వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేడే సంపూర్ణ చంద్రగ్రహణం : ఎప్పటినుంచి ఎప్పటివరకు..? హిందూ క్యాలెండర్ ఏం చెబుతోంది..?

|
Google Oneindia TeluguNews

నేడు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఈ ఏడాది ఇదే మొదటి గ్రహణం కావడం విశేషం. భారత కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి 10.37గం.లకు ఏర్పడే చంద్రగ్రహణం తెల్లవారుజామున 2.42 గంటల వరకు కొనసాగుతుంది. భారత్‌తో పాటు ఆసియా, ఐరోపా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా దేశాలలో గ్రహణం దర్శనమిస్తుంది. జనవరిలో సంభవించే ఈ చంద్ర గ్రహణాన్ని ఇంగ్లిష్‌లో వోల్ఫ్ మూన్ లూనార్ ఎక్లిప్స్ అని అంటారు. వోల్ఫ్ అంటే తోడేలు అని అర్థం.

ఈ చంద్రగ్రహణానికి మరిన్ని పేర్లు

ఈ చంద్రగ్రహణానికి మరిన్ని పేర్లు

వోల్ఫ్ మూన్ లూనార్ ఎక్లిప్స్‌గా పిలిచే ఈ చంద్రగ్రహణాన్ని ఐస్ మూన్,క్రిస్మస్ తర్వాత వచ్చే మూన్,శాకాంబరి పూర్ణిమ,పౌష్ పూర్ణిమ,దురుతు పోయ వంటి పేర్లతోనూ పిలుస్తారు. అమెరికా ప్రజలకు ఈ వోల్ఫ్ మూన్ లూనార్ ఎక్లిప్స్ కనిపించదు.

వోల్ఫ్ మూన్ లూనార్ ఎక్లిప్స్ అనే పేరు ఎలా వచ్చింది?

వోల్ఫ్ మూన్ లూనార్ ఎక్లిప్స్ అనే పేరు ఎలా వచ్చింది?

అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా వివరాల ప్రకారం.. అల్గోన్క్విన్ తెగకి చెందిన ప్రజలు దీన్ని జనవరిలో వచ్చే సంపూర్ణ చంద్రగ్రహణం లేదా చలికాలంలో వచ్చే మొదటి సంపూర్ణ చంద్రగ్రహణంగా పరిగణిస్తారు. ఓవైపు మంచు,మరోవైపు చలి నడుమ తోడేళ్ల సమూహాలు గ్రామాల బయట ఆకలితో అరుస్తుంటాయి. అందుకే దీనికి వోల్ఫ్ మూన్ లూనార్ ఎక్లిప్స్‌గా పేరు వచ్చిందంటారు.

 హిందూ క్యాలెండర్ ప్రకారం

హిందూ క్యాలెండర్ ప్రకారం

హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ చంద్ర గ్రహాణాన్ని శాకాంబరి పూర్ణిమగా వ్యవహరిస్తారు. శాకాంబరి నవరాత్రుల్లో చివరిదైన ఈరోజు శాకాంబరి అమ్మవారిని కొలుస్తారు. అలాగే గంగా నదిలో పవిత్ర స్నానం ఆచరిస్తారు. శ్రీలంక బుద్దిస్టులు దీన్ని దురుతు పొయగా వ్యవహరిస్తారు. గౌతమ బుద్దుడు తొలిసారిగా ఈరోజునే శ్రీలంకలో అడుగుపెట్టాడని అక్కడి బుద్దిస్టుల విశ్వాసం. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని మొదటి సంపూర్ణ చంద్రగ్రహణం రోజున దురుతు పొయను జరుపుకుంటారు.

 ఎలాంటి జాగ్రత్తలు అవసరం లేదు

ఎలాంటి జాగ్రత్తలు అవసరం లేదు

భారత కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి 10.37గం.లకు ఏర్పడే చంద్రగ్రహణం తెల్లవారుజామున 2.42 గంటల వరకు కొనసాగుతుంది. ఈ సంపూర్ణ చంద్రగ్రహాణాన్ని నేరుగా కంటి ద్వారానే వీక్షించవచ్చు. సూర్యగ్రహణం లాగా దీన్ని వీక్షించేందుకు ఇతరత్రా పరికరాలేవి ఉపయోగించాల్సిన అవసరం లేదు. కళ్లకు ఎలాంటి గ్లాసెస్ లేకుండానే టెలిస్కోప్ ద్వారా చంద్రగ్రహాణాన్ని తిలకించవచ్చు.

English summary
Lunar eclipse 2020 is occurring tomorrow, January 10. This coincides the first full Moon of this year, dubbed as “Wolf Moon”. NASA has explained what the Wolf Moon term means, also called Ice Moon or the Moon after Yule, Shakambhari Purnima, Paush Purnima, and Duruthu Poya. The latest eclipse is also the first of the four penumbral lunar eclipses
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X