వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీమాంధ్ర నేతల కన్నీళ్లు నమ్మొద్దు: ఎంపి మధుయాష్కీ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Madhu Yashki
హైదరాబాద్: సమైక్యాంధ్ర అంటూ కన్నీళ్లు పెట్టుకునే సీమాంధ్ర నేతలను ఏమాత్రం నమ్మవద్దని నిజామాబాద్ పార్లమెంటు సభ్యులు, కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత మధుయాష్కీ శుక్రవారం అన్నారు. తెలంగాణ ఏర్పాటు ఎట్టి పరిస్థితుల్లో ఆగదన్నారు. తెలంగాణ ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురికావొద్దని, సీమాంధ్రలో ఓట్ల కోసమే అక్కడి నేతలు డ్రామాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు.

సిఎం తీర్మానానికి విలువ లేదు

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నోటీసు పైన తీర్మానానికి ఎలాంటి విలువ లేదని నల్గొండ ఎంపి గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కోర్టుకు వెళ్లాలనే ఆలోచన దింపుటు కళ్లెం వంటిదన్నారు. తమ ప్రాంతానికి ఏం సాధించుకోవాలని ఆలోచించకపోవడం సిగ్గుచేటు అన్నారు.

కిరణ్, చంద్రబాబులులు కుమ్మక్కై తీర్మానం నాటకం ఆడారని మండిపడ్డారు. సీమాంధ్ర నేతలు తమ ప్రాంతానికి ఏం కావాలో ఆలోచించాలని సూచించారు. ఇరు ప్రాంతాలకు న్యాయం జరిగే సవరణలకు తాము సహకరిస్తామని చెప్పారు. కిరణ్ ముఖ్యమంత్రి పదవికి అప్రతిష్ట తెచ్చేలా వ్యవహరిస్తున్నారన్నారు. సీమాంధ్ర నేతలు తెలంగాణ ఆపుతామనే ప్రగల్భాలు మానుకోవాలని హితవు పలికారు.

టి ఓడిపోలేదు

తెలంగాణ ముసాయిదా బిల్లు ఓడిపోలేదని ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణ రెడ్డి అన్నారు. కిరణ్ నియంతలా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. పార్టీ నిర్ణయాన్ని తప్పు పట్టే స్థాయి కిరణ్‌కు లేదన్నారు. సాధారణ ఎన్నికల కంటే ముందే తెలంగాణ వస్తుందని చెప్పారు. సోమవారం తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నేతలు ఢిల్లీకి వెళ్తున్నట్లు చెప్పారు.

English summary
Nizamabad MP and Congress senior leader Madhu Yashki on Friday said that they are not believing Seemandhra leaders tears.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X