మాధవ్ పోటీ నుండి తప్పుకోవాల్సిందేనా : రిలీవ్ చేయని ప్రభుత్వం : ఇసి కి ఫిర్యాదు..!
పోలీసు మాధవ్ ఎన్నికల బరి నుండి తప్పుకోవాల్సిందేనా. ట్రిబ్యునల్ ఉత్తర్వులు ఇచ్చినా మాధవ్ ను ఇప్పటి దాకా ప్రభుత్వం రిలీవ్ చేయలేదు. దీంతో..చివరి ప్రయత్నంగా మాధవ్ ఎన్నికల సంఘాన్ని కలిసారు. తనను ఉద్దేశ పూర్వ కంగానే ఇబ్బంది పెడుతున్నారంటూ ఇసికి ఫిర్యాదు చేసారు. ఇదే సమయంలో వైసిపి మాధవ్ కు ప్రత్యామ్నాయంగా మరో అభ్యర్దిని సిద్దం చేసింది. సోమవారం ఒక్క రోజు మాత్రమే సమయం ఉంది.
మాధవ్ కు హిందూపూర్ బాధ్యత, జగన్ కీలక నిర్ణయం: అనంత వైసిపి వ్యూహం ఫలించేనా..!

పోటీ నుండి తప్పుకోవాల్సిందేనా..
పోలీసు అధికారిగా ఉంటూ మీసం మెలేసి రాజకీయాల్లోకి వచ్చిన మాధవ్ కు ఇప్పుడు ఇబ్బంది కర పరిస్థితులు వచ్చా యి. ఆయన పోలీసు ఉద్యోగానికి రాజీనామా చేసి వైసిపి లో చేరారు. అనూహ్యంగా హిందూపూర్ లోకసభ అభ్యర్దిగా పార్టీ ప్రకటించింది. అయితే, ఆయన పోలీసు ఉద్యోగానికి స్వచ్చంద పదవీ విరమణ చేసారు. ఎన్నికల్లో పోటీ చేయాలంటే ఉద్యోగానికి చేసిన రాజీనామా ఆమోదించాలి. ఇప్పటి వరకు మాధవ్ చేసిన రాజీనామా ఆమోదించలేదు. దీని పై ఆయ న ట్రిబ్యులన్ కు వెళ్లారు. మాధవ్ కు మద్దతుగా ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చింది. అయినా..ఇప్పటి వరకు రిలీవ్ ఉత్తర్వు లు ఇవ్వలేదు. నామినేషన్లకు ఇంకా ఒక్క రోజు సమయం మాత్రమే ఉంది. దీంతో..మాధవ్ ఎన్నికల బరిలోకి దిగటం పై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆయన పోటీలో దిగేది సందేహంగానే కనిపిస్తోంది.

ఎన్నికల సంఘానికి ఫిర్యాదు..
కోర్టు ఉత్తర్వులు అమలు చేయకుండా కర్నూలు డీఐజీ ఉద్దేశపూర్వకంగానే తప్పించుకు తిరుగుతున్నారని మాధవ్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. డీఐజీ స్థాయి అధికారి తప్పించుకు తిరగడం సిగ్గు చేటని ఆయన అన్నారు. ఇం టిలిజెన్స్ చీఫ్ డైరెక్షన్లోనే డీఐజీ పని చేస్తున్నారని గోరంట్ల ఆరోపించారు. రాజకీయాల్లో చేరే క్రమంలో 2018, డిసెం బరు 30న గోరంట్ల మాధవ్ సీఐ ఉద్యోగానికి రాజీనామా చేసిన విషయాన్ని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకొచ్చారు. రెం డు నెలల క్రితమే వీఆర్ఎస్కి దరఖాస్తు చేసుకున్నారు. కానీ ఏపీ ప్రభుత్వం ఆయన అభ్యర్థనను ఆమోదించకుండా పక్కనబెట్టిందని సీఈఓ కు వివరించారు. ప్రభుత్వంలో ఉన్న అధికారి తనను రిలీవ్ చేయకుండా ఉద్దేశ పూర్వకంగా తప్పించుకుని తిరగడం సిగ్గుచేటని విమర్శించారు.

ప్రత్యామ్నాయం వైపు వైసిపి చూపు..
నామినేషన్లకు ఇంకా ఒక్క రోజు మాత్రమే సమయం ఉంది. శని, ఆది వారాలు నామినేషన్లకు సెలవు. సోమవారం నామి నేషన్లకు చివరి రోజు. దీంతో..చివరి నిమిషంలో టెన్షన లేకుండా వైసిపి ప్రత్యామ్నాయ మార్గాల పై దృష్టి సారించారు.
గోరంట్ల మాధవ్ కు సోమవారం ఉదయం లోగా రిలీవింగ్ ఉత్తర్వులు రాకుంటే..మరో అభ్యర్దిని రంగంలోకి దించాలని వైసిపి నిర్ణయించింది. రిటైర్డ్ జిల్లా జడ్జి కిష్టప్ప పేరు ఖరారు చేసారు. ఆయనను నామినేషన్ దాఖలు చేసేందుకు సిద్దంగా ఉండాలని పార్టీ సూచించింది. దీంతో..మాధవ్ కు చివరి అవకాశం గా భావిస్తున్నారు. సోమవారం హిందూపూర్ సీటు..నామినేషన్ పై తుది నిర్ణయం తీసుకోనున్నారు.