దతుధర ప్రకటించి రైతులను ఆదుకోవాలని గల్లా జయదేవ్ కోరారు.

English summary
Jayadev Galla (TDP), while participating in a discussion on Finance Bill 2017 to consider the five amendments carried out by the Rajya Sabha, suggested that "big currency notes can have expiry date so that we can have demonetisation from time to time."
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X