వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్: ప్రయాణీకుల వింత అనుభవం

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

సికింద్రాబాద్: గురువారం రాత్రి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో వింత సంఘటన జరిగింది. ముందస్తు బెర్తుల రిజర్వేషన్ ఇచ్చిన రైల్వే అధికారులు ఏకంగా బోగీని అమర్చడం మరచిపోవడంతో ప్రయాణీకులు రాత్రి సమయంలో గంటపాటు ఆందోళ చెందారు.

వివరాల్లోకి వెళితే... సికింద్రాబాద్ నుంచి మచిలీపట్నం వెళ్లే మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్ గురువారం రాత్రి 10.30కు సికింద్రాబాద్ స్టేషన్ నుంచి బయలుదేరాల్సి ఉంది. రాత్రి 9.30 గంటల ప్రాంతంలో ఈ రైలు 6వ నెంబర్ ఫ్లాట్ ఫామ్ పైకి వచ్చి ఆగింది. మందస్తుగా బెర్తులు రిజర్వేషన్ చేయించుకున్న ప్రయాణికులు ఎస్ఈ-1 బోగి కోసం ఎంత వెతికినా కనిపించలేదు.

Machilipatnam express train wait for one hour lack of bogie

దీంతో ప్రయాణీకులు ఆరా తీయగా... చివరకు ఆ బోగీనే అమర్చడం మరచిపోయారని గుర్తించారు. టీటీలను అడిగినా ప్రయోజం లేకపోవడంతో విసిగిపోయిన ప్రయాణీకులు ఆందోళనకు దిగారు. రిజర్వేషన్ జాబితాను బోగీలకు అంటించే వ్యక్తి వల్ల పొరపాటు జరిగిందని గుర్తించిన అధికారులు ఆ మేరకు సంబంధిత అదికారులుక సమాచారం ఇచ్చారు.

అనంతరం రాత్రి 11.30 గంటల ప్రాంతంలో బోగీని అమర్చడంతో ప్రయాణీకులు వారి వారి బెర్తుల్లోకి వెళ్లారు. ఆ తర్వాత రైలు బయలుదేరి వెళ్లింది.

English summary
Machilipatnam express train wait for one hour lack of bogie in secunderabad railway station.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X