వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మచిలీపట్నం బీచ్ ఫెస్టివల్ వివాదం: పోలీసులపై కేసు నమోదు?

By Suvarnaraju
|
Google Oneindia TeluguNews

కృష్ణా జిల్లా:మచిలీపట్నం బీచ్ ఫెస్టివల్ లో యువకులకు,పోలీసులకు మధ్య చోటుచేసుకున్న ఓ వివాదం రోజు రోజుకూ ముదురుతోంది.
బీచ్ వాలీబాల్ ఆడుతున్న కొందరు యువకులకు, బందరు చిలకలపూడి సిఐ దుర్గా ప్రసాద్,రూరల్ సిఐ బిబి.రవికుమార్,ఎస్ఐ రంగనాధ్ ల మధ్య వాగ్వాదం వారి మధ్య ఘర్షణకు దారితీసింది.

Machilipatnam Beach Festival Controversy: F.I.R registered on Police
నాగప్రసాద్,ప్రశాంత్,గోపి అనే యువకులను పోలీసులు బీచ్ నుండి పోలీస్ ఔట్ పోస్ట్ వరకు కొట్టుకొంటూ లాక్కొచ్చి ఆ తరువాత కూడా వాళ్లను అజ్ఞాతంలో ఉంచి చిత్రహింసలు పెట్టినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. బాధితుల్లో నాగప్రసాద్ అనే యువకుడు సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ కావడం గమనార్హం. ఈ క్రమంలో సెర్చ్ వారెంట్ దాఖలు కావడంతో పోలీసులు ఆఘమేఘాలపై ఆ ముగ్గురును కోర్టులో హాజరుపర్చారు. మరోవైపు ఈ ఘటనకు సంబంధించి పోలీసులపై ఎఫ్ఐఆర్ నమోదైనట్లు తెలిసింది.

మచిలీపట్నం బీచ్ ఫెస్టివల్‌లో 9 మంది యువకులు అల్లరి చేస్తున్న క్రమంలో అడ్డుకోబోయినందుకు మచిలీపట్నం సీఐని యువకులు కొట్టారంటూ నాగప్రసాద్, ప్రశాంత్, గోపి అనే యువకులను అజ్ఞాతంలో ఉంచి పోలీసులు చిత్రహింసలు పెట్టారు. అయితే యువకుల బంధువులు సెర్చ్‌ వారెంట్‌ తేవడంతో వీరిని పోలీసులు హుట కోర్టులో హాజరుపరిచారు. మరోవైపు పోలీసులు కొట్టడంతో గాయాల పాలైన యువకులను ఆస్పత్రికి తరలించారు. వీరిలో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చేరిన సిఐఎసెఫ్ కానిస్టేబుల్ నాగప్రసాద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇద్దరు సి.ఐలు,ఒక ఎస్సైపై బందరు రూరల్ పోలీసు స్టేషన్లో ఎఫ్.ఐ.ఆర్ నమోదు అయినట్లు తెలుస్తోంది.

అయితే తాము కొట్టిన విషయం బైటకు చెబితే అందరి మీద కేసులు బనాయిస్తామని పోలీసులు తమని బెదిరించినట్లు బాధితుల బంధువులు వాపోయారు. సిఐఎస్ ఎఫ్ కానిస్టేబుల్ అని కూడా చూడకుండా
నాగప్రసాద్ ను కులం పేరుతో దూషించి,చిత్ర హింసలు పెట్టారని ఆరోపిస్తూ మరోవైపు దళిత సంఘాలు ఆందోళనలకు లు సిద్దమవుతున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో సోమవారం కలెక్టరేట్ ముట్టడించాలని,
ఎస్పీ కార్యాలయం వద్ద ధర్నా చేయాలని దళిత సంఘాలు సమాబత్రం అవుతున్నాయని సమాచారం.

English summary
Krishna district: The controversy between 3 men and police at the Machilipatnam Beach Festival is getting intensifying day by day. The F.I.R filed have been filed in the background of allegations that these police are allegedly torturing these three youths.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X